ఇమేజ్ టవర్ల ఫస్ట్ లుక్ విడుదల | Minister KTR unveils first look of IMAGE towers | Sakshi
Sakshi News home page

ఇమేజ్ టవర్ల ఫస్ట్ లుక్ విడుదల

Published Fri, Nov 11 2016 2:20 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఇమేజ్ టవర్ల ఫస్ట్ లుక్ విడుదల - Sakshi

ఇమేజ్ టవర్ల ఫస్ట్ లుక్ విడుదల

త్వరలో హైదరాబాద్‌లో నిర్మించబోయే 'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్‌ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న నాస్‌కామ్‌ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ నమూనాను ఆవిష్కరించారు. సరికొత్త, అత్యాధునిక డిజైన్‌లో ఈ టవర్లను నిర్మించడానికి తలపెట్టినట్లు తెలుస్తోంది. 
 
ఇందులో ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్ ఇన్న మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని కేటీఆర్ ఒక ట్వీట్‌లో వివరించారు. నాలుగు వైపులా నాలుగు టవర్లతో పాటు.. పై భాగంలో వాటన్నింటినీ కలుపుతూ ఈ నిర్మాణం కనిపిస్తోంది. టవర్ల మధ్యభాగంలో కూడా పెద్ద పరిమాణంలో ఉండే టీవీ స్క్రీన్లు సైతం మోడల్‌లో కనిపిస్తున్నాయి. కింది భాగంలో రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా డిజైన్‌లో భాగంగా ఉన్నాయి. ప్రధానంగా మల్టీమీడియా, గేమింగ్ పరిశ్రమను దృష్టిలో పెట్టకుని ఈ టవర్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement