డీజే... ఓన్లీ వెజ్జే! | Allu Arjun looks 'traditionally cool' | Sakshi
Sakshi News home page

డీజే... ఓన్లీ వెజ్జే!

Published Sat, Feb 18 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

డీజే... ఓన్లీ వెజ్జే!

డీజే... ఓన్లీ వెజ్జే!

మనకు డీజేలు ఎక్కడ కనిపిస్తారు? పబ్బుల్లోనే కదా. అయితే... ఈ డీజే మాత్రం డిఫరెంట్‌ అండోయ్‌! పబ్బుల్లో కాదు, విజయవాడలో బజాజ్‌ స్కూటర్‌పై కూరగాయలు తీసుకువెళుతూ కనిపిస్తాడు. ఎందుకంటే... ఈ డీజే పని చేసేది పబ్బులో కాదు, అన్నపూర్ణ కేటరింగ్సులో. విజయవాడలోని సత్యనారాయణ అగ్రహారంలో గల అన్నపూర్ణ కేటరింగ్సు ప్యూర్‌ వెజిటేరియన్‌. కేటరింగ్సుతో పాటు ఈ కుర్రాడు ఇంకేం చేస్తాడో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేవరకూ వెయిట్‌ చేయమంటున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్‌లో ఆయన దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న సినిమా ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్‌’.

శనివారం అల్లు అర్జున్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. మహాశివరాత్రికి టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘మా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అందుకుంటుంది. అంచనాలను మించేలా ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం కర్ణాటకలో చిత్రీకరణ జరుగుతోంది. కర్ణాటక షెడ్యూల్‌ తర్వాత అబుదాబి వెళతాం’’ అన్నారు. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రామ్‌–లక్ష్మణ్, కెమేరా: ఐనాక బోస్, కూర్పు: ఛోటా కె.ప్రసాద్, కళ: రవీందర్, స్క్రీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి – దీపక్‌రాజ్, సంగీతం; దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement