డబ్బు కోసం సినిమా రంగంలోకి రాలేదు : ‘క’ నిర్మాత | Producer Chinta Gopalakrishna Reddy Talk About KA Movie | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం సినిమా రంగంలోకి రాలేదు : ‘క’ నిర్మాత

Published Tue, Oct 29 2024 4:05 PM | Last Updated on Tue, Oct 29 2024 5:00 PM

Producer Chinta Gopalakrishna Reddy Talk About KA Movie

నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే సినిమా రంగంలోకి వచ్చాను. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను’ అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి. ఆయన నిర్మాతగా కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

హీరో కిరణ్ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. "క" సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్ తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది.

హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. "క" సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మల్లీ ఉదయమే 5 గంటలకు సెట్ కు వచ్చేవాడు. షూటింగ్ చేస్తున్న స్టూడియో వాళ్లు కూడా మీ టీమ్ తక్కువ టైమ్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని అనేవారు.

మా డైరెక్టర్స్ కూడా తాము అనుకున్నది వచ్చేదాకా రాజీపడేవారు కాదు ప్రతి షాట్ రిచ్ గా ఉండాలని ప్రయత్నించారు. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా చిన్న చిన్న షాట్స్ షూట్ చేసి యాడ్ చేశారు. అలా చివరి నిమిషం వరకు ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా కిరణ్ తో గతంలో వర్క్ చేసినవాళ్లే. కాబట్టి వాళ్లంతా ఒక టీమ్ వర్క్ లాగా కలిసి పనిచేశారు. దాంతో నిర్మాతగా నాకు టెన్షన్ తగ్గిపోయింది.

"క" సినిమా కథ మా డైరెక్టర్స్ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారు. నేను ఔట్ పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. కథను వాళ్లు మలుపుతిప్పిన విధానం చూసి వీళ్లు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. క సినిమాకు సీక్వెల్ కూడా చేసుకోవచ్చు. మా సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రెండ్ అయ్యాయి. ఇవాళ మా మూవీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటారంటే ప్రొడ్యూసర్ గా సంతోషమే.

టీజర్ రిలీజ్ అయిన వెంటనే బిజినెస్ కోసం కాల్స్ వచ్చాయి. వంశీ నందిపాటి గారిని కిరణ్ సజెస్ట్ చేశాడు. ఆయన ఏపీ, తెలంగాణ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో చాలా మంచి థియేటర్స్ లభించాయి. 350కి పైగా థియేటర్స్ లో క రిలీజ్ అవుతోంది.

పాన్ ఇండియా రిలీజ్ కావడం లేదనే బాధ లేదు. కాంతార సినిమా కన్నడలో హిట్ అయ్యాక తెలుగులోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా క సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంటే మిగతా భాషల్లో క్రేజ్ ఏర్పడుతుంది. మా టీమ్ అంతా క సినిమా కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నాం. క సినిమాకు మొదట ఇచ్చోటనే అనే టైటిల్ అనుకున్నాం. అలాగే సినిమా మొదలుపెట్టాం. క టైటిల్ చెప్పినప్పుడు బాగుందని అనిపించింది. క పేరు మీద హిట్ సినిమాలు వచ్చాయి. సినిమాలో టైటిల్ ఎందుకు క అని పెట్టారో జస్టిఫికేషన్ ఇచ్చారు మా డైరెక్టర్స్. ఒక మంచి సినిమా చేయాలని హీరోతో పాటు యూనిట్ అంతా తపించింది.

ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ జనవరిలో ఫైనల్ చేస్తాను. ఏ ఫీల్డ్ లో లేని కష్టం చిత్ర పరిశ్రమలో ఉంది. అలాగే ఏ రంగంలో లేని గుర్తింపు, ఫేమ్ సినీ రంగంలో ఉంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే అది మంచి సినిమానే అయి ఉంటుందనే పేరు తెచ్చుకోవాలనేదే నిర్మాతగా నా లక్ష్యం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement