హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి | Malvi Malhotra And Asst Producer Yogesh Latest Issue | Sakshi
Sakshi News home page

Malvi Malhotra: రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. హీరోయిన్‌పై మరో ఆరోపణ

Published Tue, Jul 16 2024 10:29 AM | Last Updated on Tue, Jul 16 2024 10:48 AM

Malvi Malhotra And Asst Producer Yogesh Latest Issue

హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు ఈ గొడవలో ఉన్నవాళ్లలో ఎవరిది తప్పో అర్థం కాక జుట్టు పీక్కుకుంటుంటే.. ఇందులో భాగమైన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా గురించి షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మాల్వీపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ అసలేమైంది?
మాల్వీ మల్హోత్రా.. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్, ఆల్బమ్ సాంగ్, ఓటీటీల్లో పలు ప్రాజెక్టులు చేసింది. 'తిరగబడరా సామీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇ‍స్తోంది. రిలీజ్ కొద్దిరోజుల ఉందనగా.. ఈ సినిమా హీరో రాజ్ తరుణ్ ప్రేయసి అంటూ లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చింది. తన ప్రియుడు రాజ్ తరుణ్‌ని మాల్వీ మాయలో పడి తనని పట్టించుకోవట్లేదని, ఇదే విషయమై అడిగితే ఏకంగా మాల్వీ, ఆమె సోదరుడు తనని బెదిరిస్తున్నారని చెప్పి లావణ్య చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు.

(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)

మరోవైపు నాలుగేళ్ల క్రితం మాల్వీపై యోగేశ్ అనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన మాల్వీ అప్పట్లో ఆస్పత్రిలో చేరింది. తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని, లేదని చెప్పేసరికి ఇలా దాడి చేశాడని మాల్వీ చెప్పుకొచ్చింది. ఇది ఈమె వెర్షన్. తాజాగా రాజ్ తరుణ్ కేసు వల్ల సదరు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మీడియా ముందుకొచ్చింది. ప్రేమ పేరుతో తన కొడుకుని మోసం చేసిందని, ఆస్తులు లాక్కొని తమని రోడ్డున పడేసిందని ఈమె చెప్పుకొచ్చారు. ప్రేమ పేరుతో వెంటపడుతున‍్నాడని ఫిర్యాదు చేసి, తన కొడుకుని అన్యాయంగా జైలుకి పంపిందని కంటతడి పెట్టుకుంది. ఈ క్రమంలోనే యోగేశ్-మాల్వీ వాట్సాప్ చాట్, విమాన టికెట్స్‌ని బయటపెట్టారు. తన కుమారుడు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడని చెబుతూ రోదించింది.

ఇలా ఏదో ప్రేమ కోసం గొడవ అనుకున్న కేసు కాస్త ట్విస్టులు, టర్న్స్ తీసుకుని థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. మరి ఈ మొత్తంలో తప్పు ఎవరదన్నా సరే చెప్పడం కష్టం. మరి ఈ గొడవలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో ఏంటో?

(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement