Ulajh Movie
-
OTT: ఉలిక్కిపాటుకు గురి చేసే ‘ఉలజ్’
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘ఉలజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.జెండా పండగనాడు లేదా స్వాతంత్య్ర సమరయోధుడి పుట్టినరోజు నాడు... ఇలా కొన్ని రోజులప్పుడు మనలో చాలామంది దేశం గురించి ఆలోచిస్తాం. కానీ పడుకున్నా, లేచినా, తిన్నా, తినకపోయినా అనుక్షణం మన దేశం గురించి నిరంతరం తపన పడుతుంటారు కొందరు. వాళ్లలో కొంతమందివి వైట్ కాలర్ జాబ్స్ అయితే మరికొందరివి అనామకపాత్రలు. వాళ్లు చేసే ఉద్యోగం ఏదైనా దేశం కోసం ఏ క్షణమైనా ప్రాణాలివ్వడానికైనా, తీయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అటువంటి ఓ వైట్ కాలర్ జాబ్ హోల్డర్ కథాంశంతో దర్శకుడు సుధాంశు సారియా ‘ఉలజ్’ సినిమా తీశారు.ఇది థ్రిల్లర్ జోనర్ సినిమా. ‘ఉలజ్’ కథాంశానికొస్తే... దేశ భక్తుల కుటుంబం నుండి వచ్చిన సుహానా భాటియా హై క్వాలిఫైడ్ పర్సన్. లండన్‌లోని అత్యుత్తమ పదవి అయిన భారతీయ రాయబారిగా నియమించబడుతుంది సుహానా. అనుకోని చిక్కుల వల్ల సుహానా భారతదేశానికి సంబంధించి కొన్ని వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడుతుంది. ఓ రకంగా దేశద్రోహ చర్యలు చేపడుతుంది. తరువాత తనే ఆ సమస్యలను పరిష్కరించి దేశానికి ఎటువంటి ప్రమాదం రాకుండా, అలాగే తన తండ్రి పరువు ప్రతిష్టలను ఎలా నిలబెడుతుంది? అనేది మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఉలజ్’ సినిమాలో చూడాలి.ఈ సినిమాలో ప్రధానపాత్ర అయిన సుహానాపాత్రలో జాన్వీ కపూర్ నటించారు. సుహానాపాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారనే చె΄్పాలి. అలాగే నకుల్ భాటియాపాత్రలో గుల్షన్ దేవయ్య కూడా రక్తి కట్టించారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టకుండా టైట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకుడు. ఓ పక్క సినిమా లైన్ పట్టు తప్పకుండా మరో పక్క దేశం పట్ల మన కనీస బాధ్యత అన్న సందేశాన్ని చక్కగా చె΄్పారు దర్శకుడు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియ¯Œ ్సకి ఇదో అద్భుతమైన సినిమా. – ఇంటూరి హరికృష్ణ -
'దేవర' థియేటర్లలో.. జాన్వీ మరో సినిమా ఓటీటీలో
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో ఇప్పటికే పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా బ్రేక్ రాలేదు. 'దేవర'తో తెలుగులోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇదే టైంలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసిన హిందీ మూవీ ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)హిందీలో జాన్వీ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఉలాజ్'. మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో జాన్వీ.. డిప్యూటీ హై కమీషనర్ పాత్ర చేసింది. ఈమెతో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ మథ్యూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిందీలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ థ్రిల్ చేస్తాయి.'ఉలాజ్' విషయానికొస్తే ఖాట్మాండులో ఉండే సుహానా భాటియా (జాన్వీ కపూర్) ఓ కుర్రాడిని ప్రేమిస్తుంది. కానీ అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. కొన్నాళ్లకు లండన్‌లో భారత హై కమిషనర్‌గా ఉద్యోగం తెచ్చుకుంటుంది. కానీ ప్రతి చిన్న విషయానికి తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటూ ఉంటుంది. ఇలాంటి ఈమె జీవితంలోకి నకుల్ అనే యువకుడు వస్తాడు. దీంతో చాలా మార్పులు జరుగుతాయి. వాటి వల్ల సుహానా సమస్యల్లో పడుతుంది. వీటి నుంచి ఎలా బయటపడిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ) -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'దేవర' రిలీజ్ అయింది. టాక్ అదిరిపోయిందని అంటున్నారు. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తెలుగు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు 'దేవర' చూడటం కుదరకపోతే ఓటీటీలో ఈ మూవీస్ చూసేయండి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ విషయానికొస్తే డీమోంటీ కాలనీ 2, ప్రతినిధి 2 అనే తెలుగు సినిమాలు ఉండగా ఉలాఝ్, లవ్ సితార అనే హిందీ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాదన్నట్లు ఇప్పటికే సరిపోదా శనివారం, స్త్రీ 2 స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే సినిమాలు తాజాగా రిలీజ్ అయ్యాయనేది చూద్దాం.శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 27)నెట్ఫ్లిక్స్డూ యూ సీ వాట్ ఏ సీ - ఇండోనేసియన్ మూవీగ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 - కొరియన్ సిరీస్రెజ్ బాల్ - ఇంగ్లీష్ సినిమావిల్ & హార్పర్ - ఇంగ్లీష్ మూవీఉలాఝ్ - హిందీ సినిమాసరిపోదా శనివారం - తెలుగు మూవీహాట్స్టార్డాక్టర్ ఒడిస్సీ - ఇంగ్లీష్ సిరీస్గ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్9-1-1 లోన్ స్టార్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్అయిలా & ద మిర్రర్స్ - స్పానిష్ సిరీస్తాజా ఖబర్ సీజన్ 2 - హిందీ సిరీస్జీ5డీమోంటీ కాలనీ 2 - తెలుగు సినిమాలవ్ సితార - హిందీ మూవీజియో సినిమాహానీమూన్ ఫొటోగ్రాఫర్ - హిందీ సిరీస్అమెజాన్ ప్రైమ్ఔరోన్ మైన్ దమ్ థా - హిందీ సినిమాకొట్టుక్కళి - తమిళ మూవీఓటీ 2023 ద అవర్ - స్పానిష్ చిత్రంప్రీవియస్లీ సేవ్డ్ వెర్షన్ - జపనీస్ మూవీస్త్రీ 2 - హిందీ సినిమామనోరమభరతనాట్యం - మలయాళ మూవీఆహాప్రతినిధి 2 - తెలుగు సినిమాఆపిల్ ప్లస్ టీవీఊల్ఫ్స్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్) -
ఈ వారం థియేటర్లలో ఏకంగా 11 సినిమాలు.. కానీ ఒక్కటి కూడా!
'కల్కి' సినిమా వల్ల దాదాపు నెల రోజుల నుంచి థియేటర్ల కళకళలాడాయి. మళ్లీ ఈ స్థాయిలో వసూళ్లు రావాలంటే 'దేవర' వరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రతివారం మూడో నాలుగో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈసారి పెద్ద మూవీస్ ఏం లేదు. దీంతో చిన్నవే 11 రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? వీటిలో దేనిపై బజ్ ఉంది?(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో 'శివం భజే', 'బడ్డీ', 'తిరగబడరా సామీ', 'విరాజి', 'అలనాటి రామచంద్రుడు', 'ఉషా పరిణయం', 'యావరేజ్ స్టూడెంట్ నాని', 'లారీ' లాంటి తెలుగు సినిమాలతో పాటు 'తుఫాన్' అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు జాన్వీ కపూర్ 'ఉలాఝ్', అజయ్ దేవగణ్ 'ఔర్ మే కహా ధమ్ దా' చిత్రాలు రాబోతున్నాయి.పైన చెప్పిన వాటిలో 'శివం భజే' గురువారం అనగా ఆగస్టు 1న రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ శుక్రవారమే రాబోతున్నాయి. అయితే వీటిలో ఒక్కదానిపై కూడా పెద్దగా బజ్ లేదు. ఉన్నంతలో కాస్త అల్లు శిరీష్ 'బడ్డీ' ఏమైనా బాగుంటే కలెక్షన్స్ వచ్చే అవకాశముంటుంది. టెడ్డీ బేర్ బొమ్మతో తీసిన ఎంటర్టైనర్పై అల్లు హీరో బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈసారి హిట్ కొట్టి ఎవరు నిలబడాతారో లేదంటే అందరూ చతికిల పడతారో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: సహ నటుడు
సాధారణంగా సినిమా యాక్టర్స్ చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొన్నిసార్లు చాలా సాధారణంగా మాట్లాడినా సరే దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య.. హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అవి కాస్త వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి సదరు నటుడు మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)జాన్వీ కపూర్‌తో కలిసి నటించాను గానీ తనకు వైబ్ రాలేదని గుల్షన్ దేవయ్య అన్నాడు. దీనిపై జాన్వీ కూడా స్పందిస్తూ.. అవును అతడు చెప్పింది నిజమేనని, షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక్కసారి కూడా కలిసి కూర్చోలేదని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో గుల్షన్ ఏదో తప్పు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో తన మాటలపై క్లారిటీ ఇచ్చాడు.'జాన్వీ కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదని చెప్పానంతే. అది మా తప్పు కాదు. జాన్వీ మంచి యాక్టర్. చాలా ప్రొఫెషనల్. సినిమాలో మా సీన్స్ బాగా వచ్చాయ్. ప్రతి సినిమా సెట్లోనూ టీమ్ అంతా కలిసిపోవాలనేం లేదు కదా! నేను ఎవరినీ తక్కువ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడలేదు. మూవీ కోసం 100 శాతం పనిచేశాం. గతంలో నేను చాలామంది హీరోయిన్లతో కలిసి నటించాను. వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి యాక్ట్ చేయడం మర్చిపోలేను. మేం ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం. జాన్వీతో మాత్రం సినిమా గురించే డిస్కషన్ జరిగింది. అదే రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పా' అని గుల్షన్ దేవయ్య క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
ప్రతి ముఖం ఓ కథ చెబుతుందంటున్న జాన్వీ కపూర్!
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) విభాగంలో ఆఫీసర్‌గా ఉద్యోగం చేసి ఓ కుట్రను గురించి కాన్ఫిడెన్షియల్ ఫైల్‌ను రెడీ చేశారు జాన్వీ కపూర్. మరి... ఈ ఫైల్లో ఉన్న వివరాలు ఏంటి? నిజమైన కుట్రదారులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం ‘ఉలజ్’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలోనే జాన్వీ కపూర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సుధాంశు సరియ దర్శకత్వం వహించారు. ముందు ‘ఉలజ్’ను జూలై 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ కాలేదు. దీంతో ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త ఫోటోలను విడుదల చేసింది యూనిట్. ‘‘ప్రతి ముఖం ఓ కథ చెబుతుంది. ప్రతి కథ ఓ ఉచ్చులాంటిదే’’ అని ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు జాన్వీ కపూర్. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్ ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్నారు జాన్వీ కపూర్. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)