Allari Naresh Reveals About Behind The Scenes Of Fight Scene In Ugram Movie, Video Viral - Sakshi
Sakshi News home page

Allari Naresh: ఈ సినిమా కోసం నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగా..

Published Thu, Apr 27 2023 1:16 PM | Last Updated on Thu, Apr 27 2023 2:11 PM

Allari Naresh About Fight Scene In Ugram Movie - Sakshi

నాంది హిట్‌ తర్వాత అల్లరి నరేశ్‌- విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఉగ్రం. అల్లరి నరేశ్‌ కెరీర్‌లో ఇది 60వ సినిమా. ఈ చిత్రంలో మీర్నామీనన్‌ కథానాయికగా నటిస్తోంది. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ.. 'అడవిలో ఓ ఫైట్‌ సీన్‌లో స్మోక్‌ మిషన్లు పెట్టారు. ఒకవైపు దట్టంగా పొగ వచ్చేలా మిషన్లు పెట్టారు. మరోవైపు నన్ను సిగరెట్‌ తాగుతూ రమ్మంటారు. దాదాపు నాలుగు రోజుల్లో ఐదారువందలు సిగరెట్లు తాగాను. దీంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతింది' అని చెప్పుకొచ్చాడు.​

కాగా వరుసగా కామెడీ సినిమాలు చేసిన నరేశ్‌ కొంతకాలంగా తన పంథా మార్చుకున్నాడు. కామెడీకి చెక్‌ పెట్టి సీరియస్‌ సినిమాలు చేస్తున్నాడు. అందుకు నాంది చిత్రాన్ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన విజయ్‌ కనకమేడల ఇప్పుడు మరోసారి ఉగ్రంతో సీరియస్‌ సినిమా చేశాడు. మరి ఈ సినిమా నాందిని మించిన హిట్‌ అవుతుందేమో చూడాలి!

చదవండి: నా కూతురి విషయంలో రణ్‌బీర్‌ భయం అదే: ఆలియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement