‘‘క’ సినిమా క్లైమాక్స్‌ను కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించాం. నాకు తెలిసి ఈ తరహా క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదు. అందుకే క్లైమాక్స్‌ను ఆడియన్స్ కొత్తగా ఫీలవుతారని, వాళ్లు ఆ అనుభూతికి లోను కాకపోతే నేను సినిమాలు చేయననే బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాను. మేం ఓ కొత్త ప్రయత్నం చేశామని ప్రేక్షకులు కచ్చితంగా అనుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను.
అయితే ఈ కొత్త ప్రయత్నాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా ఉంది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో కిరణ్ అబ్బవరం చెప్పిన విశేషాలు.
∙కృష్ణగిరి అనే ఊరికి పోస్ట్‌మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్ కథ ఇది. ఇతని ప్రేయసిగా సత్యభామ (నయన్) కనిపిస్తుంది. మరోటి రాధ (తన్వీ రామ్) పాత్ర. వాసుదేవ్, సత్యభామ పాత్రలతో రాధ కనెక్షన్ ఏంటి? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా కథను సుజీత్, సందీప్ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఫీలయ్యాను. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించలేకపోయాను. ‘ఎవరు... ఏంటి... ఎక్కడ’ అనే పాయింట్స్‌తో ‘క’ చిత్రం ఉంటుంది. 1970 నేపథ్యంలో సాగే కథ ఇది.
ఈ సినిమా కంటెంట్ ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటుంది. అందుకే పదే పదే మా మూవీ ఫ్రెష్‌గా ఉంటుందని చెబుతున్నాం. ∙‘క’ అంటే కొంతమంది కిరణ్ అబ్బవరం అనుకుంటున్నారు. కానీ ‘క’ ఏంటో సినిమా క్లైమాక్స్‌లో తెలుస్తుంది. సైకలాజికల్ సస్పెన్స్‌తో ఈ సినిమా ముందుకు వెళ్తుంది. ఇక మా సినిమాకు ఇద్దరు దర్శకులు ఉండటం బాగానే అనిపించింది. ఈ సినిమాని మలయాళంలో దుల్కర్ సల్మాన్‌గారి నిర్మాణ సంస్థే రిలీజ్ చేయాల్సింది. కానీ ఆయన సినిమా ‘లక్కీ భాస్కర్’ మా సినిమా విడుదల తేదీనే వస్తుంది.
తమిళంలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే ‘క’ రిలీజ్‌ను ప్రస్తుతానికి తెలుగుకే పరిమితం చేశాం. ∙ఈ మధ్యే పెళ్లి (‘రాజావారు రాణిగారు’ సినిమాలో తన సరసన హీరోయిన్‌గా నటించిన రహస్యా గోరక్‌ని కిరణ్ పెళ్లి చేసుకున్నారు) చేసుకున్నాను. నా మ్యారీడ్ లైఫ్ బాగుంది. నా పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ‘క’ విజయం సాధిస్తే సంతోషంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment