
పుష్ప చిత్రంలో పల్లెటూరి యువతిగా చక్కని నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందిన హీరోయిన రష్మిక మందన్నా. తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీకి జంటగా సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆమెకు ఆశించిన పేరు తీసుకురాలేదనే చెప్పాలి. ఇక ఇటీవల బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన రష్మిక అక్కడ చకచకా రెండు చిత్రాలను పూర్తి చేసింది. అక్కడ మరో చిత్రం చేతిలో ఉంది. ఈ సమయంలో తమిళంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. విజయ్ జంటగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వారీసు చిత్రంలో నటిస్తోంది.
(చదవండి: వారంటే మా నాన్నకు చాలా గౌరవం: అమితాబ్)
కాగా ఈ అమ్మడు అల్లు అర్జున్‌తో జతకట్టిన తెలుగు చిత్రం పుష్ప... ఐదు సైమా అవార్డులను కొల్లగొట్టింది. అయితే అందులో ఏ కేటగిరీలోనూ ఈ అమ్మడికి అవార్డు రాకపోవడం విచారించదగ్గ విషయమే. అయితే ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోని రష్మికపై కనీసం స్పందించలేదు. అయితే ఇటీవల ఓ భేటీలో తన స్నేహితులు, హాస్టల్ జీవితం గురించి ఈమె చెప్పుకొచ్చింది. అందులో తన బాల్యం హాస్టల్‌లోనే గడిచిపోయిందని చెప్పింది. తాను ఎక్కడికి వెళ్లినా స్నేహితులు చుట్టూ ఉండే వారని, వారినే.. తన కుటుంబంగా భావించానని పేర్కొంది.
ఉపాధ్యాయులతోనూ గౌరవంగా ప్రవర్తించే దానినని, వారిలో తన అమ్మను చూసుకునేదాన్ని తెలిపింది. ఇప్పటికీ తన స్నేహితులను కుటుంబంగా భావిస్తానని చెప్పింది. ఇకపోతే హైస్కూల్‌లో తాను సగటు విద్యార్థినేనని తెలిపింది. అయితే ప్లస్–2, డిగ్రీలో మాత్రం తాను క్లాస్ టాపర్‌గా నిలిచానని చెప్పింది. తనకు గణితం, బయాలజీ వంటి సబ్జెక్టులంటే భయమని, అందుకే ప్లస్–2లో తనకు ఇష్టమైన సీఈసీ గ్రూపును తీసుకుని డిగ్రీ వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచానని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment