Allari Naresh Announced His Next Project With Interesting Title Deets inside - Sakshi
Sakshi News home page

Allari Naresh New Movie: ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో అల్లరి నరేష్‌ నెక్ట్స్‌ సినిమా

Published Sun, Apr 10 2022 12:32 PM | Last Updated on Sun, Apr 10 2022 1:22 PM

Allari Naresh Announced His Next Project With Intresting Title - Sakshi

'నాంది' సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న “సభకు నమస్కారం” చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఇక రీసెంట్‌గా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో నరేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం క్రేజీ టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు.

అల్లరి నరేష్‌ కెరీర్‌లో 59వ సినిమా ఇది. దీనికి  “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అంటూ ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ని ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో నరేష్‌కి జోడీగా శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్‌ ఆనంది నటిస్తుంది.  ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్‌ చంద్ర ముఖ్య పాత్రలు పోషించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement