Allari Naresh Itlu Maredumilli Prajaneekam Movie Shooting in Munchingiputtu, AP - Sakshi
Sakshi News home page

Allari Naresh Movie Shooting: ముంచంగిపుట్టులో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ షూటింగ్‌, తరలివచ్చిన జనం

Published Mon, Jul 25 2022 11:29 AM | Last Updated on Mon, Jul 25 2022 12:18 PM

Allari Naresh Itlu Maredumilli Prajaneekam Movie Shooting in Munchingiputtu, AP - Sakshi

సాక్షి, ముంచంగిపుట్టు: మండలంలో సుజనకోట పంచాయతీ లకేయిపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డ ఒడ్డున ఆదివారం సినిమా షూటింగ్‌ సందడి వాతావరణం నెలకొంది. జీ స్టూడియో సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లుగా అల్లరి నరేశ్‌, జాంబిరెడ్డి ఫేమ్‌ హీరోయిన్‌ ఆనంది, కమెడియన్లుగా వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్‌రాజ్‌ నటిస్తున్నారు.

ఇక్కడ మత్స్యగెడ్డ ఒడ్డున వీరి మధ్య ముఖ్యమైన సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. ఈ షూటింగ్‌ విషయం తెలుసుకున్న ముంచంగిపుట్టు మండలంలో పలు గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో లకేయిపుట్టు మత్స్యగెడ్డ ప్రాంతం జన సందడి నెలకొంది. షూటింగ్‌ దగ్గరకు వీరిని రానివ్వకుండా అక్కడ సిబ్బంది నిలువరించారు. రెండు రోజులపాటు మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహిస్తామని డెరెక్టర్‌ తెలిపారు.

చదవండి: 
NBK107: కర్నూల్‌ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!
రజినీకాంత్‌కు ఆదాయ పన్నుశాఖ అవార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement