Tiragabadara Saami Movie
-
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. వచ్చే వారం థియేటర్లలోకి 'దేవర' రానుంది కాబట్టి ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో అందరూ ఓటీటీల్లో కొత్తగా ఏమొచ్చాయా అని చూస్తారు. అలా వాళ్ల కోసమా అన్నట్లు ఈ శుక్రవారం ఏకంగా 22 మూవీస్/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)ఈ వీకెండ్ ఓవరాల్‌గా 24 సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామి, పెచీ, సాలా, కాఫీ, రుస్లాన్ తదితర సినిమాలతో ద మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ కాస్తోకూస్తో కనిపిస్తున్నాయి. అయితే వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, పెచీ, రుస్లాన్ మూవీస్ మాత్రమే చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 20)నెట్ఫ్లిక్స్బ్లడ్ లెగసీ - ఇంగ్లీష్ సిరీస్హిజ్ త్రీ డాటర్స్ - ఇంగ్లీష్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 - హిందీ రియాలిటీ షో (సెప్టెంబరు 21)క్లాస్ 95: ద పవర్ ఆఫ్ బ్యూటీ - స్పానిష్ సిరీస్మోరిసన్ - థాయ్ సినిమానో మోర్ బెట్స్ - మాండరిన్ మూవీఅమెజాన్ ప్రైమ్పెచీ - తమిళ సినిమాతలైవేట్టాయామాపాళ్యం - తమిళ సిరీస్ద ట్రాజికల్లీ హిప్ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ - తెలుగు సిరీస్ద జడ్జి ఫ్రమ్ హెల్ - ఇంగ్లీష్ సిరీస్ (సెప్టెంబరు 21)ఆహామారుతీనగర్ సుబ్రమణ్యం - తెలుగు సినిమాతిరగబడరా సామీ - తెలుగు మూవీకాఫీ - తమిళ సినిమాసాలా - తమిళ మూవీజియో సినిమాద పెంగ్విన్ - ఇంగ్లీష్ సిరీస్జో తేరా హై వో మేరా హై - హిందీ మూవీరుస్లాన్ - హిందీ సినిమామనోరమ మ్యాక్స్సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ - మలయాళ సినిమాఆనందపురం డైరీస్ - మలయాళ మూవీఆపిల్ ప్లస్ టీవీలా మైసన్ - ఫ్రెంచ్ సిరీస్సన్ నెక్స్ట్సత్యభామ - తెలుగు సినిమాబుక్ మై షోషోసనా - ఇంగ్లీష్ మూవీఎమ్ఎక్స్ ప్లేయర్ఇష్క్ ఇన్ ద ఎయిర్ - హిందీ సిరీస్(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?) -
గ్లామర్ డోస్ పెంచిన ‘మన్నారా చోప్రా’ (ఫోటోలు)
-
హీరో రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ సినిమా ప్రమోషన్ (ఫొటోలు)
-
ఈ వారం థియేటర్లలో ఏకంగా 11 సినిమాలు.. కానీ ఒక్కటి కూడా!
'కల్కి' సినిమా వల్ల దాదాపు నెల రోజుల నుంచి థియేటర్ల కళకళలాడాయి. మళ్లీ ఈ స్థాయిలో వసూళ్లు రావాలంటే 'దేవర' వరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రతివారం మూడో నాలుగో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈసారి పెద్ద మూవీస్ ఏం లేదు. దీంతో చిన్నవే 11 రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? వీటిలో దేనిపై బజ్ ఉంది?(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో 'శివం భజే', 'బడ్డీ', 'తిరగబడరా సామీ', 'విరాజి', 'అలనాటి రామచంద్రుడు', 'ఉషా పరిణయం', 'యావరేజ్ స్టూడెంట్ నాని', 'లారీ' లాంటి తెలుగు సినిమాలతో పాటు 'తుఫాన్' అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు జాన్వీ కపూర్ 'ఉలాఝ్', అజయ్ దేవగణ్ 'ఔర్ మే కహా ధమ్ దా' చిత్రాలు రాబోతున్నాయి.పైన చెప్పిన వాటిలో 'శివం భజే' గురువారం అనగా ఆగస్టు 1న రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ శుక్రవారమే రాబోతున్నాయి. అయితే వీటిలో ఒక్కదానిపై కూడా పెద్దగా బజ్ లేదు. ఉన్నంతలో కాస్త అల్లు శిరీష్ 'బడ్డీ' ఏమైనా బాగుంటే కలెక్షన్స్ వచ్చే అవకాశముంటుంది. టెడ్డీ బేర్ బొమ్మతో తీసిన ఎంటర్టైనర్పై అల్లు హీరో బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈసారి హిట్ కొట్టి ఎవరు నిలబడాతారో లేదంటే అందరూ చతికిల పడతారో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
రాజ్ తరుణ్ 'తిరగబడరసామీ' విడుదల ఎప్పుడంటే..?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'తిరగబడరసామీ'. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో కాస్త జాప్యం ఏర్పడింది.'తిరగబడరసామీ' సినిమాను ఆగష్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే రాజ్ తరుణ్‌కు మాల్వీ మల్హోత్రా దగ్గరైందని లావణ్య ఆరోపించింది. దీంతో ఈ చిత్రానికి సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ప్రారంభం నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న మన్నారా చోప్రా పట్ల డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి అసభ్యంగా ప్రవర్తించారంటూ నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది. అది షూటింగ్ సమయంలో ఫోటోలు దిగుతున్నప్పుడు జరిగిందని అందులో డైరెక్టర్‌ది ఎలాంటి తప్పులేదని ఆమె ఒక వివరణ కూడా ఇచ్చింది. ఇలా తిరగబడరసామీ సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఆగష్టు 2న మూవీ టాక్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. -
రాజమౌళి సినిమాలో నటించాలన్నది నా కల: హీరోయిన్
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్. స్టడీస్ కోసం ముంబై వెళ్లి, థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను. తెలుగులో నేను నటించిన తొలి సినిమా ‘తిరగబడర సామీ’. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుంది. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని నా క్యారెక్టర్ చెబుతుంది. నేను రియల్ లైఫ్‌లో ఎమ్ఎమ్ఏ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేర్చుకున్నాను. అందుకే ఈ సినిమాలో నా పాత్రకు ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌ని ఈజీగా చేశాను. రాజ్ తరుణ్గారి పాత్ర సైలెంట్‌గా మొదలై వైలెంట్‌గా మారుతుంది. ఎందుకు అనేది సినిమాలో చూడాలి. లవ్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్... ఇలా అన్ని అంశాలు మిళితమైన ‘తిరగబడరా సామీ’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేశాను. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తెలుగు పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలుగులో నేనూ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. రాజమౌళిగారి సినిమాలో నటించాలన్నది నా కల. అలాగే మణిరత్నంగారన్నా చాలా అభిమానం. హీరోల్లో మహేశ్‌బాబు, నాని, అడివి శేష్గార్లంటే ఇష్టం. నా తర్వాతి సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.