సంధ్య థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) తొలిసారి స్పందించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించడం తనను ఎంతో బాధించిందని అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘మద్రాస్ కారన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడారు. రేవతి విషయం తెలియగానే తన మనసు ముక్కలైందని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎవరూ ఊహించరని, బన్నీ కూడా షాక్‌కి గురైయ్యారని చెప్పారు. అందరి ప్రేమాభిమానంతో అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారని తెలిపారు.
(చదవండి: ఆ ట్రోల్స్ తట్టుకోలేక వారం రోజులు డ్రిపెషన్‌లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి)
ఇక తన ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. లుక్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని, ప్రతి సినిమాకు తన స్టైల్‌ని మార్చుకుంటాడని.. ఆ విషయంలో బన్నీ నుంచి స్ఫూర్తి పొందుతానని చెప్పింది. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలనే విషయం రామ్ చరణ్‌ను చూసి నేర్చుకుంటానని అన్నారు. ఇక కథల ఎంపిక విషయంలో గందరగోళానికి గురైతే వరుణ్ తేజ్ సలహా తీసుకుంటానని చెప్పారు.
సంథ్య థియేటర్ ఘటన నేపథ్యం
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2: The Rule) చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసింది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోకి బన్నీ వెళ్లారు. బన్నీ వస్తున్నాడని విషయం తెలిసి అతని అభిమానులు పెద్ద ఎత్తున ఆ థియేటర్ వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే యువతి మరణించగా..ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో బన్నీపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం బన్నీ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కాగా.. ఇప్పుడు నిహారిక స్పందించింది.
హీరోయిన్‌గా రీఎంట్రీ
బుల్లితెర యాంకర్‌గా కెరీర్‌ని ఆరంభించింది మెగా డాటర్ నిహారిక. ఆ తర్వాత కొన్నాళ్ల ‘ఒక మనసు’సినిమాతో హీరోయిన్‌గా మారింది. ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. దీంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. పలు వెబ్ సిరీస్‌లు నిర్మించింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’ మంచి విజయం సాధించింది. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్నా నిహారిక.. ‘మద్రాస్ కారన్’ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. షాన్ నిగమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్యదత్తా కీలకపాత్ర పోషించారు.ఈ చిత్రం పొంగల్ కానుకగా.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.మద్రాస్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment