Nayan Sarika
-
మెరిసే... మురిసే...
సిల్వర్ స్క్రీన్‌పై మెరుపులా మెరవడానికి మెరుపు తీగల్లాంటి కథానాయికలు జోరుగా హుషారుగా సినిమాలు చేస్తుంటారు. ఒకే ఏడాది మూడు ఆపై ఎక్కువసార్లు తెరపై మెరిసే చాన్స్ వస్తే వాళ్ల ఆనందం పట్టలేనంతగా ఉంటుంది. ఈ ఏడాది అలా మినిమమ్ మూడు చిత్రాలతో తెలుగులో మెరిసి, కెరీర్ బాగున్నందుకు మురిసిపొయిన కథానాయికల గురించి తెలుసుకుందాం.2024లో తెలుగు తెరపై మీనాక్షీ చౌదరి హవా కనిపించింది. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో మీనాక్షీ చౌదరి వెండితెరపై కనిపించారు. అంతేనా... తమిళ హీరో విజయ్ ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ తెలుగులో అనువాదమై, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఓ లీడ్ రోల్ చేశారు మీనాక్షి. ‘లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో విడుదల కావడం విశేషం. ఇక ‘గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, గోట్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి.మరోవైపు తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఈ ఏడాది మంచి జోరు కనబరిచారు. హారర్ మూవీ ‘తంత్ర’లో లీడ్ రోల్ చేసి, రూరల్ యాక్షన్ ఫిల్మ్ ‘΄÷ట్టేల్’లో గృహిణిగా భావోద్వేగభరితమైన పాత్ర చేశారు. ప్రియదర్శి–నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘డార్లింగ్’లోనూ డాక్టర్‌గా ఓ లీడ్ రోల్ చేశారీ బ్యూటీ. అలాగే నేడు విడుదలవుతోన్న ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ చిత్రంలోనూ ఓ లీడ్ చేశారు. ఇలా అనన్య ఈ ఏడాది నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఇక ముంబై బ్యూటీ కావ్యా థాపర్ కూడా తెలుగు ప్రేక్షకులను ఈ ఏడాది తరచూ పలకరిస్తూ వచ్చారు.రవితేజ ‘ఈగిల్’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ ‘విశ్వం’ చిత్రాల్లో కావ్యా థాపర్ కనిపించారు. ఓ మంచి కమర్షియల్ హీరోయిన్గా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను అలరించారు కావ్యా థాపర్. మరోవైపు హీరోయిన్గా పరిచయమైన తొలి ఏడాదే మూడు సినిమాలతో సత్తా చాటారు యువ హీరోయిన్ నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాల్లో హీరోయిన్గా చేశారీ బ్యూటీ.నయన్ చేసిన ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆమె కెరీర్‌కు బలం చేకూరినట్లయింది. ఇక హీరోయిన్గా కాదు కానీ... కథను ఇంపాక్ట్ చేసే పాత్రల్లో రుహానీ శర్మ కనిపించారు. వెంకటేశ్ ‘సైంధవ్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, సుహాస్ ‘శ్రీరంగనీతులు’ చిత్రాల్లో రుహానీ మంచి పాత్రలు చేశారు. ‘లవ్ మీ’ చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్లో కూడా కనిపించారు రుహానీ. ఇలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను తరచూ పలకరించిన మరికొంతమంది హీరోయిన్లు ఉన్నారు.విలన్‌గానూ విజృంభించారు సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్క్వేర్’లో స్పై ఏజెంట్ లిల్లీ జోసెఫ్‌గా, రవితేజ ‘ఈగిల్’లో జర్నలిస్ట్ నలినీ రావుగా కనిపించారు అనుపమా పరమేశ్వరన్. అయితే ‘డీజే టిల్లు 2’లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనుపమ నటించడం విశేషం. ఈ తరహాలోనే మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న అప్సర ఆలియాస్ మాయ పాత్రను విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సిని మాలో చేశారు. ఈ బ్యూటీయే వెంకటేశ్ ‘సైంధవ్’లో మనోజ్ఞ అనే సెంటిమెంట్ రోల్లో కనిపించడం విశేషం. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్గా చేసిన శ్రీలీల, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’లో మెరిశారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగులో రష్మిక కనిపించిన చిత్రం ఇదొక్కటే. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో మృణాల్ ఠాకూర్ (‘కల్కి 2898 ఏడీ’లో ఓ గెస్ట్ రోల్ చేశారు), శర్వానంద్ ‘మనమే’లో ఐటీ ఉద్యోగిగా కృతీ శెట్టి, ఫ్యామిలీ డ్రామా ‘35: చిన్న కథ కాదు’లో గృహిణి సరస్వతిగా నివేదా థామస్‌ల నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అనుష్క, సమంత, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ వంటి హీరోయిన్లు ఇతర భాషల చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది తెలుగులో కనిపించలేదు. ఇక ఈ ఏడాది దీపికా పదుకోన్, భాగ్యశ్రీ భోర్సే, రుక్మిణీ వసంత్... ఇలా దాదాపు 20మంది హీరోయిన్లు తెలుగుకు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా...
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్‌తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్. డాటర్ ఆఫ్ శ్రీదేవి దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. భాగ్యశ్రీ బిజీ బిజీ పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్‌గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ. తెలుగు తెరపై మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్‌కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. ఎప్పుడో కాదు... ఇప్పుడే! గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్‌గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్‌కు దక్కిందని తెలిసింది. ఒకేసారి మూడు సినిమాలు ఓ హీరోయిన్ కెరీర్‌లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది. ఇటు తెలుగు... అటు తమిళం తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
శ్రీలీల, కృతి శెట్టి ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందా..?
-
బ్లూ శారీలో క మూవీ హీరోయిన్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ!
మెహందీ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ రహస్య గోరఖ్..సిటాడెల్ లుక్‌లో సమంత స్పెషల్ లుక్స్..బ్లూ శారీలో మెరిసిపోతున్న క మూవీ హీరోయిన్ నయన్ సారిక..అక్టోబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్..పర్వతాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్..కలర్‌ఫుల్ శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
నేను నమ్మిందే నిజమైంది : కిరణ్ అబ్బవరం
‘క’ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, చివరి 20 నిమిషాలు చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారని నమ్మాం. ఇప్పుడు థియేటర్స్‌లో క్లైమాక్స్ సీన్ చూసి అందరు చప్పట్లు కొడుతుంటే నేను నమ్మిందే నిజమైంది అని అనిపించింది. సినిమాకు వెళ్లిన వారు క్లైమాక్స్ మిస్ కాకుండా చూడండి. చివరిలోనే కథలోని ఎస్సెన్ ఉంది’ అని అన్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. దీపావళి కానుకగా నిన్న(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకులు సుజీత్, సందీప్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "క" సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మా మూవీకి ఎంతో సపోర్ట్ లభిస్తోంది. "క" సినిమా విజయంతో ఈ దీపావళిని మాకు ఎంతో స్పెషల్ గా చేశారు. నేను మా టీమ్ పర్సనల్ గా వచ్చి మిమ్మల్ని కలుస్తాం’ అన్నారు.(చదవండి: ‘క’ మూవీ రివ్యూ)దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ - "క" సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. మేము నమ్మిన కథ ప్రేక్షకుల ఆదరణ రూపంలో విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఒక కొత్త కంటెంట్ ను, కొత్త నేరేటివ్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నతీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రొడ్యూసర్ గోపి గారికి, వంశీ గారికి, కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. భవిష్యత్ లోనూ ఇలాంటి మంచి మూవీస్ చేస్తామని మాటిస్తున్నా. అన్నారు.దర్శకుడు సందీప్ మాట్లాడుతూ - కంటెంట్ బాగున్న సినిమాలు వస్తే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేందుకు "క" లేటెస్ట్ ఎగ్జాంపుల్ . కొత్తగా సినిమాను చేస్తే మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. ముందు ఇలాంటి కొత్త కథను యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ రోజు మా సినిమాను ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారంటే ఎవరైనా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడితే వారికి ప్రేక్షకులే సమాధానం ఇస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చుకునే ఇంకా మంచి స్క్రిప్ట్స్ తో సినిమాలు చేయాలనుకుంటున్నాం. అన్నారు. -
KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ
టైటిల్: కనటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులునిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి దర్శకత్వం: సుజీత్, సందీప్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసంఎడిటర్: శ్రీ వరప్రసాద్విడుదల తేది: అక్టోబర్ 31, 2024చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని ఏకంగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘క’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ ఆసక్తినికి మరింత పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?ఇదొక డిఫరెంట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దర్శకద్వయం సందీప్, సుజిత్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. వినడానికి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ పేపర్‌పై రాసుకున్న కథను అర్థవంతంగా ప్రేక్షకులకు చూపించడంతో పూర్తిగా సఫలం కాలేదు.కథగా చూస్తే ఇది పాతదే. కానీ దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాల వరకు ప్రేక్షకుడికి ఒక రకమైన అభిప్రాయం ఉంటే..క్లైమాక్స్ తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. కిరణ్‌తో పాటు చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో చెప్పినట్లు నిజంగానే ఈ మూవీ క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఓ కథను చెప్పొచ్చా? అని ప్రేక్షకుడు ఆలోచిస్తూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు.ముసుగు వేసుకున్న వ్యక్తి హీరోని ఓ గదిలో బంధించడం..పక్క గదిలో మరో హీరోయిన్ ఉండడం..ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? ఎందుకు హీరోని బంధించాడు? తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటి సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి కలిగించారు. ముసుగు వ్యక్తిని కొంతమంది గుర్తించినా..చివర్లో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉమెన్ ట్రాఫికింగ్ పాయింట్ రివీల్ అయ్యేవరకు దర్శకులు కథను నడిపించిన తీరు బాగుంది. అయితే ఉమెన్ ట్రాఫికింగ్ ఒక్కటే ఈ సినిమాలో ప్రధానాంశం కాదు. ముఖమైన మరో పాయింట్ కూడా ఉంటుంది. ఆ పాయింట్ కూడా పాతదే అయినా దాని చుట్టు అల్లుకున్న కథనం కొత్తగా ఉటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లో వరుసగా ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి. అయితే ఓ ఫ్లోలో వెళ్తున్న కథకి హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తుంది. సంభాషణలు కూడా బలంగా ఉండకపోవడం మరో మైనస్. అయితే చివరి 20 నిమిషాలో వచ్చే సన్నివేశాలు మాత్రం సినిమా పై అప్పటి వరకు ఉన్న ఒపీనియన్‌ను మారుస్తాయి. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..గత సినిమాలతో పోల్చుకుంటే నటన పరంగా కిరణ్ అబ్బవరం చాలా మెరుగుపడ్డాడు. పోస్ట్ మ్యాన్ వాసుదేవ్ పాత్రలో జీవించేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డైలాగ్ డెలివరీ కూడా పర్వాలేదు. హీరోయిన్ నయని సారిక తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే అని చెప్పాలి. ఇక మరో హీరోయిన్ తన్వి రామ్‌కి మంచి పాత్రే లభించింది. స్కూల్ టీచర్ రాధగా ఆమె చక్కగా నటించింది. బలగం జయరామ్, అచ్యుత్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 70ల కాలంనాటి పరిస్థితులను తెరపై చక్కగా చూపించారు. రాత్రివేళ వచ్చే సీన్స్ అద్భుతంగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్