‘క’వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా ‘కె–ర్యాంప్’(K Ramp) అనే మూవీ షురూ అయింది. నూతన దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యుక్తీ తరేజా హీరోయిన్ . హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు.
తొలి సన్నివేశానికి యోగి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్నలు మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, నటుడు వీకే నరేశ్ పాల్గొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, వీకే నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్, సహ–నిర్మాతలు: బాలాజి గుట్ట, ప్రభాకర్ బురుగు.
Comments
Please login to add a commentAdd a comment