'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్‌ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తున్న ఈ నటుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండటం షాకింగ్‌గా అనిపించింది.
ఇంతకీ ఏమైంది?
ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన సదరు మహిళ (జూనియర్ ఆర్టిస్టు).. గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. దీనంతటికి కారణం 'పుష్ప' నటుడు జగదీష్ అని నిర్ధారించుకున్నారు.
అయితే గత కొన్నిరోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇతడిని.. అరెస్ట్ చేసి, కోర్టులో బుధవారం హాజరు పరిచారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.
ఇక జగదీష్ కెరీర్ విషయానికొస్తే.. మల్లేశం, జార్జిరెడ్డి, పలాస 1978 తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సుకుమార్ దృష్టిలో పడి 'పుష్ప' లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకున్నాడు. మచ్చ మచ్చ అని అల్లు అర్జున్ కూడా ఉండే పాత్రలో కామెడీ పండించాడు. 'సత్తిగాని రెండెకరాలు' అనే సినిమాలో హీరోగానూ నటించాడు. 'పుష్ప 2'తో బిజీగా ఉన్న ఇతడు అరెస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment