
‘‘ఉగ్రం’ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన సాహు, హరీష్‌గార్లకు థ్యాంక్స్. నా కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. వేసవిలో మీ ముందుకు వస్తోంది. విజయ్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘నాంది’ మూవీని హిట్ చేసినట్టు ‘ఉగ్రం’ని కూడా పెద్ద హిట్ చేయాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేష్ అన్నారు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్, మీర్నా మీనన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.
శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దేవేరి..’ అంటూ సాగే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘నరేష్‌గారి కెరీర్‌లో ‘ఉగ్రం’ మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. శ్రీచరణ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో మీర్నా మీనన్, శ్రీచరణ్ పాకాల, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్.