1st T20 IND Vs SL: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో టి20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశం రానప్పటికి.. బౌలింగ్‌లో జడ్డూ తన మార్క్‌ను చూపించాడు. 4 ఓవర్లు వేసిన జడేజా 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 10 పరుగులు చేసిన వికెట్ కీపర్ చండిమల్‌ను ఔట్ చేసిన జడేజా 'అల్లుఅర్జున్ 'పుష్ప''ను అనుకరించాడు. ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ చేయగానే.. జడేజా తన చేతితో గడ్డాన్ని నిమురుతూ తగ్గేదే లే(మై జూకేకా నహీ) అనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప సినిమా వచ్చి మూడు నెలల కావొస్తున్నా.. దాని ఇంపాక్ట్ మాత్రం ఇప్పటికి పోవడం లేదు.
కాగా మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.
చదవండి: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే'
Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు
Ravindra Jadeja be like:-
— Rutuja Umale (@rutuja_umale) February 24, 2022
Jhukega nahi saala #IndianCricketTeam #IndvsSL #CricketLive #GAMEDAY pic.twitter.com/Sbl7H2Pdbn
Comments
Please login to add a commentAdd a comment