సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అయితే, ఇదే కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పుష్ప-2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో భాగంగా వారిని విచారించవచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే వారిని అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
రేవతి మృతికి బన్నీ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు బీఎన్‌ఎస్ 105 సెక్షన్ చెల్లదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఒకవేళ అల్లు అర్జున్‌కు బెయిలు ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలివ్వాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. బన్నీ రెగ్యూలర్ బెయిల్ విషయంలో పోలీసులు, అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనలను కోర్టు ఇప్పటికే పరిశీలించింది. అయితే, తీర్పును నేటికి వాయిదా వేసింది. దాదాపు ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment