Allari Naresh 59 Movie: Allari Naresh New Movie Launch At Hyderabad - Sakshi
Sakshi News home page

అల్లరి 59 షురూ

Published Thu, Feb 3 2022 12:36 AM | Last Updated on Thu, Feb 3 2022 8:40 AM

Allari Naresh new movie launch at Hyderabad - Sakshi

‘అల్లరి’ నరేశ్, ఆనంది

ఓ వైపు వినోదం.. మరోవైపు వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షురూ అయింది. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, బాలు మున్నంగి క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నరేశ్‌ నటిస్తున్న 59వ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, సహనిర్మాత: బాలాజీ గుత్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement