Samantha Remuneration Is Not 1.5 Crore For Pushpa Item Song, Check Details - Sakshi
Sakshi News home page

Samantha Remuneration: ఐటం సాంగ్‌కు అన్ని కోట్లు ఇచ్చాక సమంత ‘ఉఊ’ అంటుందా! ఒకటా రెండా ఏకంగా?

Published Mon, Jan 17 2022 10:46 AM | Last Updated on Mon, Jan 17 2022 12:08 PM

Samantha Remuneration Is Not Rs 1.5 Crore For Pushpa Item Song, Check Details - Sakshi

ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. ఈ పాట ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. స‌మంత అంద‌చందాలు, స్టెప్పులు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించాయి. ఈ సాంగ్ ఎంత వివాద‌మ‌య్యిందో అంత‌కంటే ఎక్కువ సెన్సేష‌నల్ హిట్ అయింది. అయితే ఈ పాట‌లో ఆడిపాడేందుకు స‌మంత ముందు ఒప్పుకోలేద‌ట‌. కానీ బ‌న్నీ ద‌గ్గ‌రుండి ఆమెను ఒప్పించ‌డంతో పుష్ప‌లో సామ్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది.

ఇక ఈ సాంగ్ కోసం రూ.5 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా అందులో స‌మంతకు కోటిన్న‌ర రూపాయ‌ల పారితోషికం ఇచ్చిన‌ట్లు మొద‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ జాతీయ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం సామ్ మూడు నిమిషాల పాట‌ కోసం ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంద‌ట‌. ఈ పాట‌కు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌గా ఇంద్ర‌వ‌తి చౌహాన్ ఆల‌పించారు. కాగా అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన పుష్ప చిత్రం డిసెంబ‌ర్ 17న విడుద‌లైంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement