'Albela Albela' song released from 'Ugram' movie - Sakshi
Sakshi News home page

Ugram Movie: ఉగ్రం నుంచి అల్బెలా అల్బెలా సాంగ్ విన్నారా?

Published Mon, Apr 10 2023 9:53 AM | Last Updated on Mon, Apr 10 2023 12:31 PM

Albela Albela Song Released From Ugram Movie - Sakshi

హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘నాంది’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ హిట్‌ కాంబోలో రెండోసారి రూపొందిన మూవీ ‘ఉగ్రం’. ఇందులో మీర్నా మీనన్‌ హీరోయిన్‌గా నటించారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే 5న రిలీజ్‌ కానుంది.

శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అల్బెలా అల్బెలా..’ అనే పాట వీడియో సాంగ్‌ను హీరో నాని రిలీజ్‌ చేశారు. ‘అల్బెలా అల్బెలా బిలా హల్‌చల్‌ చేద్దాం క్రేజీగా... టెన్షన్‌కు బ్రేక్‌ ఇద్దాం పదా..’ అంటూ సాగుతుందీ పాట. ఈ పాటకు భాస్కర్‌ భట్ల సాహిత్యం అందించగా, రేవంత్, శ్రావణ భార్గవి పాడారు. ఈ సినిమాకు సిద్‌ కెమెరామన్‌గా వ్యవహరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement