Actress Rashmika Mandanna: Full Focus For Pan India Stardom, Details Inside Telugu - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక ప్లాన్‌ మాములుగా లేదుగా.. పాన్‌ఇండియా హీరోయిన్‌ అయినట్లేనా!

Apr 12 2022 10:51 AM | Updated on Apr 12 2022 11:56 AM

Rashmika Full Focus For Pan India Stardom - Sakshi

పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం రష్మిక సీరియస్ గా ట్రై చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో టాలీవుడ్ లో లీడింగ్ లేడీగా మారింది రష్మిక. త్వరలో పుష్ప2లో నటించబోతోంది. కోలీవుడ్ పై కూడా రష్మిక సీరియస్ గా ఫోకస్ పెట్టింది. బీస్ట్ హీరో విజయ్ తో కలసి కొత్త చిత్రంలో నటించబోతోంది. విజయ్ నటిస్తున్న ఈ తెలుగు,తమిళ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు.

కోలీవుడ్  లో టాప్ ఫామ్ లో ఉన్న విజయ్ తో మూవీ ఛాన్స్ అంటే తమిళ సినీ పరిశ్రమలో రష్మికకు ఇన్ స్టెంట్ గా స్టార్ డమ్ కన్ ఫామ్ అన్నట్లే లెక్క. హిందీలోనూ రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. అమితాబ్ తో కలసి గుడ్ బై, సిద్ధార్ద్ మల్హోత్రా జతగా మిషన్ మజ్ను చిత్రాల్లో కనిపించనుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. పుష్పతో ఆల్రెడీ బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరైంది రష్మిక. ఈ రెండు స్ట్రెయిట్ హిందీ మూవీస్ కూడా వర్క్ అవుట్ అయితే మాత్రం నేషన్ క్రష్‌ అక్కడ మామూలుగా ఉండదు.

సొంత ఇండస్ట్రీ శాండల్ వుడ్ లో ఎలాగూ రష్మికకు స్టార్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమా సీతారామం మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆఫ్రిన్ పాత్రలో కనిపించబోతోంది రష్మిక.పేరుకి తెలుగు చిత్రమే అయిన సీతారామం మూవీని మాలీవుడ్, కోలీవుడ్ లో కూడా విడుదల చేయబోతున్నారు. హను రాఘవపూడి మేకింగ్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. మాలీవుడ్ డెబ్యూట్ మూవీనే అక్కడి హార్ట్ త్రోబ్ దుల్కర్ చిత్రం కావడంతో, రష్మిక ఆల్ మోస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతున్నట్లే లెక్క.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement