అద్దె కట్టడానికి డబ్బు లేక 11 రోజులు ఫుట్‌పాత్‌పై నిద్ర | Raj Tarun About His Struggles on Career Starting Days | Sakshi
Sakshi News home page

Raj Tarun: 11 రోజులు ఫుట్‌పాత్‌పై నిద్రించా.. నీళ్లు తాగి కడుపు నింపుకున్నా!

Published Sat, Sep 14 2024 5:05 PM | Last Updated on Sat, Sep 14 2024 5:48 PM

Raj Tarun About His Struggles on Career Starting Days

ఒకప్పుడు రాజ్‌తరుణ్‌ క్రేజీ హీరో.. ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్‌ చిత్రాలతో హిట్లు అందుకుని సెన్సేషన్‌ అయ్యాడు. కానీ తర్వాతే ట్రాక్‌ తప్పి ఫ్లాపులబారిన పడ్డాడు. ఈ మధ్య పురుషోత్తముడు, తిరగబడర సామీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా మళ్లీ అపజయాలే అందుకున్నాడు. తాజాగా  అతడు ప్రధాన పాత్రలో నటించిన భలే ఉన్నాడే సినిమా రిలీజైంది.

 అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా..
ఈ మూవీ ప్రమోషన్స్‌లో రాజ్‌ తరుణ్‌ తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన కష్టాలను చెప్పుకొచ్చాడు. 'నన్ను ఎవరైనా గుర్తించి ఇండస్ట్రీకి పిలవాలని ఎదురుచూశాను. దాదాపు 52 షార్ట్‌ ఫిలింస్‌ చేశాక రామ్మోహన్‌గారు చూసి పిలిచారు. యాక్టింగ్‌ చేస్తావా? డైరెక్షన్‌ చేస్తావా? అని అడిగారు. నాకు డైరెక్షనే ఇష్టమని చెప్పాను. అలా ఆయన దగ్గర రూ.3000కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను.

వెళ్లిపోమన్నారు
ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క సీన్‌ గురించి చర్చించేవాళ్లం. అప్పుడు నేను పర్వాలేదు.. కానీ, ఇంకాస్త బాగుండాల్సింది అని దీర్ఘాలు తీశాను. నెల రోజులు ఓపిక పట్టాడు. తర్వాత ఆయనకు కోపం వచ్చి నువ్వుంటే స్క్రిప్ట్‌ ముందుకు సాగదు, వెళ్లిపో అన్నారు. ఏం చేయాలో తోచలేదు.

నీళ్లు తాగి కడుపు నింపుకున్నా
బీటెక్‌ మధ్యలో ఆపేసి వచ్చాను. అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో ఫుట్‌ఫాత్‌పై 11 రోజులపాటు పడుకున్నాను. నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ రామ్మోహన్‌ గారే పిలిపించారు. అప్పుడు నాకు 20 ఏళ్లు! ఆ వయసులో ఒక ఫైర్‌ ఉంటుంది. ఏదైనా సాధించే తిరిగి వెళ్లాలనుకున్నాను. నా టాలెంట్‌ను నమ్ముకున్నాను. రైటర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత హీరోనయ్యాను అని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement