కరోనా వల్ల అన్ని వ్యాపారాలు దెబ్బతింటే ఓటీటీ మాత్రం పుంజుకుంది. ఎన్నడూ లేనంతగా రెట్టింపు ఆదాయంతో తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయింది. అలా ఓటీటీల మధ్య కూడా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ హవా ఉంటే భారత్‌లో మాత్రం అమెజాన్ ప్రైమ్ పైచేయి సాధించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ 'మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు?' అని ట్వీట్ చేసింది. దీనికి అమెజాన్ ప్రైమ్ వీడియో 'అందరూ పుష్ప: ద రైజ్ చూస్తున్నారు' అంటూ సమాధానమిచ్చింది.
'అంటే ఆ అందరిలో మేము కూడా ఉన్నామా? ఊ అనం, అలాగే ఉహూ కూడా అనం' అని బదులిచ్చింది. మొత్తానికి ఈ ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే! థియేటర్లలో రికార్డులు బద్ధలుకొట్టిన ఈ సినిమా ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
Saturday night! What's on your watchlist? 🍿
— Netflix India (@NetflixIndia) January 8, 2022
everyone’s watching Pushpa: The Rise 👀 https://t.co/cASFnyyvN5
— amazon prime video IN (@PrimeVideoIN) January 8, 2022
Are we “everyone”?
— Netflix India (@NetflixIndia) January 8, 2022
Ooh anam. Kaani oohoo kooda anam 👀 https://t.co/jWwH6Y8nmw
Comments
Please login to add a commentAdd a comment