జగన్నాథమ్‌ పెళ్లి కుదిరింది! | Dj Duvvada Jagannatham will be released on 23rd of this month. | Sakshi
Sakshi News home page

జగన్నాథమ్‌ పెళ్లి కుదిరింది!

Published Fri, Jun 16 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

జగన్నాథమ్‌ పెళ్లి కుదిరింది!

జగన్నాథమ్‌ పెళ్లి కుదిరింది!

దువ్వాడ జగన్నాథమ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌ది విజయవాడ లోని సత్యనారాయణపురం అగ్రహారం! ప్యూర్‌ వెజ్‌ అన్నపూర్ణ క్యాటరింగ్సు నడుపుతుంటాడు. అతను ఫ్యాషన్‌ డిజైనర్‌ అలియాస్‌ పూజా హెగ్డేను చూసి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ పెళ్లి పీటలు దాకా వచ్చే వరకు వీళ్లిద్దరి మధ్య ట్రాక్‌ రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ అనేలా ఉంటుందట! ఈ క్రమంలో ‘వెన్నెల’ కిశోర్‌ చేసే హంగామా, అల్లు అర్జున్‌ చేసే హడావిడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట.

ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన ‘అస్మైక యోగ..’ పాట... పెళ్లి కుదిరిన తర్వాత తన ప్రేయసి, కాబోయే భార్యను జగన్నాథమ్‌ ఊహించు కుంటున్నప్పుడు వస్తుంది. యాక్షన్, కామెడీలతో పాటు ఈ ‘డీజే దువ్వాడ జగన్నాథమ్‌’లో రొమాన్స్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందట! నిన్నటితో ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్‌ వర్క్స్‌ పూరయ్యాయి. చివరగా ఓ సాంగులో కరెక్షన్స్‌ చేశారు. ఆ వెంటనే సెన్సార్‌ కంప్లీట్‌ చేశారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement