
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఈ చిత్రంలో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది.
‘‘ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేశ్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: నగేశ్ బానెల్లా.