Pushpa Movie Craze: Allu Arjun Pushpa Movie Is One Of The Iconic Film In Indian Cinema History - Sakshi

Allu Arjun: ఆ రికార్డు ‘పుష్ప’కే సొంతం

Mar 9 2022 3:04 PM | Updated on Mar 9 2022 3:38 PM

Allu Arjun Pushpa Movie Is One Of The Iconic Film In Indian Cinema History - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’చిత్రం రికార్డులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈమూవీ క్రేజ్‌ ఇప్పటికీ కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని ‘తగ్గేదేలే’అనే డైలాగ్‌ వయసుతో సంబంధం లేకుండా అందరూ వాడేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా పుష్ప డైలాగ్స్‌ని వాడుకుంటున్నారు.

ఇటీవల జరిగిన ఇండియా, శ్రీలంక మ్యాచ్‌లో ద్ర జడేజా సెంచరీ చేసిన తర్వాత, వికెట్ తీసిన తర్వాత తగ్గేదే లే అంటూ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సహా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ చేశారు.

తాజాగా సెన్సేషనల్ హీరో రణవీర్ సింగ్ కూడా తగ్గేదే లే అనేశాడు.రాజకీయ నాయకులు కూడా పుష్ప సినిమా డైలాగులు తమ ప్రచారంలో వాడుకుంటున్నారు. ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ స్పీచ్ ఇస్తున్నారు. ఒక సినిమాలోని డైలాగ్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఇంతమంది వాడుకోవడం బహుశా ఒక్క పుష్పకే సొంతం కావొచ్చు.  ఇప్పట్లో ఈ క్రేజు తగ్గేలా కనిపించడం లేదు.  ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ సినిమాలో తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement