'దేవర' థియేటర్లలో.. జాన్వీ మరో సినిమా ఓటీటీలో | Janhvi Kapoor's Ulajh Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor Ulajh: సడన్‌గా ఓటీటీలోకి జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ

Sep 27 2024 10:43 AM | Updated on Sep 28 2024 12:32 PM

Janhvi Kapoor's Ulajh Movie OTT Streaming Details

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో ఇప్పటికే పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా బ్రేక్ రాలేదు. 'దేవర'తో తెలుగులోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇదే టైంలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసిన హిందీ మూవీ ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)

హిందీలో జాన్వీ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఉలాజ్'. మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో జాన్వీ.. డిప్యూటీ హై కమీషనర్ పాత్ర చేసింది. ఈమెతో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ మథ్యూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిందీలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ థ్రిల్ చేస్తాయి.

'ఉలాజ్' విషయానికొస్తే ఖాట్మాండులో ఉండే సుహానా భాటియా (జాన్వీ కపూర్) ఓ కుర్రాడిని ప్రేమిస్తుంది. కానీ అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. కొన్నాళ్లకు లండన్‌లో భారత హై కమిషనర్‌గా ఉద్యోగం తెచ్చుకుంటుంది. కానీ ప్రతి చిన్న విషయానికి తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటూ ఉంటుంది. ఇలాంటి ఈమె జీవితంలోకి నకుల్ అనే యువకుడు వస్తాడు. దీంతో చాలా మార్పులు జరుగుతాయి. వాటి వల్ల సుహానా సమస్యల్లో పడుతుంది. వీటి నుంచి ఎలా బయటపడిందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement