‘‘యూకే నుంచి వచ్చిన శాంటో ‘స్టాండప్ రాహుల్’ కథ చెప్పాడు.. నాకు చాలా బాగా నచ్చిందని సిద్ధు (‘గని’ చిత్రనిర్మాత) అన్నాడు. ఈరోజు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తుంటే శాంటో తన విజన్‌ని అద్భుతంగా తెరపై చూపించాడని అర్థమవుతోంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హజరయ్యాడు.
చదవండి: బాలకృష్ణ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న కన్నడ స్టార్
‘‘రాజ్ తరుణ్, నేను ఇండస్ట్రీకి ఒకే సమయంలో వచ్చాం.. తను చాలా మంచి సినిమాలు చేశాడు. వర్ష మంచి నటి. రాజ్ తరుణ్, వర్ష తమ పాత్రలకు చక్కగా సరిపోయారు. ఈ సినిమాలో శ్రీరాజ్ విజువల్స్, స్వీకర్ సంగీతం చాలా బాగున్నాయి. నంద, భరత్‌లకు డబ్బులు బాగా రావాలి. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ మీరు మరెన్నో సినిమాలు చేయాలి. ఈ టీమ్ అందరూ ప్యాషన్, హార్డ్‌వర్క్‌తో పని చేశారు.. ఈ సినిమాని అందరూ ఆదరించాలి’’ అన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘స్టాండప్ రాహుల్’ ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. నవ్వడం ఈజీ. కానీ నవి్వంచడం చాలా కష్టం. ఈ చిత్రంలో కామెడీ ఒక్కటే కాదు.. ఇంకా చాలా విషయాలున్నాయి’’ అన్నారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘‘మాకు బాగా సపోర్ట్ చేసినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. స్వీకర్ సంగీతం, శ్రీరాజ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకి నన్ను ఎంచుకున్నందుకు శాంటోకి థ్యాంక్స్. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సిద్ధు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. మా సినిమాని అందరూ చూసి ఆశీర్వదించండి’’ అన్నారు నందకుమార్ అబ్బినేని. ‘‘మా సినిమాని అందరూ థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భరత్ మాగులూరి. శాంటో మోహన్ మాట్లాడుతూ– ‘‘రెండు గంటలు కామెడీ చేద్దామనే ఆలోచనతో ఈ సినిమా చేయలేదు.. ఇందులో చాలా భావోద్వేగాలుంటాయి’’ అన్నారు. ఈ వేడుకలో స్వీకర్ అగస్తి, శ్రీరాజ్ రవీంద్రన్, డైరెక్టర్స్ సాగర్ కె. చంద్ర (‘భీమ్లా నాయక్’), కిరణ్ కొర్రపాటి (‘గని’), వినోద్ (‘మిడిల్ క్లాస్ మెలోడీస్’) నిర్మాత సిద్ధు (‘గని’) తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ప్రశాంత్ కిషోర్‌తో తమిళ స్టార్ హీరో భేటీ.. పోలిటికల్ ఎంట్రీకీ సంకేతమా?
Comments
Please login to add a commentAdd a comment