‘అల్లరి’ నరేశ్, ఫరియా
నచ్చిన అమ్మాయి మనసు దోచేయడానికి ‘ఓహ్... మేడమ్...’ అంటూ పాట అందుకున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం కోసమే ఈ పాట. ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం నరేశ్–ఫరియాపై చిత్రీకరించిన తొలి పాట ‘ఓహ్.. మేడమ్’ను సంగీతదర్శకుడు ఎస్‌ఎస్ తమన్ విడుదల చేశారు.
గోపీచందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. హీరోయిన్ పట్ల హీరో వ్యక్తపరిచే భావోద్వేగాల నేపథ్యంలో ఈ పాట ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment