కాటుక కళ్లతో సైగే చేసే చిన్నది | Allari Naresh Bachala Malli New Song Released | Sakshi
Sakshi News home page

కాటుక కళ్లతో సైగే చేసే చిన్నది

Published Wed, Jul 17 2024 12:23 AM | Last Updated on Wed, Jul 17 2024 12:23 AM

Allari Naresh Bachala Malli New Song Released

‘మా ఊరి జాతరలో కాటుక కళ్లతో చాటుగా రమ్మని సైగే చేసే చిన్నది...’ అంటూ మొదలయ్యే ఫోక్‌ మెలోడీ సాంగ్‌ ‘బచ్చల మల్లి’ సినిమాలోనిది. ‘అల్లరి’ నరేశ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా ఊరి జాతరలో..’ పాట లిరికల్‌ వీడియోను చిత్రయూనిట్‌ మంగళవారం విడుదల చేసింది. 

‘రాములోరు పేర్చిన రాళ్లు ఏరి తీయనా... ఏటి నీటి పైనే నీకు కోటే కట్టెయ్యనా...’ అంటూ ఈ పాట సాగుతుంది. చిత్రసంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరపరచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. సింధూరీ విశాల్‌తో కలిసి ‘హను–మాన్‌’ ఫేమ్‌ కంపోజర్‌ గౌరా హరి ఈ పాటను పాడారు. ‘‘హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటారో తెలియజేసే పాట ఇది. హీరో తన భార్యకు ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తానంటుండగా, అవేవీ వద్దు తనతో ఉంటే చాలు అన్నట్లుగా హీరోయిన్‌ చెప్పే క్రమంలో ఈ పాట వస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement