ఎంత కట్నం తీసుకున్నావ్‌? కిరణ్‌ అబ్బవరం ఆన్సరిదే! | Kiran Abbavaram Gives Clarity On Dowry For His Wedding, Comments About His Love Story | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: రహస్యతో పెళ్లి.. కట్నం గురించి హీరో ఏమన్నాడంటే?

Published Thu, Oct 31 2024 7:59 PM | Last Updated on Fri, Nov 1 2024 10:31 AM

Kiran Abbavaram Gives Clarity on Dowry for his Wedding

ఎవరి సపోర్ట్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగాడు కిరణ్‌ అబ్బవరం. మొదట్లో హిట్లు, తర్వాత ఫ్లాప్స్‌ కూడా అందుకున్న ఈ హీరో తాజాగా క సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నచ్చకపోతే ఇకమీదట సినిమాలే చేయను అని శపథం చేశాడు. ఎంత బలంగా కథను నమ్మితే ఆయన ఆ మాట అని ఉంటాడు! హీరో గుండెధైర్యాన్ని జనాలు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. 

కట్నం?
ఈ రోజు (అక్టోబర్‌ 31) థియేటర్లలో కూడా క మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్‌ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. ఎంత కట్నం తీసుకున్నావు? అన్న ప్రశ్నకు 'నేను కట్నం తీసుకోలేదు. నాకలాంటివి ఇష్టం ఉండవు. కాకపోతే వాళ్ల కూతురికి ఏమైనా నచ్చితే పెట్టుకోనీ.. అది వాళ్ల ఇష్టం' అని చెప్పుకొచ్చాడు.

లవ్‌ జర్నీ
కాగా రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్‌, రహస్య హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రం షూటింగ్‌ సమయంలోనే లవ్‌లో పడ్డారు. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇటీవలే పెళ్లి చేసుకుంది. అగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement