‘ఊ అంటావా మావా’.. సోషల్‌ మీడియా సెన్సెషన్‌ చిందులు! | Tanzania Social Media Star Kili Paul Performed Pushpa Oo Antava Song Viral | Sakshi
Sakshi News home page

‘ఊ అంటావా మావా’.. సోషల్‌ మీడియా సెన్సెషన్‌ చిందులు!

Published Tue, Jan 18 2022 9:29 PM | Last Updated on Tue, Jan 18 2022 9:56 PM

Tanzania Social Media Star Kili Paul Performed Pushpa Oo Antava Song Viral - Sakshi

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్‌ఇండియా మూవీ ‘పుప్ప’ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇందులోని పాటలన్నీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసింతే. ముఖ్యంగా హీరోయిన్‌ సమంత ఆడిపాడిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాటకు పెద్దఎత్తున ప్రజాదరణ లభిస్తోంది.

ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. పలువురు ఈ పాటకు డ్యాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాట ఆఫ్రికా దేశమైన టాంజానియా వరకు పాకిపోయింది. టాంజానియా సోషల్ మీడియా స్టార్ కిలిపాల్ ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ పాటకు తనదైనశైలిలో స్టెప్పులేసి, ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టుచేశాడు. దీంతో ఈ పాట సోషల్‌ వీడియోలో వైరల్ మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. లక్షల్లో లైక్‌ చేస్తున్నారు.

కిలిపాల్‌కు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, కిలిపాల్ సోదరి నీమాపాల్ కూడా సోషల్ మీడియా స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే కిలిపాల్‌ పుష్ఫ మూవీలోని ‘సామి’ పాటకు డ్యాన్స్‌ను చేసి ఆకట్టుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు కూడా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల్లాగే డ్యాన్స్ చేసి అలరించాడు కిలిపాల్. అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో పాటు పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు లిప్ సింక్ చేస్తూ పాడటం, డ్యాన్స్ చేయడంతో కిలిపాల్, ఆయన చెల్లెలు నీమాపాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement