
యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు హిట్టు పడక చాన్నాళ్లే అయింది. ఈ మధ్య నా సామిరంగ సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ క్రెడిట్ అంతా పెద్ద హీరో అయిన నాగార్జున ఖాతాలోనే పడింది. సోలోగా హిట్ కొట్టి చాలాకాలమే అవుతోంది. ఈ తరుణంలో మరో కొత్త సినిమా మొదలుపెట్టాడీ హీరో. రమేశ్ కడుముల దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాశీసింగ్ హీరోయిన్.
గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి, కేఐటీఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి దర్శకులు ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మారుతి క్లాప్ ఇచ్చారు. నక్కిన త్రినాథరావు తొలి సీన్‌కి దర్శకత్వం వహించారు. ‘‘క్రైమ్ కామెడీగా ఈ మూవీ రూపొందనుంది. అక్టోబరులో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు రమేశ్ కడుముల, కేఐటీఎన్ శ్రీనివాస్. ఇది చాలా మంచి కథ అని, దీన్ని తప్పకుండా జనాలు ఆదరిస్తాడని ధీమాగా ఉన్నాడు రాజ్ తరుణ్. ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాడి, సంగీతం: శేఖర్ చంద్ర.