CBI harassment
-
ముందే మీడియాకు బన్సల్ సూసైడ్ లేఖలు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టయి ఆత్మహత్యకు పాల్పడిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి ఒక రోజు ముందే అన్ని మీడియాలకు తాను ఆత్మహత్య చేసుకుంటున్న కారణాలను వివరించిన లేఖలు పంపించినట్లు తెలిసింది. ఓ ఇద్దరు వ్యక్తులు ఈ లేఖలు కొరియర్ సంస్థకు ఇచ్చేందుకు విడివిడిగా రెండు బైకులపై వెళ్లారట. అదే రోజే సీబీఐకి కూడా ఒక లేఖను వారు పంపించారు. అవినీతి కేసులో అరెస్టయిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్(60), ఆయన కొడుకు యోగేశ్(30) మంగళవారం ఢిల్లీలోని వారి నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓ ఔషధ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో జూలై 16న అరెస్టయిన బన్సల్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు నెలల కిందట ఆయన భార్య, కూతురు కూడా ఈ కేసు వల్ల అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. బన్సల్ తన భార్య ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉరేసుకోగా, కొడుకు యోగేశ్ తన సోదరి చనిపోయిన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సీబీఐ అధికారులు కారణం అని మీడియాకు లేఖల ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆ లేఖలు చేరవేసిన కొరియర్ సంస్థగా వివరాలు వెల్లడించారు. లక్ష్మీ నగర్ లోని ఓ కొరియర్ సంస్థ వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కొరియర్ వివరాలు అడిగారని మొత్తం ఎనిమిది లేఖలు ఇచ్చి అనంతరం వారి బైకులపై వెళ్లిపోయారని చెప్పారు. -
మా చావుకు సీబీఐ వేధింపులే కారణం
సూసైడ్ నోట్లో బన్సల్ న్యూఢిల్లీ: సీబీఐ వేధింపుల వల్లే తన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని.. తమనూ అలాగే వేధిస్తుండడంతో తను, తన కుమారుడు మృత్యువును ఆశ్రయిస్తున్నామని కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సల్ సూసైడ్ నోట్లో ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెప్టెంబర్ 26(సోమవారం)న ఈమేరకు ఆయన లేఖ రాశారు. ఏడు పేజీల బన్సల్ లేఖను, కుమారుడు యోగేశ్ రాసిన రెండు పేజీల లేఖను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని తమ ఫ్లాట్‌లో మంగళవారం బన్సల్, యోగేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఓ ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకుంటుండగా జూన్‌లో బన్సల్‌ను పోలీసులు అరెస్టు చేయడం, తర్వాత ఆయన బెయిల్‌పై బయటికి రావడం తెలిసిందే. గతంలోనూ విపరీతంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐలోని డీఐజీ, ఇద్దరు మహిళా అధికారులు, లావుగా వుండే హవల్దార్... తన అరెస్టు తరువాత భార్య, కూతురిపై తీవ్ర వేధింపులకు పాల్పడ్డారని బన్సల్ లేఖలో ఆరోపించారు. ఈ విషయాన్ని వారు బంధువులకు, ఇంటి పక్క వారికి చెప్పుకొని ఎంతో ఆవేదన చెందారని వివరించారు. సీబీఐ అధికారులు వేధింపులు మరింత ఎక్కువ కావడంతో అవమానం భరించలేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ బాధలో ఉన్న తనను, తన కుమారుడిని సైతం సీబీఐ అధికారులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని, లైవ్ డిటెక్టర్లు సైతం ఉపయోగించి తమను విచారించారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పారు. కాగా తమ అధికారులపై ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ బుధవారం వెల్లడించారు. బన్సల్, యోగేశ్‌ల లేఖలను పోలీసులు తమకు అందజేశారని.. ఈ వివరాలన్నింటిని కోర్టుకు వివరించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా,బన్సల్, యోగేశ్‌ల అంత్యక్రియలు బుధవారం హరియాణాలోని స్వస్థలమైన హిస్సార్‌లో పూర్తయ్యాయి. -
‘కార్పొరేట్’ మాజీ డీజీ బన్సల్, కొడుకు ఆత్మహత్య
సీబీఐ వేధింపుల వల్లేనని సూసైడ్ నోట్ న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టయిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్(60), ఆయన కొడుకు యోగేశ్(30) మంగళవారం ఢిల్లీలోని వారి నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ఔషధ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో జూలై 16న అరెస్టయిన బన్సల్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. రెండు నెలల కిందట ఆయన భార్య, కూతురు కూడా ఈ కేసు వల్ల అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం పనిమనిషి రచన తలుపు తెరిచాక తండ్రీ, కొడుకుల ఆత్మహత్య బయటపడింది. బన్సల్ తన భార్య ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉరేసుకోగా, కొడుకు యోగేశ్ తన సోదరి చనిపోయిన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. యోగేశ్‌ను సీబీఐ విచారణకు పిలిచిందని బన్సల్ సోమవారం ఎవరికో చెబుతుండగా విన్నట్లు రచన తెలిపింది. కుటుంబ సభ్యుల విడి ఫోటోలు జతచేసి వెదజల్లి ఉన్న సూసైడ్ నోట్ల జిరాక్స్‌లు కనిపించాయి. యోగేశ్ తన సూసైడ్ నోటులో సీబీఐ వేధింపులకు గురిచేసిందన్నాడు. కేసులో యేగేశ్ నిందితుడు కాడని అతణ్ని విచారణకు పిలిపించలేదని సీబీఐ పేర్కొంది.