'కల్కి' సినిమా వల్ల దాదాపు నెల రోజుల నుంచి థియేటర్ల కళకళలాడాయి. మళ్లీ ఈ స్థాయిలో వసూళ్లు రావాలంటే 'దేవర' వరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రతివారం మూడో నాలుగో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈసారి పెద్ద మూవీస్ ఏం లేదు. దీంతో చిన్నవే 11 రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? వీటిలో దేనిపై బజ్ ఉంది?
(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)
ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో 'శివం భజే', 'బడ్డీ', 'తిరగబడరా సామీ', 'విరాజి', 'అలనాటి రామచంద్రుడు', 'ఉషా పరిణయం', 'యావరేజ్ స్టూడెంట్ నాని', 'లారీ' లాంటి తెలుగు సినిమాలతో పాటు 'తుఫాన్' అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు జాన్వీ కపూర్ 'ఉలాఝ్', అజయ్ దేవగణ్ 'ఔర్ మే కహా ధమ్ దా' చిత్రాలు రాబోతున్నాయి.
పైన చెప్పిన వాటిలో 'శివం భజే' గురువారం అనగా ఆగస్టు 1న రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ శుక్రవారమే రాబోతున్నాయి. అయితే వీటిలో ఒక్కదానిపై కూడా పెద్దగా బజ్ లేదు. ఉన్నంతలో కాస్త అల్లు శిరీష్ 'బడ్డీ' ఏమైనా బాగుంటే కలెక్షన్స్ వచ్చే అవకాశముంటుంది. టెడ్డీ బేర్ బొమ్మతో తీసిన ఎంటర్‌టైనర్‌పై అల్లు హీరో బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈసారి హిట్ కొట్టి ఎవరు నిలబడాతారో లేదంటే అందరూ చతికిల పడతారో చూడాలి?
(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)
Comments
Please login to add a commentAdd a comment