Nagarjuna Released Raj Tarun Anubhavinchu Raja Movie First Look - Sakshi
Sakshi News home page

Raj Tarun: నాగార్జున చేతుల మీదుగా రాజ్‌ తరుణ్‌ మూవీ ఫస్ట్‌లుక్‌

Published Sat, Aug 28 2021 6:11 PM | Last Updated on Sat, Aug 28 2021 6:43 PM

Nagarjuna Unveil Raj Tarun Anubhavinchu Raja Movie First Look - Sakshi

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ బయటకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ను ‘అనుభవించు రాజా’గా ఖరారు చేశారు చిత్ర బృందం. తాజాగా నాగార్జున ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రాజ్‌ తరుణ్‌ కోడిపుంజుతో పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. చూస్తుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

చదవండి: బిగ్‌బాస్‌: ఇద్దరికి కరోనా పాజిటివ్‌.. తెరపైకి కొత్త పేర్లు, లిస్ట్‌ ఇదే!

ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన  మోడల్ కాషిశ్‌ ఖాన్ నటించింది. ఈ చిత్రంలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎలాంటి హాడావుడి లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రాజ్‌ తరుణ్‌కు ఇది మూడో సినిమా కాగా, దర్శకుడుకు శ్రీనివాస్‌తో అతడికి రెండవ చిత్రం కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement