gopala krishna reddy
-
డబ్బు కోసం సినిమా రంగంలోకి రాలేదు : ‘క’ నిర్మాత
నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే సినిమా రంగంలోకి వచ్చాను. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను’ అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి. ఆయన నిర్మాతగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ హీరో కిరణ్ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. "క" సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్ తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది.→ హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. "క" సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మల్లీ ఉదయమే 5 గంటలకు సెట్ కు వచ్చేవాడు. షూటింగ్ చేస్తున్న స్టూడియో వాళ్లు కూడా మీ టీమ్ తక్కువ టైమ్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని అనేవారు.→ మా డైరెక్టర్స్ కూడా తాము అనుకున్నది వచ్చేదాకా రాజీపడేవారు కాదు ప్రతి షాట్ రిచ్ గా ఉండాలని ప్రయత్నించారు. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా చిన్న చిన్న షాట్స్ షూట్ చేసి యాడ్ చేశారు. అలా చివరి నిమిషం వరకు ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా కిరణ్ తో గతంలో వర్క్ చేసినవాళ్లే. కాబట్టి వాళ్లంతా ఒక టీమ్ వర్క్ లాగా కలిసి పనిచేశారు. దాంతో నిర్మాతగా నాకు టెన్షన్ తగ్గిపోయింది."క" సినిమా కథ మా డైరెక్టర్స్ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారు. నేను ఔట్ పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. కథను వాళ్లు మలుపుతిప్పిన విధానం చూసి వీళ్లు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. క సినిమాకు సీక్వెల్ కూడా చేసుకోవచ్చు. మా సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రెండ్ అయ్యాయి. ఇవాళ మా మూవీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటారంటే ప్రొడ్యూసర్ గా సంతోషమే.→ టీజర్ రిలీజ్ అయిన వెంటనే బిజినెస్ కోసం కాల్స్ వచ్చాయి. వంశీ నందిపాటి గారిని కిరణ్ సజెస్ట్ చేశాడు. ఆయన ఏపీ, తెలంగాణ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో చాలా మంచి థియేటర్స్ లభించాయి. 350కి పైగా థియేటర్స్ లో క రిలీజ్ అవుతోంది.→ పాన్ ఇండియా రిలీజ్ కావడం లేదనే బాధ లేదు. కాంతార సినిమా కన్నడలో హిట్ అయ్యాక తెలుగులోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా క సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంటే మిగతా భాషల్లో క్రేజ్ ఏర్పడుతుంది. మా టీమ్ అంతా క సినిమా కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నాం. క సినిమాకు మొదట ఇచ్చోటనే అనే టైటిల్ అనుకున్నాం. అలాగే సినిమా మొదలుపెట్టాం. క టైటిల్ చెప్పినప్పుడు బాగుందని అనిపించింది. క పేరు మీద హిట్ సినిమాలు వచ్చాయి. సినిమాలో టైటిల్ ఎందుకు క అని పెట్టారో జస్టిఫికేషన్ ఇచ్చారు మా డైరెక్టర్స్. ఒక మంచి సినిమా చేయాలని హీరోతో పాటు యూనిట్ అంతా తపించింది.→ ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ జనవరిలో ఫైనల్ చేస్తాను. ఏ ఫీల్డ్ లో లేని కష్టం చిత్ర పరిశ్రమలో ఉంది. అలాగే ఏ రంగంలో లేని గుర్తింపు, ఫేమ్ సినీ రంగంలో ఉంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే అది మంచి సినిమానే అయి ఉంటుందనే పేరు తెచ్చుకోవాలనేదే నిర్మాతగా నా లక్ష్యం. -
రెండు నెలలకే మాపై విమర్శలా? వైఎస్ జగన్పై మంత్రుల వ్యాఖ్యలు
వైఎస్ జగన్పై మంత్రుల వ్యాఖ్యలు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా గడవక ముందే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమపై విమర్శలు చేయడం ఏమిటని పలువురు మంత్రులు దుయ్యబట్టారు. జగన్ రుణమాఫీకి వ్యతిరేకి అని, ఆయనకు దీనిపై విమర్శించే హక్కు లేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ భారం తగ్గించుకోవడం కోసం ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేస్తున్న తమ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. రుణమాఫీతో రైతులు పండుగ చేసుకుంటున్న తరుణంలో సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని జగన్ అనటం పిల్ల చేష్టలని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. -
హితులా.. కత్తులా ?
నిన్నటి ప్రత్యర్థులు నేడు మిత్రులు బాబు వ్యూహం వికటిస్తుందేమో టీడీపీ శ్రేణుల్లో భయూందోళన 4 నియోజకవర్గాల్లో వింత పరిస్థితి సాక్షి, తిరుపతి: కిందటి ఎన్నికల్లో ప్రత్యర్థులు..ఈ ఎన్నికలకు మిత్రులయ్యారు. వీళ్లంతా నిజమైన మిత్రులేనా అనే అనుమానాలు టీడీపీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో టీడీపీని నింపేసుకున్న చంద్రబాబు వారిలో కొందరికి టికెట్లు కూడా ఇచ్చారు. టికెట్లు ఇవ్వలేని వారిని నామినేషన్ల తరువాత పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు వారంతా పోటీలో ఉన్న అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంది. ఇక్కడే టీడీపీ శ్రేణుల్లో అనుమానాలకు తావిస్తోంది. అధినేత చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టిందంటే కొత్తగా చేరిన హితులంతా కడుపులో కత్తులయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం వచ్చిన వారిని ఎంత తక్కువగా నమ్మితే అంత మంచిదనే అభిప్రాయం వారిది. పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నట్టు టీడీపీ అభ్యర్థులకు వారంతా కడుపులో కత్తులే అనుకోవాల్సి వస్తోంది. శ్రీకాళహస్తిలో బొజ్జల, ఎస్సీవీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీచేస్తున్నారు. ఈయనకు 2004, 09 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి ఎస్సీవీ నాయుడు. 2004 వరకు బొజ్జలకు ముఖ్య అనుచరుడుగా ఉంటూ వచ్చిన ఎస్సీవీ నాయుడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు తెచ్చుకున్నారు. అప్పటివరకు ఓటమి అంటే ఎరుగని బొజ్జలను ఇంటికి పంపారు. అప్పటికే గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే హోదాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్సీవీ నాయుడుపై బొజ్జల విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఇద్దరూ దుమ్మెత్తిపోసుకున్నారు. గోపాలకృష్ణారెడ్డిని గెలిపిస్తే హైదరాబాద్ వెళ్లాలని ఎస్సీవీ ఆరోపిస్తే, ఎస్సీవీని గెలిపిస్తే నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతుందని బొజ్జల ప్రత్యారోపణ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి టికెట్టు కోసం ప్రయత్నించిన ఎస్సీవీకి చుక్కెదురైంది. టికెట్టు ఇవ్వకపోయినా చంద్రబాబు పంచన చేరిపోయారు. తిరుపతిలో వెంకటరమణ, చదలవాడ మాజీ ఎమ్మెల్యే ఎం వెంకటరమణ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నామినేషన్ల గడువు చివరి రోజున వెంకటరమణకు టికెట్టు ఖరారు చేశారు. అప్పటివరకు తనకే టకెట్టు అనే విశ్వా సంతో ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి ఈ రకంగా వెంకటరమణ షాకిచ్చారు. వీరిద్దరూ 2012లో తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులు. వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ తరఫున, చదలవాడ టీడీపీ టికెట్టుతో పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీసీ అభ్యర్థి గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచి అప్పటికప్పుడు వచ్చిన వెంకటరమణను అక్కున చేర్చుకుని చంద్రబాబు టికెట్టు ఇచ్చారు. సోమ వారం తిరుపతిలో చంద్రబాబు రోడ్షోలో ఆ యన పక్కన చదలవాడ, వెంకటరమణ ఉన్నా రు. మరుసటి రోజు ఎవరిదారివారిదే అయింది. గతంలో కూడా వీరు భూకబ్జాలకు సంబంధించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. పూతలపట్టులో లలితాథామస్, రవి పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో లలితా థామస్, డాక్టర్ రవి ప్రధాన ప్రత్యర్థులు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లలితాథామస్పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రవి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని రవి నిన్నటి వరకు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారు. తొలుత రెండు మూడుసార్లు టీడీపీలో చేరడానికి ప్రయత్నించినా చంద్రబాబు ఆయన ను చేర్చుకోలేదు. నామినేషన్లు పూర్తయి న తరువాత డిమాండ్లేమీ ఉండవనే సందర్భం లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చంద్రగిరిలో టీడీపీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన లలితాథామస్ విజయం కోసం ఎంతమేరకు పనిచేస్తారో చూడాల్సి ఉంది. చంద్రగిరిలో అరుణమ్మ, సైకం చంద్రగిరి నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ అభ్యర్థిగాను, సైకం జయచంద్రారెడ్డి పీఆర్పీ అభ్యర్థిగాను పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరూ టీడీపీ గూటికి వెళ్లారు. చంద్రగిరి టికెట్టుకు తాను రేసులో ఉన్నానని పార్టీలో చేరిన మరుసటి రోజునే సైకం ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే టికెట్టు అరుణమ్మకే ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హేమలత అసంతృప్తి సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీ హేమలతకు టికెట్టు నిరాకరించడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మంగళవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లిన సమయంలో ఆమె ప్రచారరథంపై కనిపించలేదు. అంతకుమందు హెలిపాడ్ వద్ద చంద్రబాబుకు నమస్కరించుకుని కాన్వాయ్లోని తన కారులో ఉండిపోయారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని భావించి, హేమలత కాన్వాయిలోనే ఉన్నారని ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆదిత్య విజయానికి కృషి చేస్తుందని చంద్రబాబు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.