
సాక్షి, సినిమా : కోలీవుడ్‌లో గత రెండు రోజులుగా సీతకత్తి చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ గురించే హాట్ డిస్కషన్ జరుగుతోంది. వృద్ధుడి గెటప్‌లో ఉన్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి లుక్కును చూసి యావత్ ఇండస్ట్రీనే షాక్ తింది. అసలు అందులో ఉంది విజయ్ ఏనా? అన్న అనుమానాలు చాలా మందికి కలిగాయి.
భారతీయుడులో కమల్(ముసలి పాత్ర), ఒకే ఒక్కడులో రఘువరన్ గెటప్ తరహాలో ఉన్న వేషం చాలా ఆకట్టుకుంది. ఇక వరుస చిత్రాలు.. హిట్లతో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్ సేతుపతి 25వ చిత్రంగా సీతకత్తి తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బాలాజీ తరణీతరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో చిత్రం కావటం విశేషం. ఈ చిత్రంలో అయ్యా అనే థియేటర్ ఆర్టిస్ట్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడు. అర్చనా, గాయత్రి, పార్వతి నాయర్, రమ్య నంబీసన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
విజయ్ కష్టానికి హ్యాట్సాఫ్.. డైరెక్టర్ బాలాజీ
తన వయసుకు మించిన పాత్రకు అంగీకరించటమే కాదు.. అందుకోసం విజయ్ బాగానే కష్టపడుతున్నాడు. వృద్ధుడి గెటప్ కోసం సుమారు నాలుగు గంటలపాటు కదలకుండా కూర్చోవాల్సి ఉంటుంది. అలెక్స్ నోబెల్, కెవిన్ మనే అనే మేకప్ మెన్‌ల ఆధ్వర్యంలో విజయ్ ఈ లుక్కు కోసం చాలా శ్రమించాడని దర్శకుడు బాలాజీ చెబుతున్నాడు. ఈ ఏడాది చివర్లోనే సీతకత్తి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే విజయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఒరు నల్ల నాళ్ పార్తు సొల్‌రేన్ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఇందులో గౌతమ్ కార్తీక్, మెగా డాటర్ నిహారిక జంటగా నటిస్తున్నారు. మరోవైపు డాన్ పాత్రలో నటిస్తున్న ‘జుంగా’ సమ్మర్‌లోనే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment