'అమ్మాయిని వదిలేసి ఆంటీ వెనక పడ్డావా?'.. ఆసక్తిగా టీజర్! | Tollywood Hero Allari Naresh Latest Movie Teaser Out Today | Sakshi
Sakshi News home page

Aa Okkati Adakku Teaser: 'నీకు ఇంకా పెళ్లవ్వలేదా?'.. ఆసక్తిగా టీజర్!

Mar 12 2024 7:42 PM | Updated on Mar 12 2024 7:47 PM

Tollywood Hero Allari Naresh Latest Movie Teaser Out Today - Sakshi

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్‌ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. గతేడాది మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి మాస్ సినిమాలు చేసిన మళ్లీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రలో నరేశ్ కనిపించనున్నారు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని.. లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ మొదలైంది. దీంతో నీ పెళ్లెప్పుడు అంటూ అల్లరి నరేశ్‌ను అందరూ ఆట పట్టిస్తుంటారు. అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తారు. పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను కామెడీ అందించేందుకు నరేశ్ రెడీ అయిపోయారు. టీజర్ చూస్తే నరేశ్ మరోసారి తన మార్క్ కామెడీని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement