ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అమ్మాయి మోనాలిసా. తన జీవవోపాధి కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు ఊహించని విధంగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియానే. కుంభమేళాలో పూసలు విక్రయిస్తున్న ఆమెను ఓ నెటిజన్ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. ఇంకేముంది కొద్ది గంటల్లోనే ఆమె వీడియోలు వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతే కాదు దెబ్బకు బాలీవుడ్ సినిమా ఆఫర్ ఆమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చేసింది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో అవకాశమిచ్చాడు. అంతేకాదు ఆమె ఇంటికి వెళ్లి మరి అగ్రిమెంట్ చేసుకున్నారు.సినిమా ఆఫర్ రావడంతో మోనాలిసా భోంస్లే ఆనందం వ్యక్తం చేసింది. సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.
ఐకాన్ స్టార్‌తో మోనాలిసా..
తాజాగా మోనాలిసా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఫోటోకు పోజులిచ్చింది. పుష్ప-2 మూవీ పోస్టర్‌తో దిగిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు పోస్టర్‌తో బయట ఉన్నా.. రేపటి రోజున థియేటర్లో కనిపిస్తా.. త్వరలోనే ముంబయిలో కలుద్దాం.. అల్లు అర్జున్ పుష్ప-2 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఊహించని విధంగా ఫేమ్..
మహాకుంభ్ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌కు పంపించేశారు.
आज पोस्टर के बहार कल अंदर होंगे यही समय का चक्र है
जल्दी ही मुंबई में मिलेंगे
अल्लू अर्जुन पुष्पा -2 pic.twitter.com/zwEpb8x4Dp— Monalisa Bhosle (@MonalisaIndb) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment