రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్. స్టడీస్ కోసం ముంబై వెళ్లి, థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను. తెలుగులో నేను నటించిన తొలి సినిమా ‘తిరగబడర సామీ’. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుంది. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని నా క్యారెక్టర్ చెబుతుంది. నేను రియల్ లైఫ్‌లో ఎమ్‌ఎమ్‌ఏ (మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) నేర్చుకున్నాను.
అందుకే ఈ సినిమాలో నా పాత్రకు ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌ని ఈజీగా చేశాను. రాజ్ తరుణ్‌గారి పాత్ర సైలెంట్‌గా మొదలై వైలెంట్‌గా మారుతుంది. ఎందుకు అనేది సినిమాలో చూడాలి. లవ్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్... ఇలా అన్ని అంశాలు మిళితమైన ‘తిరగబడరా సామీ’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేశాను. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత తెలుగు పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలుగులో నేనూ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. రాజమౌళిగారి సినిమాలో నటించాలన్నది నా కల. అలాగే మణిరత్నంగారన్నా చాలా అభిమానం. హీరోల్లో మహేశ్‌బాబు, నాని, అడివి శేష్‌గార్లంటే ఇష్టం. నా తర్వాతి సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment