Yogesh
-
పక్కా పన్నాగంతోనే స్కిల్ స్కామ్.. బాబు కనుసన్నల్లోనే కుంభకోణం
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ కుట్రపూరితంగా షేల్ కంపెనీలు సృష్టించి ఫేక్ ఇన్వాయిస్లు అవినీతికి పాల్పడ్డారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం... ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371కోట్లు విడుదల చేయడం... షెల్ కంపెనీల ద్వారా తరలించడం...ఇలా కుట్ర అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది.ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సృష్టికర్త... ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’అని సీఐడీ సిట్ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. కుంభకోణం కుట్రదారు...అంతిమలబ్ధిదారుడు చంద్రబాబేనని నిగ్గు తేలి్చంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ని సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినేట్ ఆమోదం లేకుండానే ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేశారు.ఆ సంస్థకు డైరెక్టర్‌గా తన సన్నిహితుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్ఎస్డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్ ప్రైజస్, ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి... అందులో సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు.చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ...⇒ టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది.. రూ 371 కోట్లు⇒ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ. 238.29 కోట్లు, ⇒ ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.అంతా బాబు ముఠానే..ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు.తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మావాళ్లే.. అడ్డగోలుగా నిధులు ఇచ్చేయండి ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ వాటా 10శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్‌ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్ కంపెనీకి రూ.371కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆరి్థక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు. నిధులు కొల్లగొట్టేందుకు గ్రీన్ చానల్ ఇక ఆ ప్రాజెక్ట్ నిధులను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ నుంచి నేరుగా ఇంటర్ప్రైజస్– ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లను వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లుఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లుమొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. -
హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి
హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు ఈ గొడవలో ఉన్నవాళ్లలో ఎవరిది తప్పో అర్థం కాక జుట్టు పీక్కుకుంటుంటే.. ఇందులో భాగమైన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా గురించి షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మాల్వీపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ అసలేమైంది?మాల్వీ మల్హోత్రా.. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్, ఆల్బమ్ సాంగ్, ఓటీటీల్లో పలు ప్రాజెక్టులు చేసింది. 'తిరగబడరా సామీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. రిలీజ్ కొద్దిరోజుల ఉందనగా.. ఈ సినిమా హీరో రాజ్ తరుణ్ ప్రేయసి అంటూ లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చింది. తన ప్రియుడు రాజ్ తరుణ్‌ని మాల్వీ మాయలో పడి తనని పట్టించుకోవట్లేదని, ఇదే విషయమై అడిగితే ఏకంగా మాల్వీ, ఆమె సోదరుడు తనని బెదిరిస్తున్నారని చెప్పి లావణ్య చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)మరోవైపు నాలుగేళ్ల క్రితం మాల్వీపై యోగేశ్ అనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన మాల్వీ అప్పట్లో ఆస్పత్రిలో చేరింది. తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని, లేదని చెప్పేసరికి ఇలా దాడి చేశాడని మాల్వీ చెప్పుకొచ్చింది. ఇది ఈమె వెర్షన్. తాజాగా రాజ్ తరుణ్ కేసు వల్ల సదరు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మీడియా ముందుకొచ్చింది. ప్రేమ పేరుతో తన కొడుకుని మోసం చేసిందని, ఆస్తులు లాక్కొని తమని రోడ్డున పడేసిందని ఈమె చెప్పుకొచ్చారు. ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని ఫిర్యాదు చేసి, తన కొడుకుని అన్యాయంగా జైలుకి పంపిందని కంటతడి పెట్టుకుంది. ఈ క్రమంలోనే యోగేశ్-మాల్వీ వాట్సాప్ చాట్, విమాన టికెట్స్‌ని బయటపెట్టారు. తన కుమారుడు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడని చెబుతూ రోదించింది.ఇలా ఏదో ప్రేమ కోసం గొడవ అనుకున్న కేసు కాస్త ట్విస్టులు, టర్న్స్ తీసుకుని థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. మరి ఈ మొత్తంలో తప్పు ఎవరదన్నా సరే చెప్పడం కష్టం. మరి ఈ గొడవలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో ఏంటో?(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
బోగస్ ఇన్వాయిస్లతో ‘స్కిల్’ నిధులు స్వాహా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసు కీలకమలుపు తిరిగింది. షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది స్పష్టమైంది. ఈ బాగోతంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కాం కేసులో నిందితుడు (ఏ–13)గా ఉన్న ఆయన తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ స్కాంలో బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా.. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారి స్కిల్ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులు, తెరవెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్ షాను సీఐడీ గతంలో అరెస్టుచేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. యోగేశ్ గుప్తానే కథ నడిపారు.. ఇక ఈ కేసులో చంద్రబాబు సన్నిహితుడు యోగేశ్ గుప్తా పాత్ర మరోసారి బయటకొచ్చింది. అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాలు, టిడ్కో ప్రాజెక్టు కాంట్రాక్టుల కేటాయింపులో నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు వసూలుచేసి చంద్రబాబుకు చేరవేయడంలో యోగేశ్ గుప్తా పాత్రధారిగా ఉన్నారు. అందుకే ఈయనకు ఐటీ శాఖ కూడా నోటీసులిచ్చి విచారించింది. అలాగే, స్కిల్ స్కాం కేసులోనూ యోగేశ్ గుప్తా నిందితుడుగా (ఏ–22) ఉన్నారు. నిధుల అక్రమ తరలింపులో ఈయన కీలకపాత్ర పోషించారని చంద్రకాంత్ షా తన అప్రూవర్ పిటిషన్లో వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడు సావన్ కుమార్ జజూ (ఏ–26)తో కలిసి యోగేశ్ గుప్తా 2016లో ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షాను సంప్రదించారు. డిజైన్‌టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్లు.. ఐటీ సేవలు అందించినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు కావాలని కోరారు. అనంతరం.. ఏసీఐ కంపెనీ పేరిట స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్‌టెక్ కంపెనీకి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చారు. సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు నమ్మించేందుకే బోగస్ ఇన్వాయిస్లు తమ నుంచి తీసుకున్నట్లు తాను గుర్తించానని చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఈ బోగస్ ఇన్వాయిస్ల విలువ మేరకు రూ.64,87,39,313 ఏసీఐ కంపెనీ బ్యాంకు ఖాతాలో జమచేశారు. అనంతరం సావన్‌కుమార్ చెప్పిన పలు షెల్ కంపెనీలకు ఆ నిధులను చంద్రకాంత్ షా బదిలీ చేశారు. మరోవైపు.. స్కిల్ స్కాం నిధులు రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు సీఐడీ తాజాగా గుర్తించింది. ఇందులో రూ.64.87 కోట్లు ఏసీఐ కంపెనీ బోగస్ ఇన్వాయిస్‌లతోనే అక్రమంగా తరలించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. చంద్రకాంత్ షా అప్రూవర్ పిటిషన్‌పై విచారణకు డిసెంబర్ 5న హాజరుకావాలని కోర్టు ఆయన్ని ఆదేశించింది. దాంతో స్కిల్ స్కాం దర్యాప్తులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. -
19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్‌పోర్ట్‌తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ యోగేష్ కాద్యాన్‌పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్‌లోని బాబిన్హా గ్యాంగ్‌లో చేరిన కాద్యాన్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్‌పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్‌పోర్ట్‌లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఆ పొత్తు చైనాకు తప్పదా?
చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్‌లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇంటా బయటా సమస్యలనూ, విమర్శలనూ ఎదుర్కొంటున్నారు. అమెరికా నేతృత్వంలో చైనాపై ఆంక్షలు మరింత పెరగడం, ఆసియాలో తన బలమైన పోటీదారైన భారత్‌కు పాశ్చాత్య పెట్టుబడులు తరలిపోతుండటం జిన్‌పింగ్‌కి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలు జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీంతో పాలనా విధానాలు, సంస్కరణలపై తన వైఖరిని ఆయన సడలించుకుంటున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు. జీరో–కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నవంబర్‌లో చైనావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్త డంతో గత మూడు నెలలుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. ప్రజానిరసనల తర్వాత జిన్‌పింగ్ తన పాలసీని వదిలేయవలసి వచ్చింది. దీంతో చైనాలో కోవిడ్–19 ఇన్ఫెక్షన్ల వేవ్స్ ఉద్ధృతంగా వ్యాపించాయి. నూతన సంవత్సర వేళ తాను చేసిన ప్రసంగంలో, తన జీరో–కోవిడ్ పాలసీపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత గురించి జిన్‌పింగ్ తప్పకుండా ప్రస్తావించాల్సి వచ్చింది. ‘‘ఒక పెద్ద దేశంలో ఒకే సమస్యపై వివిధ రకాల ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉండటం సహజం’’ అని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల జనాభాలో అత్యధిక శాతం మందికి ఇన్ఫెక్షన్లు సోకాయి. వృద్ధులు, ఇతర వ్యక్తులు పెద్ద సంఖ్యలో మరణించారు. అనేక ప్రాపర్టీ కంపెనీలు దివాలా తీయడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అనేక కంపెనీలు మూసివేతకు గురవడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో జిన్‌పింగ్ పాలనకు వ్యతిరేకంగా అసమ్మతి గణనీయంగా పెరిగిపోయింది. దేశీయ శాంతి, సుస్థిరత, పాలనా నిర్వహణ జిన్‌పింగ్‌కే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనకు కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయం. దీంతో తన పాలసీలపై విమర్శను అడ్డుకోవడానికి జిన్‌పింగ్ అతి చురుకుగా పనిచేయాల్సి వచ్చింది. ఆయన తన నూతన సంవత్సర ప్రసంగంలో అమెరికా, తదితర దేశాలకు చేరువ కావడం కోసం చైనా మాతృభూమితో తైవాన్ పునరేకీకరణ అనే ఊతపదాన్ని వదిలేసుకున్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పారు. శరవేగంగా చైనా జాతి శ్రేయస్సు సాధించడానికి తమ రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్వదేశంలోని విభిన్న గ్రూపులతో మాట్లాడుతున్న సమయంలో తన జీరో–కోవిడ్ పాలసీని జిన్‌పింగ్ సమర్థించుకున్నారు. ఇది దేశంలో కేసుల నిష్పత్తిని తగ్గించిందనీ, మరణాల రేటును అత్యంత తక్కువ శాతానికి తగ్గించివేసిందనీ చెప్పారు. అయితే జి¯Œ పింగ్‌ను దుర్వార్తలు వెంటాడుతున్నాయి. 2022లో చైనా జనాభా 8.5 లక్షల మేర పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ జనవరి 17న ప్రకటించింది. వరదలు, కరవుల కారణంగా, మావో అమలుపర్చిన గొప్ప ముందంజ పారిశ్రామిక విధానం 1961లో కుప్పకూలిన తర్వాత చైనాలో జనాభా తగ్గిపోవడం ఇదే మొదటిసారి. దారిద్య్రాన్ని వేగంగా అధిగమించడానికి ఒకే సంతానం పాలసీని దాని దీర్ఘకాలిక పర్యవసానాలపై అధ్యయనం చేయకుండానే అమలు చేయాలని 1979లో చైనా పాలకులు నిర్ణయించడంతో చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. అమెరికాకు చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ యి ఫుక్సియన్ ప్రకారం, చైనాలో సంతాన సాఫల్య రేటు 1.3 శాతానికి పడిపోయింది. (జనాభా భర్తీ రేటు 2.1 శాతం). దేశం తన సంతాన సాఫల్య రేటును 1.2 శాతం వద్ద స్థిరపర్చగలిగితే చైనా జనాభా 2050 నాటికి 1.07 బిలియన్లకు, 2100 నాటికి 48 కోట్లకు పడిపోతుంది. జనాభా తగ్గి పోవడం అంటే... ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటం, వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెరగడం, సామాజిక సంక్షేమ అవసరాలు కుంచించుకుపోవడం, పొదుపు మొత్తాలు తగ్గిపోవడం, వీటికి మించి వస్తూ త్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రజల కొను గోలు శక్తి సన్నగిల్లిపోవడం, ఆర్థిక వృద్ధి పతనమవడం అని అర్థం. పైగా దేశ వస్తూత్పత్తి రంగం, వ్యవసాయం, శ్రమశక్తి, సామగ్రి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో మరింతగా రోబోలను దింపాలని చైనా పథకరచన చేసింది. అయితే ఇప్పటికే ప్రతి 10 వేలమంది ప్రజలకు 322 రోబోలను అందుబాటులో ఉంచిన చైనాపై తాజా పథకం చూపే ప్రభావం పెద్దగా ఉండదు. ప్రపంచ రోబోటిక్స్ రిపోర్ట్–2022 ప్రకారం రోబోల వినియోగంలో అమె రికాను చైనా అధిగమించడమే కాక, ప్రపంచంలో రోబోల వినియోగంలో అయిదో స్థానంలో నిలిచింది. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలకు సంబంధించిన వార్తలు కూడా జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీనికి తోడు చైనాను ‘కనీవినీ ఎరుగని వ్యూహాత్మక సవాలు’గా అభివర్ణించిన జపాన్ 2027 నాటికి జీడీపీలో రక్షణ బడ్జెట్ 2 శాతం పెంచాలని నిర్ణయించుకుంది. అంతేకాక చైనాకు, ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా జపాన్ కొత్త క్షిపణులు, మానవ రహిత వ్యవస్థలకు చెందిన టెక్నాలజీలు, సైబర్ స్పేస్, అంతరిక్షం, ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్, కృత్రిమ మేథ వంటి ఎదురుదాడి సామర్థ్యాలను మిక్కుటంగా సేకరించనుంది. 2046 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 26 లక్షల డాలర్లకు చేరుకుంటుందనీ, 2025 నాటికి చైనా నుంచి 25 శాతం అమెరికన్ సెల్ఫోన్ల ఉత్పత్తిని భారత్‌కు తరలించాలనీ అమెరికా సెల్‌ఫోన్ మాన్యు ఫ్యాక్చరింగ్ సంస్థ యాపిల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రకటించిన అంచనాలు జిన్‌పింగ్‌కి సంతోషం కలిగించవు. ఆసియా ప్రాంతంలో భారత్ పురోగతిని అడ్డుకుని తన ఆధిక్యాన్ని చాటుకోవాలని చైనా ఇప్పటికే లక్ష్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక శక్తిని బలహీనపర్చడానికి భారత్ – అమెరికా పొత్తు పెట్టుకోవడం మరో ఉదాహరణగా జిన్‌పింగ్ అభిప్రాయ పడవచ్చు. ఈ అన్ని పరిణామాల వెలుగులో అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా జిన్‌పింగ్ అనేక చర్యలు తీసుకున్నారు. మొదటి చర్యగా అమెరికా ప్రభుత్వంపై వాడే తీవ్ర పదజాలాన్ని చైనా ప్రభుత్వం తగ్గించుకుంది. విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత, ద్రవ్యవ్యవస్థ, పర్యావరణ మార్పు తదితర మంత్రిత్వ శాఖలతో భేటీకి చైనా అధ్యక్షుడు సమ్మతి తెలియజేశారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా తదితర దేశాలు చేసే చిన్న విమర్శలను కూడా తీవ్ర పద జాలంతో తిప్పికొట్టే ధోరణిని జిన్‌పింగ్ మంత్రులు ఇప్పుడు పక్కన పెట్టేశారు. తమ పట్ల అమెరికాకు మించి మరింత స్వతంత్ర వైఖరితో వ్యవహరిస్తున్న జర్మనీ, ఫ్రా¯Œ ్స, ఇటలీ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా చైనా తహతహలాడుతోంది. గ్లోబల్ పెట్టుబడికీ, మార్కెట్ సంస్కరణలకూ తలుపులు తెరిచి మార్పునకు తాము సిద్ధమేనంటూ సంకేతాలు వెలువరించడంలో భాగంగా దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సుకు చైనా ప్రతినిధిగా చైనా ఉప ప్రధాని, తన పూర్వ ఆర్థిక సలహాదారు అయిన లియూ హేని చైనా అధ్యక్షుడు పంపించారు. పాశ్చాత్య బడా కంపె నీలకు లియూ హే సుపరిచితుడు కావడం విశేషం. అయితే 2022 అక్టోబర్‌లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ సందర్భంగా లియూ హేని పోలిట్ బ్యూరో పదవి నుంచి జిన్‌పింగ్ తొలగించడం విశేషం. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అవలంబించిన లోపభూయిష్ఠ విధానాల కారణంగా అమెరికా, పలు యూరోపియన్, ఆసియా దేశాల, కంపెనీల విశ్వాసం దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వాతావరణం నుంచి బయటపడే ఎత్తుగడలో భాగంగా మాత్రమే జిన్‌పింగ్ విధానాల్లో వెనుకడుగు వేస్తున్నారనీ, తన వైఖరిని మార్చుకుంటున్నారనీ విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. చైనా ఆర్థిక ప్రగతిని బలహీనపరచడానికి ఆ దేశంపై తమ ఒత్తిడిని ఇవి కొనసాగించనున్నాయి. జిన్‌పింగ్ దూకుడునూ, ఆధిపత్యాన్నీ ప్రతిఘ టించడానికి చైనా సాంకేతిక పురోగతిని దెబ్బతీయాలని కూడా ఇవి గతంలోనే నిర్ణయించుకున్నాయన్నది గమనార్హం. యోగేశ్ గుప్తా వ్యాసకర్త మాజీ రాయబారి (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
యూపీ ఎన్నికల ఫలితాలు; వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్‌తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్‌తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్‌పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!) -
అదరహో... దేవేంద్ర, సుందర్
పారాలింపిక్స్ జావెలిన్ త్రోలోనే భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల ఎఫ్–46 కేటగిరీలో పోటీపడిన రాజస్తాన్ జావెలిన్ త్రోయర్లు దేవేంద్ర ఝఝారియా రజతం సాధించగా... సుందర్ సింగ్ గుర్జర్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. 40 ఏళ్ల దేవేంద్ర బల్లెంను 64.35 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... 25 ఏళ్ల సుందర్ సింగ్ బల్లెంను 64.01 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో దేవేంద్రకిది మూడో పతకం కావడం విశేషం. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో, 2016 రియో పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణ పతకాలు గెలిచాడు. వినోద్‌కు నిరాశ మరోవైపు ఆదివారం పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేదని అతని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిర్వాహకులు దీనిపై సమీక్షించారు. చివరకు వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేకపోవడంతో అతని ఫలితాన్ని రద్దు చేసి కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. యోగేశ్ అద్భుతం... పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–56 విభాగంలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రజత పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన 24 ఏళ్ల యోగేశ్ డిస్క్‌ను చివరిదైన ఆరో ప్రయత్నంలో 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినె బటిస్టా (బ్రెజిల్–45.59 మీటర్లు) స్వర్ణం, లియోనార్డో దియాజ్ (క్యూబా–43.36 మీటర్లు) కాంస్యం సాధించారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో భారత షూటర్ స్వరూప్ ఉన్హాల్కర్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన స్వరూప్ 203.9 పాయింట్లు స్కోరు చేశా>డు. -
రైతుల కోసం 19 ఏళ్ల కుర్రాడి అద్భుత ఆవిష్కరణ!
రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలోని బమోరికల గ్రామానికి చెందిన 19 ఏళ్ల యోగేష్ అనే ఒక యువ రైతు ఎవరూ సహాయం లేకుండా నడిచే సరికొత్త డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ను ఆవిష్కరించాడు. డ్రైవర్ సాయంతో నడిచే ట్రాక్టర్లో మార్పులు చేసి ఈ ఘనత సాధించాడు. యోగేష్ బీఎస్సి ఫస్ట్ చదువుతున్నాడు తన తండ్రికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇంటికి రావాలని అని ఫోన్ వచ్చింది. తండ్రి ఆరోగ్యం కుదుట పడే వరకు అక్కడే ఉన్నాడు. యోగేశ్ తండ్రి ట్రాక్టర్ నడపవలసి వచ్చినప్పుడల్లా కడుపులో నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నాడు. తండ్రి పడుతున్న భాదలు గమనించి డ్రైవర్ లెస్ ట్రాక్టర్ తయారు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. కేవలం రెండు వేల రూపాయలతో ప్రయోగం మొదలుపెట్టాడు. ఇది ఎలా పనిచేస్తుందో తండ్రికి చెప్పినప్పుడు ట్రాక్టర్ ఎవరు సహాయం లేకుండా టెస్ట్ చేసి తండ్రి చుపించామన్నాడు. యోగేశ్ రెండు వేల రూపాయలతో కొన్ని పరికరాలను కొనుగోలు చేసి రిమోట్ సాయంతో ట్రాక్టర్ ను వెనుకకు ముందుకు నడిపించాడు. తండ్రికి కొడుకు ఆలోచనలపై నమ్మకం కలిగి అప్పుడు యోగేష్ కు రూ.50 వేలు అప్పు చేసి డబ్బు ఇచ్చాడు. పట్టుదలతో యోగేశ్ డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ తయారు చేశాడు. ఈ ట్రాక్టర్ తో రైతుకు ఎన్నో లాభాలు అంటున్నాడు యోగేష్. ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తుందని, డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపాడు. యోగేష్ రూపొందించిన రిమోట్ కంట్రోలర్ ట్రాక్టార్ ను చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు మైలేజ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు -
‘రజనీగంధ’ కవి యోగేష్ మృతి
‘రజనీగంధ’ సినిమా గుర్తుందా? అందులోని ‘రజనీగంధ ఫూల్ తుమ్హారే’ పాట ఇప్పటికీ సంగీత ప్రియులకి ఎంతో ఇష్టమైనది. రాజేష్ ఖన్నా నటించిన ‘ఆనంద్’ సినిమా తెలుసు కదా. అందులో ముఖేశ్ పాడిన ‘కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే’ పాటను ఎందరో ఇప్పటికీ కూనిరాగం తీస్తూనే ఉంటారు. ఇక ‘ఛోటీసి బాత్’లో లతా పాడిన ‘నా జానే క్యూ’ టైటిల్ సాంగ్ ప్రతి రెండోరోజూ రేడియోలో వస్తూనే ఉంటుంది. ఈ అన్ని పాటలు రాసిన సుప్రసిద్ధ సినీ గీత రచయిత యోగేష్ (77) నేడు ముంబైలో తుదిశ్వాస విడిచాడు. తక్కువ పాటలు రాసినా రాసినవి నిక్కమైన నీలాలు అని యోగేష్ పేరు పొందాడు. హిందీ పాటలలో సాధారణంగా మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, హస్రత్ జైపురి వంటి ఉర్దూ కవుల ప్రభావం ఎక్కువ. పాటలలో ఉర్దూపదాల వాడకం కూడా ఎక్కువ. కాని యోగేష్ తన పాటలలో హిందీపదాల ఉపయోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. పొదుపైన పదాలతో పాటలు రాసేవాడు. లక్నోకు చెందిన యోగేష్ తండ్రి మరణంతో 18 ఏళ్ల వయసులో ముంబై చేరుకుని సినీ రంగంలో పాటల రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. చాలాకాలం ఆయన మురికివాడల్లోనే ఒక గుడిసెలో నివసించాడు. ఆయనతోపాటు లక్నో నుంచి వచ్చిన మిత్రుడొకడు తాను సంపాదిస్తూ మిత్రుణ్ణి ఎలాగైనా సినీ రచయితగా చూడాలని సంకల్పించడంతో యోగేష్ కవిగా నిలదొక్కుకున్నాడు. సంగీత దర్శకుడు సలీల్ చౌదరి ఎక్కువగా యోగేష్‌ను ప్రోత్సహించాడు. ఆయన సంగీతంలో యోగేష్ రాసిన ‘కహి బార్ యూ భీ దేఖాహై’ (రజనీగంధ) పాడి గాయకుడు ముఖేశ్ జాతీయ పురస్కారం పొందాడు. ఎస్.డి.బర్మన్, రాజేష్ రోషన్ తదితర సంగీతదర్శకులు యోగేష్ సృజనను ఉపయోగించుకున్నవారిలో ఉన్నారు. ‘మిలి’, ‘బాతో బాతోం మే’, ‘మంజిల్’, ‘అన్నదాత’ తదితర సినిమాలలో యోగేష్ పాటలు రాశాడు. నలుగురిలో చొచ్చుకుపోయే అలవాటు లేకపోవడం వల్ల ఆయనకు ఎక్కువ పాటలు రాలేదన్న వ్యాఖ్య ఉంది. యోగేష్ గత 15 సంవత్సరాలుగా ఒంటరిగా ముంబైలో జీవిస్తున్నాడు. ఆయన భార్య ఆయనతో 30 ఏళ్ల క్రితమే విడిపోయింది. ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. వారు కూడా తండ్రిని పెద్దగా చూడలేదు. సత్యేంద్ర త్రిపాఠి అనే గాయకుడు ఆయన బాగోగులు చూస్తూ వచ్చాడు. ఆయన ద్వారానే యోగేష్ మరణవార్త లోకానికి తెలిసింది. యోగేష్ పట్ల గాయని లతా మంగేష్కర్‌కు అమిత అభిమానం ఉంది. ‘ఆయన రాసిన చాలా మంచి పాటలు నేను పాడాను. ఆయన మరణవార్త విని బాధ కలిగింది. ఆయన శాంత స్వభావం ఉన్నవాడు. ఆయనకు నా శ్రద్ధాంజలి’ అని ఆమె ట్వీట్ చేసింది. యోగేష్‌ను సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో మర్చిపోయింది. కాని ఆయన పాటలు మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుంటాయి. -
డిజిటల్ మార్కెటింగ్ అడ్డా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం విద్య, వైద్యం, వినోదం ఏ రంగంలోనైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ప్రధానంగా మారింది. కంపెనీ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారంలో ఇతర మాధ్యమాల మార్కెటింగ్ కంటే డిజిటల్ మార్కెటింగ్ ముందున్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే దీన్ని వ్యాపార వేదికగా ఎంచుకుంది ‘డిజిటల్ అకాడమీ 360’. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ యోగేష్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. బెంగళూరులో మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తయ్యాక.. జిఫ్పీ ఎస్ఎంఎస్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా చేరా. మూడేళ్లు పనిచేశాక.. సొంతంగా బల్క్ ఎస్ఎంఎస్ కంపెనీ పెట్టా. ఆ తర్వాత అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కూడా! ఐదేళ్ల తర్వాత మార్కెటింగ్ రంగంలోని మార్పులు గమనించి.. దీన్నే వ్యాపార వేదికగా మార్చుకోవాలని నిర్ణయించుకొని నవంబర్ 2015లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా డిజిటల్ అకాడమీ 360ని ప్రారంభించా. త్వరలోనే 10 రకాల కోర్సులు.. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ రెండు రకాల కోర్సులున్నాయి. వీటిల్లో 30కి పైగా సబ్జెక్స్ ఉంటాయి. ధర ఒక్క కోర్సుకు రూ.41 వేలు. ఇప్పటివరకు 20 వేలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. వచ్చే ఏడాది కాలంలో 60 వేల మందికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది ముగిసే నాటికి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, యూఐయూఎక్స్, మొబైల్ డెవలప్మెంట్ వంటి 10 రకాల కోర్సులను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం ఆయా సబ్జెక్ట్స్‌లో మెటీరియల్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం అమెజాన్, పేటీఎం, యాహూ, కేపీఎంజీ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. 6 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోకి.. ప్రస్తుతం బెంగళూరు, పుణే, మైసూర్, ఢిల్లీ, నోయిడా, చెన్నై నగరాల్లో 21 శిక్షణ కేంద్రాలున్నాయి. 6 నెలల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లను ప్రారంభించనున్నాం. ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లోనూ డిజిటల్ అకాడమీ 360 సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. ఆయా దేశాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. స్థానికంగా ఒకటిరెండు ఫ్రాంచైజీ శిక్షణ సంస్థలతో కలిసి సెంటర్లను ప్రారంభించనున్నాం. మొత్తంగా ఏడాదిన్నరలో 50 సెంటర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఫ్రాంచైజీ రూ.25 లక్షలు.. స్టడీ మెటీరియల్స్, పరీక్ష పత్రాల తయారీ, శిక్షణ కోసం 60 మంది ట్రైనర్లున్నారు. ఏడాదిలో 200 మందికి చేరుకుంటాం. ప్రతి నగరంలో ఒక్క సెంటర్ మాత్రమే డిజిటల్ అకాడమీ 360ది ఉంటుంది. మిగిలినవి ఫ్రాంచైజీ రూపంలో ఉంటాయి. ఒక్క సెంటర్ ఫ్రాంచైజీ వ్యయం రూ.25 లక్షలు. ఇందులో శిక్షకుల సరఫరా, మార్కెటింగ్, మెటీరియల్ సప్లయి వంటివన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఫ్రాంచైజర్ స్థానికంగా ఉంటూ అకాడమీని నడిపిస్తే చాలు. మొదటి 3 నెలల పాటు రాయల్టీ ఉండదు. ఆ తర్వాత 12 నెలల వరకు నెలకు రూ.50 వేలు ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఆదాయంలో 12–25 శాతం వరకు వాటా ఉంటుంది. రూ.40 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.9 కోట్లు లక్షి్యంచాం. డిజిటల్ అకాడమీ 360 కేంద్ర ప్రభుత్వం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ), గూగుల్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ప్రస్తుతం మా కంపెనీలో 80 మంది ఉద్యోగులున్నారు. ఈ డిసెంబర్ ముగింపు నాటికి రూ.40 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి’’ అని యోగేష్ తెలిపారు. -
ముందే మీడియాకు బన్సల్ సూసైడ్ లేఖలు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టయి ఆత్మహత్యకు పాల్పడిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి ఒక రోజు ముందే అన్ని మీడియాలకు తాను ఆత్మహత్య చేసుకుంటున్న కారణాలను వివరించిన లేఖలు పంపించినట్లు తెలిసింది. ఓ ఇద్దరు వ్యక్తులు ఈ లేఖలు కొరియర్ సంస్థకు ఇచ్చేందుకు విడివిడిగా రెండు బైకులపై వెళ్లారట. అదే రోజే సీబీఐకి కూడా ఒక లేఖను వారు పంపించారు. అవినీతి కేసులో అరెస్టయిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్(60), ఆయన కొడుకు యోగేశ్(30) మంగళవారం ఢిల్లీలోని వారి నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓ ఔషధ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో జూలై 16న అరెస్టయిన బన్సల్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు నెలల కిందట ఆయన భార్య, కూతురు కూడా ఈ కేసు వల్ల అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. బన్సల్ తన భార్య ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉరేసుకోగా, కొడుకు యోగేశ్ తన సోదరి చనిపోయిన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సీబీఐ అధికారులు కారణం అని మీడియాకు లేఖల ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆ లేఖలు చేరవేసిన కొరియర్ సంస్థగా వివరాలు వెల్లడించారు. లక్ష్మీ నగర్ లోని ఓ కొరియర్ సంస్థ వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కొరియర్ వివరాలు అడిగారని మొత్తం ఎనిమిది లేఖలు ఇచ్చి అనంతరం వారి బైకులపై వెళ్లిపోయారని చెప్పారు. -
రెండు నెలల్లో 4 ఆత్మహత్యలు చూసింది!
న్యూఢిల్లీ: ఏడు నెలల క్రితం ఆ ఇంట్లో పనిచేసేందుకు ఆమె చేరింది. రెండు నెలల్లో నలుగురి ఆత్మహత్యలు చూసింది. ఒకే ఇంటిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న నలుగురిని కళ్లారా చూసి షాక్ కు గురైంది. లంచం కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సాల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆత్మహత్యల కేసులో సాక్షిగా నిలిచింది వారింట్లో పనిచేస్తున్న రచనా శ్రీవాస్(17) అనే బాలిక. సోమవారం పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె జవాబిచ్చింది. మధ్యప్రదేశ్ లోని తికాంగఢ్ ప్రాంతానికి చెందిన రచన తన తండ్రితో కలిసి ఏడాదిన్నర క్రితం ఢిల్లీకి వచ్చింది. తాపిమేస్త్రిగా పనిచేస్తున్న తండ్రితో కలిసి తూర్పు ఢిల్లీలోని అలా కాలనీలో నివాసం ఉంటోంది. స్థానిక సెక్యురిటీ సాయంతో బన్సల్ ఇంట్లో పనికి కుదిరింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందురోజు తన దగ్గర పనిచేసే వారందరికీ బన్సన్ జీతాలు ఇచ్చారని రచన తెలిపింది. తాము సెలవులు గడిపేందుకు వెళుతున్నామని, నెల రోజుల తర్వాత తిరిగొస్తామని తమతో బన్సల్ చెప్పారని వెల్లడించింది. సీబీఐ బన్సల్ ను అరెస్ట్ చేయడానికి ముందు ఆయన కుటుంబం చాలా సంతోషంగా ఉండేదని చెప్పింది. ‘సీబీఐ అధికారులు తమ బ్యాంకు ఖాతాలు నిలిపివేశారని.. ఇంట్లో బంగారపు వస్తువులు సీజ్ చేసి పట్టుకెళ్లారని, కేవలం రూ.21 వేలు మాత్రమే మిగిల్చారని నాతో బన్సల్ చెప్పారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ఇంట్లో పనిచేసే వారందరికీ జీతాలు చెల్లించేవార’ని రచన తెలిపింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు బన్సల్ ఇంటి నుంచి తిరివచ్చేస్తుంటే ఆయన కుమారుడు యోగేశ్ తాడుతో కనిపించాడు. తాడు ఎందుకు తెచ్చారని ప్రశ్నించగా ఇంట్లో అవసరాల తెచ్చానని అతడు సమాధానమిచ్చాడ’ని రచన వెల్లడించింది. తల్లి సత్యబాల, సోదరి నేహ చనిపోయిన తర్వాత యోగేశ్ బాగా కుంగిపోయాడని పొరుగింటివారు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అతడు బాగా నష్టపోయాడని వెల్లడించారు. భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కొడుకుని పెళ్లికి ఒప్పించేందుకు బన్సల్ విఫలయత్నం చేశారని చెప్పారు. -
‘కార్పొరేట్’ మాజీ డీజీ బన్సల్, కొడుకు ఆత్మహత్య
సీబీఐ వేధింపుల వల్లేనని సూసైడ్ నోట్ న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టయిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్(60), ఆయన కొడుకు యోగేశ్(30) మంగళవారం ఢిల్లీలోని వారి నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ఔషధ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో జూలై 16న అరెస్టయిన బన్సల్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. రెండు నెలల కిందట ఆయన భార్య, కూతురు కూడా ఈ కేసు వల్ల అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం పనిమనిషి రచన తలుపు తెరిచాక తండ్రీ, కొడుకుల ఆత్మహత్య బయటపడింది. బన్సల్ తన భార్య ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉరేసుకోగా, కొడుకు యోగేశ్ తన సోదరి చనిపోయిన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. యోగేశ్‌ను సీబీఐ విచారణకు పిలిచిందని బన్సల్ సోమవారం ఎవరికో చెబుతుండగా విన్నట్లు రచన తెలిపింది. కుటుంబ సభ్యుల విడి ఫోటోలు జతచేసి వెదజల్లి ఉన్న సూసైడ్ నోట్ల జిరాక్స్‌లు కనిపించాయి. యోగేశ్ తన సూసైడ్ నోటులో సీబీఐ వేధింపులకు గురిచేసిందన్నాడు. కేసులో యేగేశ్ నిందితుడు కాడని అతణ్ని విచారణకు పిలిపించలేదని సీబీఐ పేర్కొంది. -
నిత్య రక్తదాత.. నీకు సలాం
ఆయనేమీ సెలబ్రిటీ కాదు. కానీ జాతీయ ఛానెళ్లు సైతం ఆయన ఇంటికి వచ్చి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఆయనేమీ సూపర్ హీరో కాదు. అయినప్పటికీ ఇటీవల ముంబైకి చెందిన లివ్ కెమిస్ట్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. రవీంద్రభారతిలో జరిగే సన్మాన గ్రహీతల్లో ఎప్పుడూ ఆయన పేరు చూసి ఉండకపోవచ్చు. కానీ.. గవర్నర్ల చేతుల మీదుగా ఏకంగా 17 గోల్డ్ మెడల్స్ అందుకున్న ఘనత ఆయనది. రక్తదాతగా పెద్ద రికార్డులు సృష్టించిన నగరంలోని ఓ చిన్న మెడికల్ షాప్ ఓనర్ ప్రస్థానమిది. - ఎస్.సత్యబాబు 60 ఏళ్ల వరకూ దానం చేస్తా.. 101 సార్లు దానం చేశాక ఆపేద్దామని మొదట అనుకున్నా. ఆ తర్వాత 111 అనుకున్నా. కానీ ఇప్పుడు 60 ఏళ్ల వరకూ ఇవ్వొచ్చు కదా అనిపిస్తోంది... అందుకే కొనసాగిస్తాను. నా ఇద్దరు కుమార్తెలు కూడా రక్తదానం చేస్తామంటున్నారు. 19 ఏళ్ల తర్వాత వారితోనూ చేయిస్తా. రెడ్‌క్రాస్ ద్వారా 17 గోల్డ్ మెడల్స్ అందుకున్నాను. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. నా దేహాన్ని కూడా దానం చేశా. - యోగేష్ సిటీలోని డీడీ కాలనీలో నివాసముండే యోగేష్ శ్రీవాస్తవ(51 ) ఫోన్ నెంబరు చాలా ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డుల్లో, వైద్యుల దగ్గర తప్పకుండా ఉంటుంది. ఒక్క కాల్ చేస్తే చాలు పరుగున వచ్చి రక్తదానం చేస్తారనే పేరున్న ఈయన, కాల్ రాకపోయినా ఊరుకునే రకం కాదు. రెడ్‌క్రాస్‌కు వెళ్లి మరీ రక్తం దానం చేస్తారు. ‘1983 అక్టోబర్ 2న తొలిసారి రక్తదానం చేశాను. అప్పటి నుంచి మూడు నెలలకొకసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నా’నంటూ వివరించాడీ రక్తదాత. యోగేష్ ఇప్పటికి వందసార్లకు పైగా రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ‘తొలిసారి రక్తదానం చేసినప్పుడు ‘ఈ రోజు మీరు ఇద్దరికి ప్రాణదానం చేశార’ని డాక్టర్ చెప్పారు. అది నాకెంతో ఆనందానిచ్చింది. ఆర్థిక సహాయం చేయలేని నేను రక్తదానం చేసి తోటివారికి సాయపడొచ్చని తెలిసిదంటా’రు దూద్‌బౌలిలో మెడికల్ షాప్ నిర్వహించే యోగేష్. ఆరోగ్యకరమైన అలవాటు.. ‘ఉదయం 6 గంటలకు వాకింగ్ చేస్తాను. రాత్రి వరకు మెడికల్ షాప్‌లో ఉంటాను. రోజుకు 14 నుంచి 15 గంటలు పని చేస్తాను. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు’ అని చెప్తున్న యోగేష్.. రక్తదానం ఆరోగ్యకరమైన అలవాటంటారు. ‘పెళ్లయిన కొత్తలో నా భార్య రక్తదానానికి అడ్డు చెప్పింది. అయితే మేం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక మహిళ ఎదురుపడి.. ‘ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ భర్త వల్లేన’ని ఆమెకి చెప్పింది. ఆ తర్వాత ఇక తనెప్పుడూ నాకు అడ్డు చెప్పలేదు. రక్తదానంపై పూర్తి అవగాహన వచ్చిందామెకి. ఇప్పుడు రక్తం దానం చేసే సమయాన్ని ఆమే నాకు గుర్తు చేస్తుంటుంద’ని చెప్పారు యోగేష్. -
కోట్ల ఖర్చుతో మరో ఎన్నారై పెళ్ళి...
పెళ్ళంటె పందిళ్ళు, సందళ్ళు.... తప్పెట్లు, తలంబ్రాలు అన్న చందంనుంచీ కోట్ల రూపాయల ఖర్చులు, చిత్ర సీమను మించిపోయే సెట్లుగా మారిపోయాయి. విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్తలు వారి పిల్లల పెళ్ళిళ్ళకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి... స్టేటస్ ను చాటుతున్నారు. ఒకరికంటే ఒకరు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల కేరళకు చెందిన ఎన్నారై రవి పిళ్ళై జరిపిన అత్యంత ఖరీదైన పెళ్ళి మరిచిపోకముందే... మరో పారిశ్రామికవేత్త యోగేష్ మెహతా తన ఏకైక కుమారుడి పెళ్ళికి సుమారు నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైనం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ఇటాలియన్ వెడ్డింగ్ బొనాంజా ఇప్పుడు దుబాయ్ ప్రజలనే కాక, ప్రపంచాన్నే ఆకట్టుకుంటోంది. దుబాయిలో పేరొందిన వ్యాపారవేత్త.. 2015లో టాప్ 50 ధనవంతుల్లో ఒకరైన యోగేష్ మెహతా... తన కుమారుడు రోహాన్ పెళ్ళిని దుబాయి ప్లోరెన్స్ లోని రిలైన్స్ నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. లండన్ వధువు రోషని తో జరిపిన ఈ వివాహానికి సుమారు 500 మంది అతిథులను ఆహ్వానించారు. నవంబర్ 25 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన వివాహ మహోత్సవానికి ఇతర దేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. భారత సంప్రదాయ చీరకట్టుతో, చేతులనిండా గోరింటాకు డిజైన్లతో మెరిసిన వధువు రోషని లండన్ లో సొంతంగా ఓ ఫ్యాషన్ కంపెనీని నడుపుతోంది. ఇక వరుడు రోహాన్ తమ కుటుంబం స్థాపించిన ప్రముఖ పెట్రో కెమ్ కంపెనీలో ఇటీవలే చేరాడు. వధూవరులిద్దరూ ఇకపై దుబాయిలోనే స్థిరపడే ఉద్ద్దేశ్యంలో ఉన్నారట. ఈ కోట్ల రూపాయల పెళ్ళి ఫొటోలను యోగేష్ తన ట్విట్టర్ లో సైతం పోస్ట్ చేశారు. అయితే దక్షిణాసియాలోని సంప్రదాయంలో భాగంగా వరుడు పెళ్ళి సందర్భంలో ఏనుగుపై ఊరేగి రావడానికి మాత్రం... అక్కడి నిబంధనల మేరకు..ఫ్లోరెన్స్ సిటి కౌన్సిల్ అభ్యంతరం తెలిపిందట. ఏది ఏమైనా ఆ సంపన్న వివాహం ఇప్పుడు మీడియాలో ప్రత్యేక వార్తగా మారింది. -
రజనీగంధ ఫూల్ తుమ్హారే...
సంగీతం / యోగేష్ అందరికీ ఈ పాట గుర్తుండే ఉంటుంది. బాసూ చటర్జీ దర్శకత్వం వహించిన ‘రజనీగంధ’ సినిమాలోనిది. అమోల్ పాలేకర్, విద్యా సిన్హా నటించారు. ఈ పల్లవినిగానీ పాటను గానీ వింటే ఇందులో ఉర్దూ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనిని రాసింది యోగేష్. ఉర్దూ సాహిత్యం నుంచి వచ్చిన మజ్రూ సుల్తాన్‌పురి, హస్రత్ జైపురి, సాహిర్ వంటి గీత రచయితలు ఉర్దూ ప్రయోగం ఎక్కువ చేసేవారు. కాని ఇందీవర్, యోగేష్‌లాంటి వాళ్లు మాత్రం శుద్ధ హిందీని ఎక్కువగా వాడేవారు. యోగేష్‌ది లక్నో. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో హిందీ భాష మీద ఉన్న అభిమానంతో బొంబాయి చేరుకున్నాడు. చాలా కాలం పాటల రచయితగా అవకాశం రాలేదు. చివరకు హృషికేశ్ ముఖర్జీ తన ‘ఆనంద్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులో గుల్జార్ వంటి హేమాహేమీలు రాసిన ‘మైనే తేరే లియే హీ సాత్ రంగ్ కే సప్నే చునే’లాంటి పాటలు ఉన్నాయి. కాని యోగేష్ రాసిన ‘జిందగీ కైసి హై పహేలీ’.... ‘కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే’... పాటలకు ఎక్కువ పేరు వచ్చింది. ‘ఆనంద్’కు సంగీతం అందించిన సలీల్ చౌధురికి యోగేష్ రచనా శైలి నచ్చడంతో బాసూ చటర్జీకి చెప్పి ‘ఛోటీ సి బాత్’లో అవకాశం ఇప్పిస్తే అందులో యోగేష్ రాసిన ‘నాజానే క్యూ హోతాహై యే జిందగీ కే సాథ్’.... ‘జానేమన్ జానేమన్ తేరే దో నయన్’... పాటలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ‘రిమ్జిమ్ గిరె సావన్’... ‘కయి బార్ యూ భి దేఖాహై’... వంటి హిట్ పాటలు ఎన్నో రాశాడు. గాయకుడు ముఖేశ్‌కు ఒకే ఒక్కసారి జాతీయ అవార్డు వచ్చింది. అది యోగేశ్ రాసిన ‘కయి బార్ యూ భి దేఖాహై’... పాటకే. ఇది కూడా ‘రజనీగంధ’ సినిమాలోనిదే. యోగేశ్‌కు ప్రస్తుతం 70 సంవత్సరాలు. -
‘తారాంగణి ఇంగేనియా’లో యోగేష్ సందడి
సాక్షి, బెంగళూరు : ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు యోగేష్ విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. వెండితెరపైనే కాదు వేదికపై కూడా తాను అదరగొట్టే డ్యాన్సులు చేయగలనంటూ నిరూపించాడు. నగరంలోని మహారాణి లక్ష్మీ అమ్మణ్ణ కళాశాలలో ‘తారాంగణి ఇంగేనియా-2014’ పేరిట నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్‌లో యోగేష్ పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్‌లో కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ అభిమాన నటుడు యోగేష్‌ను చూడగానే ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. -
వరంగల్ డీఐజీ ఎదుట ఇద్దరు మావోల లొంగుబాటు
ఆనారోగ్యం కారణంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు మావోయిస్టులు ఈ రోజు తమ ఎదుట లొంగిపోయారని వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.కాంతారావు శనివారం ఇక్కడ వెల్లడించారు. సుకుమా జిల్లాకు చెందిన దులారాం అలియాస్ యోగేశ్ పశ్చిమ బస్తార్ డివిజన్లో కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే కే పూజి అలియాస్ అనిత బీజాపూర్ డివిజన్లో కమిటీ సభ్యురాలుగా పని చేస్తుందని చెప్పారు. యోగేశ్‌పై దాదాపు 100 కేసులు ఉన్నాయని వాటిలో 13 హత్య కేసులని అన్నారు. అతన్ని పట్టుకుంటే 1.6 లక్షల రివార్డు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని కాంతారావు చెప్పారు. అలాగే అనితపై 8 కేసు నమోదు ఉన్నాయని తెలిపారు. ఆమె 2001 నుంచి మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహారిస్తుందని అన్నారు. ఆమె తలపై రూ. లక్ష రివార్డును ప్రభుత్వం ప్రకటించిందన్నారు.