కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘క’. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘క మాస్ జాతర..’ పాట వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
‘‘ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు.. ఆడు ఆడు ఆడు ఆడు అమ్మోరే మురిసేలా ఆడు... ఆడు ఆడు ఆడు ఆడు ఊరు వాడ అదిరేలా ఆడు..’ వంటి లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంది. సానాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ అందించిన ఈ పాటను చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్‌తో కలిసి దివాకర్, అభిషేక్ ఏఆర్ పాడారు. ఈ పాటకి ΄పొలాకి విజయ్ కొరియోగ్రఫీ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment