‘కార్పొరేట్’ మాజీ డీజీ బన్సల్, కొడుకు ఆత్మహత్య | On bail in graft case, former Corporate Affairs DG BK Bansal commits suicide | Sakshi
Sakshi News home page

‘కార్పొరేట్’ మాజీ డీజీ బన్సల్, కొడుకు ఆత్మహత్య

Published Wed, Sep 28 2016 2:18 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

‘కార్పొరేట్’ మాజీ డీజీ బన్సల్, కొడుకు ఆత్మహత్య - Sakshi

‘కార్పొరేట్’ మాజీ డీజీ బన్సల్, కొడుకు ఆత్మహత్య

సీబీఐ వేధింపుల వల్లేనని సూసైడ్ నోట్

 న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టయిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్(60), ఆయన కొడుకు యోగేశ్(30) మంగళవారం ఢిల్లీలోని వారి నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ఔషధ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో జూలై 16న అరెస్టయిన బన్సల్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. రెండు నెలల కిందట ఆయన భార్య, కూతురు కూడా ఈ కేసు వల్ల అవమాన భారంతో  ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం పనిమనిషి రచన తలుపు తెరిచాక తండ్రీ, కొడుకుల ఆత్మహత్య బయటపడింది.

బన్సల్ తన భార్య ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉరేసుకోగా, కొడుకు యోగేశ్ తన సోదరి చనిపోయిన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. యోగేశ్‌ను సీబీఐ విచారణకు పిలిచిందని బన్సల్ సోమవారం ఎవరికో చెబుతుండగా విన్నట్లు రచన తెలిపింది. కుటుంబ సభ్యుల విడి ఫోటోలు జతచేసి వెదజల్లి ఉన్న సూసైడ్ నోట్ల జిరాక్స్‌లు కనిపించాయి. యోగేశ్ తన సూసైడ్ నోటులో సీబీఐ వేధింపులకు గురిచేసిందన్నాడు.   కేసులో యేగేశ్ నిందితుడు కాడని అతణ్ని  విచారణకు పిలిపించలేదని సీబీఐ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement