ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘ఉలజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
జెండా పండగనాడు లేదా స్వాతంత్య్ర సమరయోధుడి పుట్టినరోజు నాడు... ఇలా కొన్ని రోజులప్పుడు మనలో చాలామంది దేశం గురించి ఆలోచిస్తాం. కానీ పడుకున్నా, లేచినా, తిన్నా, తినకపోయినా అనుక్షణం మన దేశం గురించి నిరంతరం తపన పడుతుంటారు కొందరు. వాళ్లలో కొంతమందివి వైట్ కాలర్ జాబ్స్ అయితే మరికొందరివి అనామకపాత్రలు. వాళ్లు చేసే ఉద్యోగం ఏదైనా దేశం కోసం ఏ క్షణమైనా ప్రాణాలివ్వడానికైనా, తీయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అటువంటి ఓ వైట్ కాలర్ జాబ్ హోల్డర్ కథాంశంతో దర్శకుడు సుధాంశు సారియా ‘ఉలజ్’ సినిమా తీశారు.
ఇది థ్రిల్లర్ జోనర్ సినిమా. ‘ఉలజ్’ కథాంశానికొస్తే... దేశ భక్తుల కుటుంబం నుండి వచ్చిన సుహానా భాటియా హై క్వాలిఫైడ్ పర్సన్. లండన్‌లోని అత్యుత్తమ పదవి అయిన భారతీయ రాయబారిగా నియమించబడుతుంది సుహానా. అనుకోని చిక్కుల వల్ల సుహానా భారతదేశానికి సంబంధించి కొన్ని వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడుతుంది. ఓ రకంగా దేశద్రోహ చర్యలు చేపడుతుంది. తరువాత తనే ఆ సమస్యలను పరిష్కరించి దేశానికి ఎటువంటి ప్రమాదం రాకుండా, అలాగే తన తండ్రి పరువు ప్రతిష్టలను ఎలా నిలబెడుతుంది? అనేది మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఉలజ్’ సినిమాలో చూడాలి.
ఈ సినిమాలో ప్రధానపాత్ర అయిన సుహానాపాత్రలో జాన్వీ కపూర్ నటించారు. సుహానాపాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారనే చె΄్పాలి. అలాగే నకుల్ భాటియాపాత్రలో గుల్షన్ దేవయ్య కూడా రక్తి కట్టించారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టకుండా టైట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకుడు. ఓ పక్క సినిమా లైన్ పట్టు తప్పకుండా మరో పక్క దేశం పట్ల మన కనీస బాధ్యత అన్న సందేశాన్ని చక్కగా చె΄్పారు దర్శకుడు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియ¯Œ ్సకి ఇదో అద్భుతమైన సినిమా. – ఇంటూరి హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment