
‘అల్లరి’ నరేశ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఇవి సినిమా పాలిటిక్స్. రాజకీయాల నేపథ్యంలో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సభకు నమస్కారం’ గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సతీశ్ మల్లంపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పోకూరి బాబూరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘అల్లరి’ నరేశ్ కుమార్తె బేబీ అయాన క్లాప్ ఇచ్చింది. ‘నాంది’ డైరెక్టర్ విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించగా, అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్ కలసి స్క్రిప్ట్‌ను చిత్రదర్శకుడు సతీశ్ మల్లంపాటికి అందించారు. ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న 58వ చిత్రం ఇది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇలాంటి జోనర్‌లో నరేశ్ సినిమా చేయడం ఇదే తొలిసారి’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment