Kiran Abbavaram
-
లవ్ అప్డేట్స్ గురూ
ప్రేమికుల రోజు(Valentine Day) సందర్భంగా ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల నుంచి ‘లవ్ అప్డేట్స్ గురూ’ అంటూ శుక్రవారం కొందరు తమ సినిమాల నుంచి పాటలు, లుక్స్ రిలీజ్ చేయగా, మరికొందరు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళదాం...⇒ నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వేర్ఎవర్ యు గో’.. అంటూ సాగే రెండో పాటని హీరో మహేశ్‌బాబు లాంచ్ చేశారు. ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు. ⇒ సిద్ధు జొన్నలగడ్డ రోగా నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ⇒ కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సింది. అయితే తాజాగా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, కిరణ్ అబ్బవరం పోస్టర్ని రిలీజ్ చేశారు. ⇒ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి సుహాస్, మాళవికా మనోజ్‌ల సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.⇒ హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ప్రేమలో..’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. ⇒ మోహిత్ పెద్దాడ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ యునిక్‌గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అన్నారు. -
'లవర్స్ డే రోజున దిల్ రూబా'.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కిరణ్ అబ్బవరం
'క' మూవీ సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్రూబా (Dil Ruba). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లవర్స్ డే కానుకగా సినీ ప్రియులను అలరించనుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దిల్రూబా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 14న సినిమాను రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొంచెం ఆలస్యంగా వస్తున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కిరణ్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్లో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున విడుదవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.విశ్వక్ సేన్ లైలా రిలీజ్..అయితే ఈ లవర్స్ డే కానుకగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీకి రామ్ నారాయణ దర్శకత్వం వహించారు. Koncham late ga vastunam :) #dilruba pic.twitter.com/H6UMPDLuwr— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 12, 2025 -
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
కిరణ్ అబ్బవరం ఛాన్స్.. చాలా రోజుల తర్వాత వైరల్ అవుతున్న హర్యానా బ్యూటీ (ఫోటోలు)
-
కె ర్యాంప్ షురూ
‘క’వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా ‘కె–ర్యాంప్’(K Ramp) అనే మూవీ షురూ అయింది. నూతన దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యుక్తీ తరేజా హీరోయిన్ . హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు.తొలి సన్నివేశానికి యోగి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్నలు మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, నటుడు వీకే నరేశ్ పాల్గొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, వీకే నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్, సహ–నిర్మాతలు: బాలాజి గుట్ట, ప్రభాకర్ బురుగు. -
కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ‘K ర్యాంప్’ ప్రారంభం (ఫొటోలు)
-
గతేడాదిలో పెళ్లి.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
గుడ్ న్యూస్ చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaraam), నటి రహస్య(Rahasya) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈమేరకు ఆయన సోషల్‌మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశాడు. తమ ప్రేమ మరో రెండు అడుగులు ముందుకు పడింది అంటూ తన సతీమణితో దిగిన ఫోటోను పంచుకున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో గతేడాది ఆగష్టులో ఏడడుగులు వేశాడు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ పెద్దలను ఒప్పించి ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు.ఇన్స్టాగ్రామ్, ఎక్స్ పేజీలో రహస్యతో దిగిన ఫోటోలను కిరణ్ అబ్బవరం షేర్ చేశాడు. బేబీ బంప్‌తో ఉన్న రహస్యకు పలు సూచనలు ఇస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్' సినిమా నటి)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం 'క' అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని రహస్య దగ్గరుండి చూసుకుంది. 'క' తర్వాత కిరణ్ 'దిల్రూబా'(Dil Ruba) అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథతో ఇది తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. లుక్ అదిరింది!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "రాజా సాబ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది.దిల్ రూబా పండగ పోస్టర్యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "దిల్ రూబా" సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.చదవండి: టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత -
కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా ’మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది!
క సినిమాతో కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అతడి పనైపోయిందని విమర్శించినవారితోనే భలే సినిమాతో వచ్చాడని మెచ్చుకునేలా చేశాడు. ప్రస్తుతం ఇతడు దిల్రూబా అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.శుక్రవాం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మ్యాగీ తన ఫస్ట్ లవ్ అని.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలయినట్లు మొదటి ప్రేమలో విఫలమయ్యానంటూ హీరో వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్‌లోకి అంజలి వచ్చిందంటూ హీరోయిన్ను చూపించారు. వీళ్ల ప్రయాణం, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపించారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చిన క్లాసిక్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా ఉంది.ప్రేమ గురించి చెప్పడమైపోగానే కిరణ్ యాక్షన్ మోడ్‌లోకి మారాడు. తనకు అడ్డొచ్చినవారిని కోపంతో చితక్కొట్టాడు. ప్రేమ చాలా గొప్పది.. కానీ అదిచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది అన్న డైలాగ్‌తో టీజర్ ముగిసింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. దవ -
కిరణ్ అబ్బవరం సతీమణి 'రహస్య' పంచుకున్న గతేడాది తీపి జ్ఞాపకాలు (ఫోటోలు)
-
కొంచెం కొత్తగా ఉందాం
క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు. మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్.రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.⇒ మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.⇒ వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్‌పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.⇒ మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?⇒ కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.⇒ చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడగతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్‌కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.⇒ ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..! – చంద్రబోస్హెల్త్... హార్డ్వర్క్మనం ప్రతి ఒక్కరం కెరీర్ కోసం చాలా కష్టపడతాం. హార్డ్‌వర్క్ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్ వర్క్... హెల్త్... హ్యాపీనెస్... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్‌ని ప్లాన్ చేసుకుని పాజిటివ్‌గా ముందుకెళ్లడమే. కెరీర్ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం, నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్‌లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్లో ఎంత సక్సెస్‌పుల్‌గా .. ఎంత టీమ్ స్పిరిట్‌తో.. ఎంత ఎఫర్ట్ఫుల్గా పనిచేశామన్నది ముఖ్యం.రేటింగ్ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్ ట్రిప్‌కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.2025 మీద నా అంచనాలు: షూటింగ్‌లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్ స్టోరీస్, అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్ అయినా 2025లో రిలీజ్ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం, నా గోల్స్. – ఆనంద్ దేవరకొండస్ట్రాంగ్గా... పాజిటివ్‌గా...మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్ లవ్’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్ ఫీలింగ్‌తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్‌గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్స్ట్రెంగ్త్పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్‌స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.ప్రొఫెషన్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్‌గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్లప్రశాంతతకు ప్రాధాన్యంరోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.ప్రొఫెషన్‌గా, కెరీర్‌పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్ అంతా ఎంతో హార్డ్‌వర్క్ చేసిన నా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం నా కెరీర్లో మెమరబుల్ మూమెంట్‌గా చెప్పుకుంటాను.1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. ఇంక న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారా.. బీ గుడ్ టు అదర్స్. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్. ఇంకా.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటున్నాం. – కిరణ్ అబ్బవరంప్రతి టైమ్ మంచిదేజీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్‌గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను. నా వరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఇచ్చాను. ప్రతి టైమ్ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్‌ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్‌కు డబుల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేశాను. హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్ -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్‌లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్‌ల్యాండ్‌లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్‌లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్‌లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
ఈ క్రిస్మస్ మనదే: ‘అల్లరి’ నరేశ్
‘‘బచ్చలమల్లి’ సినిమాని యూనిట్ అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. ఈ మూవీని హిట్ చేస్తారా? లేక బ్లాక్‌బస్టర్ చేస్తారా? లేదంటే కల్ట్ చేస్తారా? అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఈ క్రిస్మస్ మనదే’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృతా అయ్యర్ హీరోయిన్ . సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్తా మీనన్, దర్శకులు మారుతి, నక్కిన త్రినాథరావు, విజయ్ కనకమేడల, కార్తీక్ దండు, యదు వంశీ, ‘బలగం’ వేణు, వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై, ‘బచ్చలమల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ–‘‘బచ్చలమల్లి’ పాత్రను నరేశ్‌గారు మాత్రమే చేయగలరు. కావేరి పాత్రకు అమృత మాత్రమే న్యాయం చేయగలరు. రాజేష్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నేను ఎంతో ప్రేమించి చేసిన కథ ఇది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని అమృతా అయ్యర్ చెప్పారు. -
విజయనగరంలో ‘క’ సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి (ఫొటోలు)
-
ఆ ధైర్యాన్ని క ఇచ్చింది: కిరణ్ అబ్బవరం
‘‘క’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ‘క’ ఇచ్చింది. మా మూవీ సక్సెస్‌కు కారణమైన డైరెక్టర్స్ సందీప్, సుజీత్, నిర్మాత గోపీ, డిస్ట్రిబ్యూటర్ వంశీగార్లకు కృతజ్ఞతలు’’ అని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సుజీత్, సందీప్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘క’. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో ప్రోడ్యూసర్ వంశీ నందిపాటి అక్టోబరు 31న విడుదల చేశారు.శనివారం నిర్వహించిన ‘క’ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా ‘క’ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘క’ సినిమాకు థియేటర్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అని సుజీత్ తెలిపారు. ‘‘మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ‘క’ సినిమా సక్సెస్‌కు కారణం’’ అన్నారు సందీప్. -
కిరణ్ అబ్బవరానికి సారీ చెప్పిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' ట్రైలర్ ఆదివారం రిలీజైంది. అలా విడుదల చేశారో లేదో ఇలా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ అదరిఇపోయిందంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే క మూవీతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం సైతం వైల్డ్ఫైరూ.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూా ట్వీట్ చేశాడు.తప్పకుండా చూస్తా..దీనికి బన్నీ స్పందిస్తూ.. థాంక్యూ మై బ్రదర్.. అలాగే నువ్వు హిట్ అందుకున్నందుకు శుభాకాంక్షలు. బిజీగా ఉండటం వల్ల క సినిమా చూడలేకపోయాను. అందుకు క్షమించు. తప్పకుండా నీ సినిమా చూసి నీకు కాల్ చేస్తాను అని రిప్లై ఇచ్చాడు.బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా 'క'ఇకపోతే కిరణ్ అబ్బవరం క మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివకార్తికేయన్ అమరన్ సినిమాలతో పోటీపడిన కిరణ్.. బ్లాక్‌బస్టర్ హిట్టు అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. Thank u my brotherrrr 🖤🖤🖤 . Andddd Congratulations… Sorry could not see the film in this busy time . Will def watch and call you 🖤— Allu Arjun (@alluarjun) November 18, 2024 -
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే.. కొత్తకారుతో సెలబ్రేషన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది.అంటే సుందరానికి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ తన్వీ రామ్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రలో మెరిసింది. తాజాగా కిరణ్ అబ్బవరం క మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ ఇటీవల తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఏడాది పుట్టినరోజున కొత్తకారును కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మా కుటుంబంలో కొత్త మెంబర్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
తెలుగులో సూపర్ హిట్ మూవీ.. ఆ భాషలోనూ గ్రాండ్ రిలీజ్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.తెలుగులో సూపర్‌హిట్‌గా నిలిచిన క మూవీని తాజాగా మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం పోస్టర్‌ను షేర్ చేశారు. మాలీవుడ్‌లో హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ క మూవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 22న మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా.. దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.Nov 22nd ❤️@DQsWayfarerFilm #KA pic.twitter.com/bifoaytvs9— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 13, 2024 -
'క' టీమ్‌ను అభినందించిన మెగాస్టార్.. కిరణ్ అబ్బవరం పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.(ఇది చదవండి: కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు)తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'క' మూవీ టీమ్‌ను అభినందించారు. వారితో దాదాపు గంటకుపైగా మాట్లాడారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చిరంజీవితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుందని కిరణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Appreciation from the BOSS 😇Thank you so much @KChiruTweets gaaru for the 1 hour long memorable conversation ❤️Always feels blessed whenever i meet you sir 😇#KA #DiwaliKAblockbuster pic.twitter.com/9TdAp5hqwT— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 10, 2024 -
కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ 'క'. తన్వీరామ్, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్‌ను శనివారం నిరవ్హించారు.మనసుకు నచ్చితేనే..ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాసు మాట్లాడుతూ.. నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప ఇలాంటి వేడుకలకు రాను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ అస్సలు ఊహించలేదు. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇది. ఈ సినిమాలో పనిచేసిన అందరికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ విని షాకయ్యా..సినిమా బడ్జెట్ విని షాకయ్యాను. వంశీ నందిపాటి నాకు రేట్ చెప్పకుండా సినిమా హక్కులు కొన్నాడు. ఆ నెంబర్ తెలిసి కంగారు పడ్డాను. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్ అవకాశం క్రియేట్ చేసుకున్నాడు, చాలా కషపడ్డాడు. పోరాటం ఆపలేదుచాలా మంది కిరణ్ పడిపోయాడు.. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను పోరాటం ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేయడమే.. కానీ కిరణ్ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్ గెలిచాడు. కిరణ్‌ను చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సక్సెస్ పాయింట్ వద్దకు వెళ్లే వరకు ఫైట్ చేయాలి. ఈ టీమ్ మరిన్ని విజయాలు అందుకోవాలి అని బన్నీ వాసు అన్నారు. -
కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'దయచేసి ఎవరినీ అలా జడ్జ్ చేయకండి..' కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ' మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. ఈ సినిమా చూడటానికి ఎవరొస్తారు. ఇప్పుడు అవసరమా..? పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకన్నారు. విడుదలకు ముందు చాలా ఇబ్బంది పడ్డా. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. ఈ క్రెడిట్ అంతా మా టీమ్‌కు ఇస్తాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ నా ఒంటికి ఎక్కవు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. నేను మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలని' అన్నారు.ఆ తర్వాత కిరణ్ మాట్లాడుతూ..'ఈ మాట చెప్పడం కాస్త తొందరపాటు అవుతుందేమో నాకు తెలియదు. దయచేసి ఎవరినీ కూడా మార్కెట్ పరంగా జడ్జ్ చేయకండి. వీడి మార్కెట్ ఇంత.. వాడి మార్కెట్ ఇంత.. ఇంకోడి మార్కెట్ ఇంత. ఇదంతా మార్చేయడానికి ఒక్క శుక్రవారం చాలు. ఈరోజు కింద ఉన్న వ్యక్తి వచ్చే శుక్రవారానికి టాప్‌కి వెళ్లొచ్చేమో. టాప్‌లో ఉన్న హీరో రెండు శుక్రవారాల్లో కిందకు పడొచ్చేమో. నా సినిమాను అందరూ ఆదరించారు. అందరం కలిసి మంచి సినిమా చేద్దాం' అని అన్నారు. -
ఎవరి కోసం ఎవరూ రారు.. అది మాత్రమే మాట్లాడాలి: దిల్ రాజు హాట్ కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన టాలెంట్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ సపోర్ట్ చేయరని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో చూశానని తెలిపారు. ఇదంతా నీ కష్టం వల్లే సాధ్యమైందని దిల్ రాజు ప్రశంసించారు. అంతేకానీ ఇక్కడ ఎవరి కోసమో మీరు వెయిట్ చేయవద్దని కోరారు. నీ దగ్గర టాలెంట్ ఉందని.. ట్రోల్స్ గురించి మరోసారి అలా ఎమోషనల్ కావొద్దని కిరణ్ అబ్బవరంకు దిల్ రాజు సూచించారు.ఎవరూ సపోర్ట్ చేయరు..ఇటీవల మరో టాలీవుడ్ హీరో రాకేశ్ వర్రే సైతం చిన్న హీరోలకు సెలబ్రిటీ స్టార్స్ ఎవరూ సపోర్ట్ చేయడం లేదని మాట్లాడారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం గురించి కూడా దిల్ రాజు ప్రస్తావించారు. మీ టాలెంట్, హార్డ్ వర్క్‌ను నమ్ముకోండి తప్ప.. ఇక్కడ ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయరు.. అలాగే వెనక్కి కూడా లాగరని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని.. సక్సెస్ వస్తే మాలాంటి వాళ్లు వచ్చి అభినందిస్తామని దిల్ రాజు కామెంట్స్ చేశారు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. కాగా.. ఈ చిత్రానికి సుజిత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు.ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా...కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - 'మా "క" సక్సెస్ మీట్‌కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు ఆ నంబర్స్ మారిపోవడానికి. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను' అని అన్నారు.