duvvada jagannatham
-
లీకుతే పీకుతా
ఇండస్ట్రీకి కోపం రాదా మరి! కాస్త అటూ ఇటుగా వంద కోట్లు. అదీ సినిమా స్పెండింగ్. మన వంద రూపాయలు ఎవరైనా కొట్టేస్తేనే... కడుపు రగిలిపోతుంది. పిచ్చి పిచ్చిగా కోపం వచ్చేస్తుంది. కండలు, బండలు లేకపోయినా దొంగను పట్టుకుని ఒకటి పీకాలనిపిస్తుంది. మరి వంద కోట్ల సినిమా లీక్ అయితే.. పీకాలనిపించదా?! రీసెంట్గా లీకైన రెండు సినిమాలు : ‘డీజే’ని ఏకంగా ఫేస్బుక్లో పెట్టారు. ‘జై లవ కుశ’ రఫ్ టీజర్‌ని యూట్యూబ్‌లో ఎక్స్పోజ్ చేశారు. డీజేలో సినిమా బయట పడితే, జై లవ కుశలో క్యారెక్టర్ బయటపడింది. ముక్కలు లీక్ అవడం మామూలే. మొత్తం మూవీనే లీకయితే?! నిర్మాత గుండె 24 ముక్కలౌతుంది. కోట్ల డబ్బు మరి! కష్టం మాత్రం.. తక్కువా?! తేడా వస్తే.. కృష్ణా నగరే మామ.. కృష్ణా నగరే... సీన్ మళ్లీ మొదటికొస్తుంది! డీజే! దువ్వాడ జగన్నాథం. గన్ పెట్టి పేల్చేస్తుంటాడు కొడుకుల్ని. మనిషి కనిపించడు. వాడు చేసే పని మాత్రమే కనిపిస్తుంది. అమ్మాయిల్ని ఏడిపిస్తే టైర్‌పంక్చర్ అవుతుంది. అగ్రో డైమండ్ రొయ్యల నాయుడి బంపర్ బద్దలౌతుంది. పైకి జంధ్యం జగన్నాథం. లోపల జగమెరిగిన జగన్నాథం. స్లోగా పికప్ అయి, ఫాస్ట్‌గా టికెట్లు కోసేస్తున్నాడు. పిక్చర్హిట్. అంతలోనే ఉపద్రవం! డీజే శుక్రవారం రిలీజ్ అయింది. మళ్లీ శుక్రవారంలోపు ఫేస్బుక్లో రీ–రిలీజ్ అయింది. ఫేస్బుక్లో రిలీజ్ అవడం ఏంటి? ‘లీక్’ కదా అవుతుంది! చిన్నముక్కయితే లీక్ అనొచ్చు. మొత్తం సినిమానే లీక్ అయితే.. అదీ రిలీజే! పట్టుకోవాలి. ఎవడు ‘రిలీజ్’ చేశాడో పట్టుకోవాలి. అవుతుందా? అంత ఈజీ ఏం కాదు. పదిమంది డీజేలు కావాలి. ‘దిల్’ రాజుకు అంతమంది డీజేలు ఎక్కడ దొరుకుతారు? పోలీసులకు కంప్లైంట్ చేశాడు. హంట్ మొదలైంది. స్మార్ట్ పోలీసులు చాలా ఫాస్ట్‌గా కేసును డీల్ చేస్తున్నారు. దొంగ దొరికితే ఏమౌతుంది? శిక్ష పడుతుంది. తర్వాత? బెయిల్ దొరుకుతుంది. తర్వాత? ఇంకో సినిమా లీక్ అవుతుంది. సినిమాలు తియ్యాలా? సర్దుకుని వెళ్లిపోవాలా? ఈ లీకుల వెర్రి ఏంటి? ఒకడెవడో చేసే మతిమాలిన పనికి ఇండస్త్రీకి బతుకే లేకుండా పోతుందే! సాయంత్రం ఎనిమిది గంటలు. సాక్షి కార్యాలయంలో సినిమా డెస్క్ బిజీగా ఉంది. ‘ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ’ స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ కోసం విదేశాల్లో ఉన్న పృథ్వీరాజ్‌తో మాట్లాడుతున్నారు సినిమా పేజ్ ఇన్చార్జి డి.జి.భవాని.అర్జెంట్‌గా దిల్ రాజుతో మాట్లాడాలి! దిల్ రాజు ఒక్కరే కాదు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో మాట్లాడాలి. కల్యాణ్‌రామ్‌తో మాట్లాడాలి. శోభుతో మాట్లాడాలి. పైరసీల దెబ్బల్ని, లీకుల తాకిడిని తట్టుకుని నిలబడిన వాళ్లలో ఈ నలుగురూ మెయిన్. సాక్షి ఫోటో జర్నలిస్ట్ శివ మల్లాల రంగంలోకి దిగారు. ‘‘శివా.. చెక్–ఇన్‌లో ఉన్నా. నేనే చేస్తా’’ అన్నారు దిల్ రాజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. దిల్ రాజు యు.ఎస్. వెళ్తున్నారు. శోభు దొరకడం కష్టం. ఆయన మాస్కోలో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు. రఫ్ స్కెచ్ కూడా లీకైంది! జై లవ కుశ.హీరో జూనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ బాబీ (కె.ఎస్.రవీంద్ర). డబ్బులు పెడుతోంది నందమూరి కల్యాణ్ రామ్. పిక్చర్ ఇంకా పూర్తవలేదు. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకున్నారు. టీజర్‌ని జూలై మొదటి వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంతలోనే టీజర్ లీకై పోయింది. టీజర్ కూడా సినిమాలాగే డిఫరెంట్‌గా ఉండబోతోందని కల్యాణ్ ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. అయితే టీజర్ ఏమీ డిఫరెంట్‌గా లేదు. ఎందుకు లేదంటే.. అది రఫ్ కాపీ. కల్యాణ్ రామ్ షాక్ తిన్నాడు. సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అప్పటికే నష్టం జరిగిపోయింది. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వేస్తున్న క్యారెక్టర్లలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటో బయట పడిపోయింది. ‘భయ్యా.. ఇలా ఎలా జరిగింది?’ అడిగారు శివ. ఎలా జరిగిందో కల్యాణ్ చెప్పారు. ఇంటి దొంగే లీక్ చేసేశాడు! ప్రొడక్షన్లో పై నుంచి బాయ్ వరకు అందర్నీ ఫ్యామిలీ మెంబర్‌లానే ట్రీట్ చేస్తాడు ఏ నిర్మాతైనా. ఆ నమ్మకంతోనే ఇంట్లో చోరీ జరిగిపోతుంది. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.. డీజే, జై లవ కుశ. సినిమాలపై నడవాల్సిన టాక్.. సినిమాల లీకులపై నడుస్తోంది! ‘వెధవలు’ అన్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్... లీకులు చేసేవాళ్లను. కూర్చున్న కొమ్మను నరుక్కునేవాళ్లు వెధవలు కాక మరేమిటి? సినిమా రిలీజ్ అయ్యాక లీక్ అయితే కలెక్షన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. సినిమా రిలీజ్ కాకముందే లీక్ అయితే ప్రేక్షకుల ఆసక్తి పలచబడిపోయే అవకాశం ఉంది. రెండూ నిర్మాతలకు నష్టమే. ‘బాహుబలి 2’ చివరి యుద్ధ సన్నివేశాలు కొన్ని లీక్ అయ్యాక దర్శక నిర్మాతలకు నిద్రపట్టడం మానేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే మిస్టరీపై ప్రేక్షకులకు ఉన్న ఉత్కంఠ కన్నా, ‘బాహుబలి – ది కంక్లూజన్’లో ఫైటింగ్ సీన్లు ఎలా లీక్ అయ్యాయనే మిస్టరీనే రాజమౌళి అండ్ టీమ్‌కి కంట కునుకు లేకుండా చేసింది. కష్టాన్ని కొల్లగొడితే ఎవరికైనా కడుపు మండుతుంది. కడుపు కొట్టడమూ కష్టాన్ని కొల్లగొట్టడమూ రెండూ ఒకటే. సినిమా నిర్మాణంలో పడే కష్టం మామూలుగా ఉండదు. ప్రతి ఫ్రేమ్‌లోనూ కష్టం ఉంటుంది. ఇరవైనాలుగు ఫ్రేమ్‌లలో ఇరవై నాలుగు కష్టాలు కలిస్తేనే ఒక సినిమా. ‘హింసించే రాజు 23వ పులకేసి’లా ఇప్పుడు.. సినిమా వాళ్లకు కొత్తగా యాడ్ అయిన 25వ కష్టం.. లీకేజ్. లీకేజ్‌తో కలుపుకొని సినిమాకు ఇప్పుడు కొత్త నిర్వచనం.. 25 ఫ్రేమ్స్! చిన్న లీక్.. పెద్ద సెలబ్రేషన్! సోషల్ మీడియాలో ఒక వర్గం రాత్రీపగలూ మేల్కొనే ఉంటుంది. దానికి పనీపాట ఉండదు. ఒక ప్రాజెక్టు ఉండదు. ఎప్పుడూ ఎగై్జట్‌మెంట్ కోసం చూస్తుంటుంది. చిన్న లీక్ దొరికినా చాలు సెలబ్రేట్ చేసుకుంటుంది. భారీ బడ్జెట్‌తో, భారీ స్టారింగ్‌తో తయారయ్యే సినిమాలను లీక్ చేస్తే అదొక భారీ అచీవ్మెంట్! ఒక లీకు.. ఐదు రూమర్లు తొలిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన అతి భారీ లీక్.. అత్తారింటికి దారేది! 2013లో పిక్చర్ రిలీజ్ అవడానికి నెల ముందే యూట్యూబ్‌కి ఎక్కేసింది! పవన్ కల్యాణ్ స్టార్ హీరో. త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్టార్ డైరెక్టర్. ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండే కాంబినేషన్. సినిమాలోని ప్రతి పార్టూ లీకైంది! యూనిట్ సభ్యులకు చూపించలేదు. ప్రివ్యూ వేయలేదు. మరి ఎలా లీకైనట్లు? అత్తారింటికి దారైతే తెలిసింది కానీ, డిజిటల్ దొంగల్ని పట్టుకునే దారే దొరకలేదు. ఎవరు లీక్ చేసి ఉంటారనే దానిపై రూమర్లు బయల్దేరాయి. అందుకు కారణం పవన్ కల్యాణ్! రూమర్ నెం.1 లీకేజ్‌పై పీకే (పవన్ కల్యాణ్) అయితే చాలా ఎమోషల్ అయ్యారు. ‘ఇది పైరసీ కాదు, కాన్స్పిరసీ’ అన్నారు. ‘నేను 365 రోజులూ నా సినిమానే ఆడాలని అనుకోను. కానీ అందరూ అలా లేరు’ అన్నాడు. ఎవరా ‘అందరూ’ అని ఇండస్ట్రీ లోపల, బయట అప్పట్లో పెద్ద పరిశోధన. పవన్ అంటున్న కాన్స్పిరసీ వెనుక నిర్మాత దిల్ రాజు ఉన్నాడని పవన్ అభిమానులు అనుమానించారు. అత్తారింటికి దారేది చిత్రానికి నైజామ్ హక్కుల్ని దిల్ రాజుకు ఇవ్వకుండా హీరో నితిన్ తండ్రికి ఇచ్చినందుకే దిల్ రాజు అలా రివెంజ్ తీర్చుకుని ఉంటాడని వాళ్ల ఎనాలిసిస్. దిల్ రాజు నవ్వేసి ఊరుకున్నారు. రూమర్ నెం.2‘కంచే చేను మేసినట్టు’ అని పీకే ఇంకోమాట కూడా అన్నారు! అంతే, కొన్ని చూపుడువేళ్లు పీకే కుటుంబ సభ్యులవైపు మళ్లాయి. రామ్ చరణ్ అండ్ టీమ్.. లీక్ చేసి ఉండొచ్చని కొందరు అనుమానించారు. రామ్‌చరణ్ నటించిన ‘తుఫాన్’ చిత్రం రిలీజ్ సమయంలో.. ఒకదానికొకటి అడ్డుపడకుండా ఏ పిక్చర్‌ని ముందు రిలీజ్ చెయ్యాలనే విషయంపై తుఫాన్ టీమ్‌కి, అత్తారింటికి దారేది టీమ్‌కి మధ్య జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. దాంతో రామ్‌చరణ్ గ్రూపు పీకే మూవీని లీక్ చేయించిందని ఒక విశ్లేషణ! అబ్బాయ్.. బాబాయి నవ్వుకుని ఊరుకున్నారు. రూమర్ నెం.3 పీకే నోట్లోంచి కాన్స్పిరసీ (కుట్ర) అనే మాట రాగానే జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఓ లుక్కు పడింది. ‘రామయ్యా వస్తావయ్యా’కి అత్తారింటికి దారేది గట్టి పోటీ ఇస్తుందన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్, అత్తారింటికి దారేది నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఆఫీస్‌లో పని చేసే ఓ కుర్రాడికి డబ్బాశ చూపించి సీడీని బయటికి తెప్పించి లీక్ చేయించాడని ఓ అనుమానం. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ తవ్వకాలకు నవ్వుకుని ఊరుకున్నారు. అత్తారింటికి దారేది లీకేజ్‌లో చివరికి తేలిందేమిటంటే.. అరుణ్ కుమార్ అనే ప్రొడక్షన్ అసిస్టెంట్ ఎడిటింగ్ రూమ్‌లో మూవీని కాపీ చేసుకుని తన కాన్స్టేబుల్ ఫ్రెండ్‌కి ఇచ్చాడనీ, అలా ఆ సినిమా లీక్ అయిందనీ! అయ్యో పాపం..! ‘అత్తారింటికి దారేది’కి ముందు.. ‘ఎవడు’ (రామ్ చరణ్ హీరో) షూటింగ్ జరుగుతుండగానే మూవీలోని ఐటమ్ సాంగ్.. ‘అయ్యో పాపం...’ లీక్ అయింది. అది హిట్ సాంగ్. దానివల్ల నష్టం కన్నా పబ్లిసిటీనే ఎక్కువగా వచ్చింది. లేటెస్టుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘జై లవ కుశ’ టీజర్ లీక్ కావడంపై అయ్యో పాపం అనాల్సి వస్తోంది. పబ్లిసిటీ కన్నా నష్టమే ఇక్కడ ఎక్కువగా జరిగింది. ఎన్టీఆర్లోని విలనిజాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్న టీజర్లో ‘ఫినెస్’ (స్కిల్) లోపించింది. సినిమాను ఏదో హడావుడిగా తోసేయబోతున్నారనే అభిప్రాయానికి తావిచ్చేలా ఏమాత్రం క్వాలిటీ లేకుండా ఉంది. రఫ్ అలానే ఉంటుందని ఫాన్స్‌కు తెలియదా? పది కాలాలు నిలవాలి అంత డబ్బు పెట్టి ఒక నిర్మాత, అంత క్రియేటివిటీ తో ఒక దర్శకుడు, అంత యాక్షన్ చేసి ఒక హీరో.. సినిమాను తీసినప్పుడు.. ఆ కష్టం అంతా ఒక్క లీకేజీకి.. కొట్టుకుపోవడం ఎంత అన్యాయం? ఈ అన్యాయాన్ని సినిమా తీసినవాళ్లే కాదు, చూసే మనం కూడా ప్రశ్నిం చాలి. అప్పుడే పది కాలాల పాటు వాళ్లు మనకు పద్నా లుగు రీళ్ల వినోదాన్ని అందించగలరు. చచ్చిబతికినట్టు ఉంటుంది – బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రముఖ నిర్మాత ‘అత్తారింటికి దారేది’ లీక్ అయినప్పుడు చచ్చిబతికినట్టయింది! హీరో, డైరెక్టర్ సపోర్ట్ ఉండబట్టి గట్టెక్కాం. ఇందులో పని చేసే కొందరు వెధవల వల్ల ఈ లీకులు జరుగుతుంటాయి. ‘ఈ సినిమాలో చేశాం’ అని చెప్పుకోవడం కోసం ఇలా చేస్తారు. ‘మగధీర’ అప్పుడు కూడా పెద్ద లీక్ అయింది. సీజీ వర్క్ చేసిన సీన్ ముందే లీక్ అయింది. దానివల్ల ఆ సీన్‌ని ఆ సినిమాలో పెట్టలేకపోయాం. లీకులు చేసేవాళ్లు ఒక సంగతి గ్రహించాలి. వేల మంది ఇండస్ట్రీ మీద బతుకుతుంటారు. లీక్ చేయడం అంటే వీళ్లందరి జీవితాలతో ఆడుకోవడమే. వీళ్ల మైండ్‌సెట్ మారాలి. మైండ్‌సెట్ మారని వాళ్ల కోసం చట్టాలు కఠినంగా మారాలి. ఇలా అరెస్ట్ అయి, అలా బెయిల్‌పై వచ్చేలా ఉండకూడదు. అందరు హీరోల ఫ్యాన్స్ ఒకటవ్వాలి – దిల్ రాజు, డీజే నిర్మాత లీకేజీ సమస్య అన్ని సినిమాలకూ, అన్నీ లాంగ్వేజీలలోనూ ఉంది. కొన్ని వేల రూపాయల కోసం ఆశపడి, కొన్ని కోట్లరూపాయల సినిమాను డ్యామేజ్ చేస్తున్నారు. మనుషుల మెంటాలిటీ మారితే తప్ప ఇలాంటివి ఆగవు. ఒక హీరో సినిమా లీక్ అయితే, ఆ హీరో అభిమానులే కాకుండా, మిగతా హీరోల అభిమానులు కూడా లీక్‌లకు వ్యతిరేకంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వాళ ఒక హీరో సినిమాకు జరిగింది రేపు ఇంకో హీరో సినిమాకు జరగదని ఏముంది? పైరసీపై ఇలాగే కలసికట్టుగా అభిమానులు ఫైట్ చేశారు. ఇప్పుడు ఫిజికల్‌గా పైరసీ లేదు కానీ ఆన్లైన్లో ఉంది. దీన్ని కూడా అడ్డుకోవాలి. లేదంటే అందరం బాధపడవలసి వస్తుంది. నమ్మక ద్రోహులు ఉంటారు – కల్యాణ్ రామ్ సినీ హీరో, జై లవ కుశ నిర్మాత సినిమా సీజీ వర్క్‌కి మనుషుల అవసరం బాగా పెరుగుతుంది. రకరకాల మనుషులు వస్తారు. అంతా నమ్మకం మీద వదిలేస్తాం. అనుమానిస్తే అసలు ఏ పనీ కాదు. అప్పటికీ కేర్‌ఫుల్‌గా ఉంటాం. అయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరిదీ క్రిమినల్ మైండ్ అనలేం. ఇంటి దగ్గర అందరికీ గొప్పగా చూపించుకోవడం కోసం కొందరు ఇలా లీక్‌లు చేస్తుంటారు. జై లవ కుశ కూడా అలాగే లీక్ అయింది. ఆన్లైన్ ఎడిటర్ హెల్త్ బాగోలేకపోతే అతని ప్లేస్‌లో వేరే మనిషిని పంపాడు. అతడి వల్ల జూనియర్ ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడన్న సంగతి ప్రపంచానికంతటికీ తెలిసింది. ఈ లీక్ చేసిన వాడికి గుడివాడలో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి దగ్గర షో ఆఫ్ చెయ్యడం కోసం చూపించాడు. అలా అలా అది ఫోన్లతో తిరిగి నెట్లోకి వచ్చింది. – సాక్షి ‘ఫ్యామిలీ’ -
డీజేపై నిషేధం విధించండి
అభ్యంతర పదాలున్నాయంటూ హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలోని నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వాటిని తొలగించే వరకు సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించాలని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపనుంది. డీజే సినిమాలోని శృంగార గీతాల్లో అభ్యంతరకర పదాలున్నాయని..వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా పరిగణనలోకి తీసుకోలేదని, మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తెలిపారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించే వరకు డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కృష్ణమోహన్ కోరారు. -
వంద కోట్లంటే వంద కోట్ల మంది ప్రేమ
‘‘బన్నీ నన్నెప్పుడూ ఆటపట్టించేవాడు. సార్.. మన బ్యానర్లో మీరు మాస్ సినిమా తీయలేరని. మా బ్యానర్లో 25వ సినిమా, బన్నీ హయ్యస్ట్ గ్రాసర్ ‘డీజే’నే. బన్నీ.. 4 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ క్రాస్ చేసి, వారంలో వంద కోట్లు.. సో.. ఇంపాజిబుల్ అన్నది నీ ద్వారానే పాజిబుల్ అయింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో ‘దిల్’రాజు, శిరీష్ నిర్మించిన ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ సినిమా థ్యాంక్స్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘అన్నా.. మీ బ్యానర్లో నా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, హయ్యస్ట్ కలెక్షన్స్ రావాలి’ అని హరీష్ కోరిక. అది ‘డీజే’తో సాధ్యమైంది. ఈ సక్సెస్‌కు పిల్లర్స్ బన్నీ, హరీష్. థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి, బయటకి రాగానే ‘యస్.. ఈ సినిమా మనం అనుకున్నట్టు బ్లాక్‌బస్టర్ హిట్. ఎవరు ఏదన్నా వినొద్దు’ అనే నమ్మకంతో వచ్చాం. అది నిజమైంది. మా బ్యానర్లో 25వ చిత్రం ఫస్ట్ వీక్‌లోనే వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తోందంటే ఇంతకు మించిన సమాధానం లేదు ‘డీజే’ విషయంలో. ప్రతి హీరోతో మా సంస్థలో సినిమా చేయాలి. ఈ రోజు సోషల్ మీడియాలో ఏ హీరో ఫ్యాన్స్ అయినా మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ఏ హీరో అభిమానీ మరో హీరోని తక్కువ చేయొద్దు. ఎందుకంటే మనమందరం తెలుగువాళ్లం. తెలుగు సినిమా స్థాయి పెంచండి. ప్రతి అభిమానికీ నా రిక్వెస్ట్ ఇది. ‘బాహుబలి’ తర్వాత ‘డీజే’ అని ముంబయ్ నుంచి ట్వీట్లు చేస్తున్నారు... ‘డీజే’ చూసి, కంపేర్ చేసుకుని హిందీ సినిమాలు తీయండి అని. అదీ మన తెలుగు సినిమా స్టామినా’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నన్ను ప్రేమిస్తున్న నా ఫ్యాన్స్, సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, మమ్మల్ని దీవించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా అందరికీ ఇంత మెమరబుల్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన హరీష్‌కి థ్యాంక్స్. రివ్యూల్లో కొంత నెగెటివిటీ ఉన్నా ప్రేక్షకుల పాజిటివిటీ ముందు నిలవలేదు. ‘దిల్’ రాజు, నా కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ ప్రేక్షకులు ఇచ్చిన గిఫ్టే. కలెక్షన్లు అన్నవి ఒక నంబర్ కాదు. నేనెప్పుడూ చూసేది ఎంతమంది చూశారు అని. వంద కోట్లంటే అది నంబర్ కాదు. వంద కోట్ల మంది ప్రేమ’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘బన్నీ నన్ను పిలిచి మనం సినిమా చేస్తున్నాం. ఆ సినిమా ఇద్దరి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలన్నారు.. అయింది. విమర్శలకు బాక్సాఫీస్ సమాధానం చెబుతుంది. సినిమా అంటే వినోదం. సినిమా నచ్చకపోతే ఈ సీన్, స్టోరీ, క్యారెక్టర్ బాగాలేదని విమర్శించండి తప్పులేదు. కానీ, డైరెక్టర్ని విమర్శించకండి. డబ్బులు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులు రివ్యూ ఇవ్వండి. అంతేకానీ, వేరే వారిచ్చిన రివ్యూలను న మ్మొద్దు. మా సినిమా నాన్ ‘బాహుబలి’ రికార్డులను కొట్టుకుంటూ వెళుతోంది. ఓ మంచి మూవీ చేసినప్పుడు కలెక్షన్లు మాట్లాడాలి తప్ప రివ్యూలు కాదు’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కెమెరామేన్ బోస్, నటులు తనికెళ్ల భరణి, రావు రమేశ్, సుబ్బరాజు, రచయిత జొన్నవిత్తుల తదితరులు పాల్గొన్నారు. -
మంచి మాట పాటించే డీజే
దువ్వాడ జగన్నాథమ్ (డీజే) చిన్నప్పుడే కాలేజీలో తన అక్కను ఇబ్బంది పెట్టినవారిని పీకుతాడు. పోలీసాఫీసర్ మురళీశర్మను గూండాలు చంపేయబోతున్నప్పుడే పదేళ్లు వయసు ఉన్న చిన్న డీజే ఆ గూండాలను కాల్చి చంపుతాడు. అంత పెద్ద రిస్క్ తీసుకున్న పిల్లవాణ్ణి అర్జునుడిని కృష్ణుడు చేరదీసినట్లు చేరదీస్తాడు మురళీశర్మ. తాతయ్య చెప్పిన ఒక మంచి మాటని ఎప్పుడూ చెబుతుంటాడు డీజే. అదేంటంటే ‘‘మనం చేసే మంచి కనపడాలి... కానీ మనిషి కనపడక్కర్లేదు’’. అదే ఫాలో అవుతుంటాడు డీజే. తన కుటుంబంతో కలిసి అగ్రహారంలో వంటల కాంట్రాక్ట్‌లు చేస్తుంటాడు డీజే. డీజే ఉద్వేగానికి బలవుతున్న రొయ్యలనాయడు అండ్ కంపెనీ డీజే ఎవరో కనిపెట్టడానికి సర్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇంతలో డీజే బాబాయ్ చంద్రమోహన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అగ్రో డైమెండ్లో పెట్టిన పెట్టుబడి పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కంపెనీని మోసం చేసి తన ఉనికి తెలియకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కామ్‌ను డ్రైవ్ చేస్తుంటాడు రొయ్యలనాయుడు (రావు రమేశ్). హోమ్ మినిస్టర్ పుష్పం (పోసాని కృష్ణమురళి)ను దగ్గరకు తీసుకుంటే లూటీ చేయడం సులభం అవుతుందని అబుదాబిలో ఉన్న తన కొడుకు చంటి (సుబ్బరాజు), హోమ్ మినిస్టర్ కూతురు పూజాకి వివాహం చేయలనుకుంటాడు రొయ్యల నాయుడు. కానీ, పూజ (పూజా హెగ్డే) కన్ను డీజే మీద పడి, వారి ప్రేమ వ్యవహారం ముదురుతుంది. స్కామ్ వెనకాల ఎవరు ఉన్నారన్నది డీజేకి తెలియకపోవడం, డీజే ఎవరన్నది రొయ్యలనాయుడు అండ్ కో క్యారెక్టర్స్‌కి తెలియకపోవడం సినిమాను ముందుకు తీసుకెళుతుంటాయి. అక్కడి నుంచి రొయ్యలనాయుడి పని డీజే ఎలా పడతాడన్నదే మిగతా సినిమా. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, మురళీ శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయాంక బోస్, కథ–మాటలు–దర్శకత్వం: హరీశ్ శంకర్, సమర్పణ: శ్రీమతి అనిత, నిర్మాతలు: ‘దిల్’ రాజు, శిరీష్ -
అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా!
అల్లుఅర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్). ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన విశేషాలు. ► కళ్ళముందు అన్యాయం జరుగుతున్నప్పుడు వెయ్యి తుపాకులు, వంద కత్తులు తీసుకుని ఎవర్నైనా ఎదిరించాలనిపిస్తుంది. కానీ, బాధ్యతలు మన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేస్తాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోలేం. ఇలాంటి ఎమోషన్స్ కలిగిన వ్యక్తి అన్యాయానికి ఎదురెళితే ఎలా ఉంటుందనేది ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్) సినిమాలో చూపించాం. బన్నీ (అల్లు అర్జున్), దిల్‌రాజు కాంబినేషన్లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఆ కల ఈ సినిమాతో నెరవేరింది. ► ఇందులో స్టైలిష్ బ్రాహ్మిణ్ క్యారెక్టర్లో బన్నీని చూస్తారు. ఇదివరకు నా సినిమాలో టచ్ చేయని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాం. బన్నీ క్యారెక్టర్లో టూ షేడ్స్ ఉన్నాయా? లేక బన్నీ డబుల్ క్యారెక్టర్ చేశాడా? సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు తెలిసిపోతుంది. బ్రాహ్మణ పాత్రలో నటించేందుకు బన్నీ డెడికేషన్ చూసి షాక్ అయ్యాను. 365 డేస్‌లో షూటింగ్ ఎప్పుడున్నా నేను రెడీ అనే యాక్టర్ బన్నీనే. ఈ సినిమా ప్రీ–క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్ నేనిప్పటి వరకు తీసిన సినిమాల్లోకెల్లా ది బెస్ట్. ► బూతు భాషలో ఉండదు. అర్థం చేసుకునే భావంలో ఉంటుంది. నిర్మాతలు, దర్శకులు ఇతరుల మనోభావాలను కించపరచాలని సినిమాలు తీయరు. ‘డీజే’ సినిమాలో అభ్యంతరం వ్యక్తం చేసిన పదాలను తొలగించాం. ఆ పదాలు తీసేసిన తర్వాత కూడా కొందరు తొలగించలేదని నిందించారు. అప్పుడు కాస్త బాధగా అనిపించింది. ► ఇండస్ట్రీలో మనుషులను నమ్మరు. సక్సెస్‌నే నమ్ముతారు. మనకన్నా మన సక్సెస్సే ఎక్కువగా మాట్లాడుతుంది. నిజానికి హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా సక్సెస్‌నే చూస్తారు. సక్సెస్ వచ్చిందని పొంగిపోను. ఫ్లాప్ వచ్చిందని డీలా పడిపోను. నా మీద నాకు నమ్మకం ఎక్కవ. విమర్శలను స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమే. ‘డీజే’ టైటిల్ ప్రేక్షకుల్లోకి చాలా స్పీడ్‌గా వెళ్లింది. సౌతిండియాలోనే ‘డీజే’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టెక్నాలజీని చదువుకున్నవారే ఎక్కువగా వాడతారు. వీడియో మీకు నచ్చకపోతే డిస్లైక్ కొట్టమని యూట్యూబ్‌లో ఆప్షన్ ఉంది. కానీ, కావాలని చేసేవారికి అది ఎంత వరకు సమంజసమో వారి విజ్ఞత, జ్ఞానానికే వదిలేస్తున్నాం. ► పవన్‌కల్యాణ్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఆయన కోసం స్పెషల్ స్క్రిప్ట్ రాస్తున్నాను. పవన్ ‘డీజే’ సినిమాను చూస్తానంటే ‘దిల్’రాజు, బన్నీ, నాకు అంతకుమించిన ఆనందం లేదు. తప్పకుండా స్పెషల్ షో వేస్తాం. చిరంజీవిగారి సినిమా కోసం థాట్ వచ్చింది. ఆయనతో ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ వంటి ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ సినిమా తీయాలని ఉంది. ►‘హ్యూమన్ రిలేషన్స్’ బేస్డ్ సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే కొత్త డైరెక్టర్లను ప్రొత్సహించేందుకు రెడీ. -
డీజేగానే ఈజీ!
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ ఈ శుక్రవారంవిడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో స్మాల్ చిట్‌చాట్! ► తొలిసారి బ్రాహ్మణ యువకుడి పాత్ర చేశారు.. ఎలా అనిపించింది? దర్శకుడు హరీష్ శంకర్ బ్రాహ్మణ యువకుడి కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి కథ. అతను ఈ పాత్ర గురించి చెప్పాక బ్రాహ్మణ యువకుల శైలిని గమనించడం మొదలుపెట్టాను. అంతకు ముందు ఎప్పుడూ నేనంతగా వాళ్లను గమనించిన సందర్భాలు లేవు. ఈ సినిమాకి కొంచెం హోమ్‌వర్క్ చేశా. ► ప్రతిరోజూ మా ఇంటికి పురోహితులు వచ్చేవారని ‘డీజే’ ఆడియోలో మీ డాడీ చెప్పారు. వాళ్ల దగ్గర్నుంచి మీరేం నేర్చుకున్నారు? నాకు అంతకుముందు బ్రాహ్మణుల సంప్రదాయాల గురించి ఐడియా లేదు కాబట్టి... వాళ్ల కల్చర్ ఏంటి? వాళ్లలో ఎన్ని రకాలున్నారు? అనే సంగతులు తెలుసుకున్నా. విష్ణువును పూజించేవాళ్లు కొందరు, శివుణ్ణి పూజించేవాళ్లు కొందరు, మధ్వాచార్యులను అనుసరించేవాళ్లు కొందరు... ఇలా బ్రాహ్మణుల్లో చాలామంది ఉన్నారు. ‘డీజే’లో నేనెలాంటి బ్రాహ్మణుడి పాత్ర చేస్తున్నాననేది తెలుసుకున్నా. నా క్యారెక్టరైజేషన్‌ను ఎక్కువ డిఫైన్ చేయడం కోసం, సినిమాలో మరికొంత భాగం కోసం వాళ్లతో మాట్లాడి తెలుసుకున్నా. ► బ్రాహ్మణ యువకుడి పాత్రను ఓ నాన్–బ్రాహ్మిణ్ చేసినప్పుడు యాస, భాషల విషయంలో కేర్ తీసుకోవాలి. మీరెంత వరకు ఈ పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నారు? మా దర్శకుడు బ్రాహ్మిణ్ కాబట్టి ఆయనకు ఓ సై్టల్ ఉంటుంది కదా! మ్యాగ్జిమమ్ ఆయన సై్టల్‌ను వాడుకుని నటించా. వంద శాతం పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించా. సినిమా చూసిన తర్వాత నేనెలా చేశాననేది ప్రేక్షకులే చెప్పాలి. ► దువ్వాడ జగన్నాథమ్, డీజే... ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు కదా! మీకు ఏది ఈజీ? తప్పకుండా డీజేగానే ఈజీ. దువ్వాడ జగన్నాథమ్‌గా చేయడానికి కొంచెం కష్టపడ్డా. నాకు అలవాటు లేని యాస కదా. అందువల్ల, డైలాగులు చెప్పేటప్పుడు వాటితోపాటు యాసను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పాలి కాబట్టి కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోయిన్‌తో ఓ సీన్ అయితే ఎంతసేపటికీ కరెక్ట్‌గా కుదరలేదు. దానికి ఎక్కువ టేకులు తీసుకున్నా. ► సాధారణంగా ఫైట్స్‌లో ఎక్కువగా గ్రాఫిక్స్ వాడతారు. ఈ సినిమాలోని ఓ పాటలో గ్రాఫిక్స్ వాడారట? కొత్తగా ఉంటుంది కదా! ఫస్ట్‌టైమ్ ఫైట్స్‌లో గ్రాఫిక్స్ వాడినప్పుడు... ‘ఫైట్స్‌లో గ్రాఫిక్స్ ఏంటి?’ అన్నారు. ఓ కొత్తవిషయం వచ్చినప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా సహజమే కదా! ► ఇది పక్కా కమర్షియల్ సినిమానా? ఏదైనా ఎక్స్పరిమెంట్ చేశారా? సినిమా అంటేనే ఎక్స్పరిమెంట్! ‘డీజే’ పక్కా కమర్షియల్ సినిమా. కామెడీ, యాక్షన్, సాంగ్స్... కమర్షియల్ ప్యాకేజ్‌తో వస్తున్న సినిమా. అయితే ఓ చిన్న సందేశం కూడా ఉంటుంది. -
జగన్నాథమ్ పెళ్లి కుదిరింది!
దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ అల్లు అర్జున్‌ది విజయవాడ లోని సత్యనారాయణపురం అగ్రహారం! ప్యూర్ వెజ్ అన్నపూర్ణ క్యాటరింగ్సు నడుపుతుంటాడు. అతను ఫ్యాషన్ డిజైనర్ అలియాస్ పూజా హెగ్డేను చూసి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ పెళ్లి పీటలు దాకా వచ్చే వరకు వీళ్లిద్దరి మధ్య ట్రాక్ రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ అనేలా ఉంటుందట! ఈ క్రమంలో ‘వెన్నెల’ కిశోర్ చేసే హంగామా, అల్లు అర్జున్ చేసే హడావిడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన ‘అస్మైక యోగ..’ పాట... పెళ్లి కుదిరిన తర్వాత తన ప్రేయసి, కాబోయే భార్యను జగన్నాథమ్ ఊహించు కుంటున్నప్పుడు వస్తుంది. యాక్షన్, కామెడీలతో పాటు ఈ ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’లో రొమాన్స్ కూడా ఓ రేంజ్లో ఉంటుందట! నిన్నటితో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ పూరయ్యాయి. చివరగా ఓ సాంగులో కరెక్షన్స్ చేశారు. ఆ వెంటనే సెన్సార్ కంప్లీట్ చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. -
బట్... అంతా మెగా ఫ్యామిలీనే!
– అల్లు అర్జున్ ‘‘తండ్రిగా బన్నీ (అల్లు అర్జున్) ప్రతి సినిమా హిట్టవ్వాలని కోరుకుంటా. కానీ, ఈ డీజే ‘దిల్’ రాజు కోసం హిట్టవ్వాలని కోరుకుంటున్నా. చిత్రపరిశ్రమలో నాకున్న మంచి స్నేహితుల్లో ఆయనొకరు. వ్యక్తిగతంగా ఆయనకు ఓ నష్టం (‘దిల్’ రాజు భార్య అనిత మృతి గురించి) జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఏదీ చేయలేం. కానీ, మా ఫ్యామిలీ నుంచి ఆయనకు ఓ సూపర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’’ అన్నారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన సినిమా ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లు అరవింద్ మనవడు అయాన్ (బన్నీ కుమారుడు), ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ పాటల సీడీలను విడుదల చేశారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఓ రోజు మా ఇంట్లో పదిమంది బ్రాహ్మణులను చూశా. పూజలు ఏమైనా చేస్తున్నారా? అని మా ఆవిడను అడిగితే... బన్నీ కోసం వచ్చారని చెప్పింది. ‘డీజే’ కోసం బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలు, వేదం ఎలా పలకాలనేది నేర్చుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. దేవిశ్రీ సూపర్ సాంగ్స్ ఇచ్చాడు’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే... నా ఫ్యాన్స్, నా సినిమాలు చూసే ఇతర హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకులే కారణం. నేను మరచిపోకుండా చెప్పాల్సింది మెగా ఫ్యాన్స్ గురించి. మెగా ఫ్యాన్స్ అంటే... మెగాస్టార్ చిరంజీవిగారి ఫ్యాన్స్ అని కాదు. పవన్‌గారు, రామ్‌చరణ్, వరుణ్, తేజు, శిరీష్, నిహారిక, నేను... ఎవ్వరుంటే వారు. మీరు (ప్రేక్షకులు) ఎవరినైనా ఇష్టపడొచ్చు. బట్... అంతా మెగా ఫ్యామిలీనే. ఎప్పుడూ నా సినిమాలు నా కోసం హిట్ అవ్వాలనుకుంటా. అనిత ఆంటీ మమ్మల్ని విడిచి వెళ్లినా... మాకు ఏ లోటు లేకుండా సినిమా పూర్తిచేసిన ‘దిల్’ రాజుగారి కోసం ఈ సినిమా హిట్టవ్వాలనుకుంటున్నా. హరీష్ సినిమాల్లో వినోదం ఉంటుంది. కానీ, ‘డీజే’లో వినోదం, భావోద్వేగం రెండూ కుదిరాయి’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌లోని ‘మనం చేసే పనిలో మంచి కనపడాలి తప్ప... మనిషి కాదు’ అనే మాటలను పవన్‌కల్యాణ్‌గారి స్ఫూర్తితో రాశా. ‘గబ్బర్ సింగ్’ సక్సెస్ తర్వాత పవన్‌గారిని కలసి, ఓ ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే... ‘సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనపడాలి’ అన్నారు. అంతే కాదు... ‘సక్సెస్ మనిషిని ఉన్న చోట ఉండనివ్వదు. చెడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పారు. ఈ కట్టె కాలే వరకూ నేను పవన్ ఫ్యానే. ఆయనతో సినిమా అంటే... ప్రకృతి సహకరించాలి. పవన్ నుంచి ఆదేశాలు రావాలి. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే... తెరపై అల్లు అర్జున్, తెర వెనుక దేవిశ్రీ హీరోలు. ఈ సినిమా చూసి అర్జున్ ప్రతి ఫ్యాన్ కాలర్ ఎగరేస్తాడు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మా సంస్థ స్థాపించి 14 ఏళ్లైంది. తొలి సినిమా ‘దిల్’. రెండో సినిమా ‘ఆర్య’. అప్పుడు నిర్మాతగా నేను, హీరోగా బన్నీ వేర్వేరు. సినిమా ట్రావెల్లో అరవింద్‌గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఒక్కటైంది. తర్వాత బన్నీతో చేసిన ‘పరుగు’ హీరోగా తనకు, నిర్మాతగా నాకు ఆరో సినిమా. మళ్లీ బన్నీతో చేయడానికి 9 ఏళ్లు పట్టింది. దీనికి కారణం కథే. ఇప్పుడీ ‘డీజే’ మా సంస్థకు 25వ సినిమా. ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 23న సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు. ఈ వేడుకలో బన్నీ కుమారుడు అయాన్ వేదికపైనుంచి అందరికీ నమస్కరించడం ప్రేక్షకుల్ని ఆకర్షించింది. అల్లు అర్జున్ భార్య స్నేహ, కుమార్తె అర్హ, చిత్ర బృందం పాల్గొన్నారు. -
నా లైఫ్‌లో డైరెక్షన్ చేయను
► ‘దిల్’ రాజు ‘‘అన్నా.. నువ్వో సినిమా డైరెక్ట్ చేయొచ్చు కదా’ అని వినయ్ (వీవీ వినాయక్) నన్నెప్పుడో అడిగారు. ‘మీరు డైరెక్షన్ చేయొద్దు’ అని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు అంటున్నారు. నేను మీకు హామీ ఇస్తున్నా. నా లైఫ్‌లో డైరెక్షన్ చేయను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన 25వ చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్). ఇప్పటివరకూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో పనిచేసిన 17మంది డైరెక్టర్ల సమక్షంలో ‘డీజే’ ట్రైలర్ లాంచ్ చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పధ్నాలుగేళ్లుగా మా సంస్థ ఇక్కడుందంటే కారణం డైరెక్టర్లే. దర్శకులు పడే కష్టం, తపన ఏంటో నాకు తెలుసు. అందుకే నేను డైరెక్షన్ జోలికి వెళ్లను. ‘డీజే’ తర్వాత హరీశ్‌తో మరో సినిమా చేస్తాం. మా బ్యానర్లో వంద సినిమాలు ఏమో కానీ యాభై సినిమాలు మాత్రం తీయగలనని చెప్పగలను’’ అన్నారు. ‘‘రామానాయుడుగారు ఎప్పుడూ స్టార్లను నమ్మి సినిమాలు తీయలేదు. కథను నమ్మి తీశారు. అదే క్వాలిటీ శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో ఉంది’’ అన్నారు వీవీ వినాయక్. ‘‘రాజుగారు ఓ గైడ్‌బుక్ లాంటి వారు. ఆయన డైరెక్టర్లకు ధైర్యం. వేళ్లమీద లెక్కపెట్టుకునే మంచి నిర్మాతల్లో రాజుగారు తొలి వ్యక్తి’’ అన్నారు బోయపాటì శ్రీను. ‘‘హీరో, నిర్మాతలకు ట్రైలర్ చూపించాలంటేనే భయం. ఒకేసారి 17 మంది దర్శకులకు ట్రైలర్ చూపించాలంటే ఎంత ధైర్యం కావాలి. వినయ్‌గారి వద్ద అసిస్టెంట్‌గా పెట్టమని కోన వెంకట్‌గారిని ఎన్నోసార్లు అడిగినా కుదర్లేదు. కానీ, నేను వినయ్ గారికి ఏకలవ్య శిష్యుణ్ణి’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘రాజుగారు 100 సినిమాలు చేసి, రామానాయుడిగారి స్థాయికి ఎదగాలి’’ అన్నారు దశరథ్. ‘‘నా తొలి చిత్రం సరిగ్గా ఆడకపోయినా నా టాలెంట్ గుర్తించి మరో అవకాశం ఇచ్చారు రాజుగారు’’ అన్నారు వంశీ పైడిపల్లి. ఈ వేడుకలో దర్శకులు శ్రీవాస్, శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సాయికిరణ్ అడవి, త్రినాథరావు, అనిల్ రావిపూడి, వేణు శ్రీరాం, వాçసూ వర్మ, రాధామోహన్, సతీశ్ వేగేశ్న తదితరులు పాల్గొన్నారు. -
‘డీజే’ సినిమాలో పాటను తొలగించాలి
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్ సిటీబ్యూరో: ‘దువ్వాడ జగన్నాథం (డీజే)’ సినిమాలో అసందర్భ ప్రేలాపనలతో, బ్రాహ్మణులను కించపరిచేలా రాసిన పాటను తొలగించాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో–ఆర్డినేటర్లు గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్‌మోహన్ హెచ్చరించారు. సినిమాల్లో బ్రాహ్మణులను హీనంగా చూపడం అలవాటుగా మారిందని, ఇప్పుడది పాటలకూ విస్తరించిందని శుక్రవారం వారొక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 23న విడుదల కానున్న ‘డీజే’ సినిమాలో ‘సాహితి’ పేరుతో చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి రాసిన ‘అస్మిక యోగ తస్మిక భోగ’ అనే ప్రణయ గీతంలో రుద్ర స్తోత్రంలోని పదాలను చొప్పించి, హిందువుల.. ముఖ్యం గా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. ఈ పాటలో ‘ప్రవర’ అనే పదాన్ని అపహాస్యం చేశారన్నారు. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు తమని తాము పరిచయం చేసుకునేందుకు అభివాదం చేస్తూ గోత్ర ‘ప్రవర’లు ప్రస్తావించేవారని, అటువంటి ‘ప్రవర’ను అపహాస్యం చేస్తూ ‘ప్రవరలో ప్రణయ మంత్రాన్ని’ అంటూ చరణాలు రాయడం శోచనీయమన్నారు. పూర్వం బ్రాహ్మణులుండే ప్రాంతాలను అగ్రహారాలనే వారని. బ్రాహ్మణులు తాంబూల ప్రియులని, దీని ఆధారంగా ‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’ అంటూ మరో ప్రయోగం చేయడం దుస్సాహసమన్నారు. బ్రాహ్మణులను కించపరిచేలా పాట రాసిన ‘సాహితి’ తన తప్పును ఒప్పుకొని బ్రాహ్మణులకు, హిందూజాతికి క్షమాపణలు చెప్పాలని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్ చేసింది. -
దుమ్ము రేపుతున్న’డీజే’ లేటెస్ట్ వీడియో సాంగ్
-
భజే భజే... డీజే
జ్వాలా త్రినేత్రుడు... విద్రోహులపై రుద్ర తాండవం చేసే వీరుడు... లోక కంటకుల గుండెలు అదిరేలా మృత్యుగంట మోగించేవాడు... అతనెవరో కాదు, దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజే! టీజర్లో అల్లు అర్జున్ వంట బ్రాహ్మణుడిగా కనిపించారు. అది జస్ట్ సాంపిల్ మాత్రమే. సినిమాలో జగన్నాథమ్ విశ్వరూపం చూపిస్తాడని టైటిల్ సాంగులో క్లారిటీ ఇచ్చేశారు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’లో జొన్నవిత్తుల రాసిన ‘శరణం భజే భజే... డీజే’ పాటను సోమవారం విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట క్యాచీగా ఉందంటున్నారు నెటిజన్లు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయాలనుకుంటున్నారు. -
శరణం భజే భజే అంటున్న అల్లు అర్జున్
-
శరణం భజే భజే అంటున్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘శరణం భజే భజే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న దువ్వాడ జగన్నాథం చిత్రంలోని తొలి పాటను చిత్ర యూనిట్ సోమవారం యూ ట్యూబ్‌లో విడుదల చేసింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. శరణం భజే భజే పాట యూట్యూబ్ లింక్‌ను అల్లు అర్జున్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట... లైక్‌లతో దుమ్ము రేపుతోంది. కాగా గతంలోనూ డీజే దువ్వాడ జగన్నాథమ్ టీజర్ భారీ స్పందన వచ్చింది. యూట్యూబ్ లో కోటికిపైగా వ్యూస్ సాధించింది. -
దువ్వాడ దుమ్ము లేపుతున్నాడు!
వంటలు చేసే పంతులే కదా... కూరలో కరివేపాకులా ఏరి పారేయొచ్చు! పంచె కట్టుకున్నాడు... మనల్ని చూస్తేనే పరుగులు తీస్తాడు అనుకున్నోళ్లు దువ్వాడ దుమ్ము లేపుతుంటే... అతడికి దూరంగా పరుగులు తీయడానికి దారులు వెతుక్కుంటున్నారు. షూటింగ్లో ఈ సీన్ చూసినోళ్లు... ‘దువ్వాడ జగన్నాథమ్’ క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ విశ్వరూపం చూపిస్తాడని చెబుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌లో జరుగుతోంది. క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ కాకుండా, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట! ఓ పక్క షూటింగ్ చేస్తూనే, మరోపక్క డబ్బింగ్ పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రీసెంట్గా ఆడియో టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో పాటల్ని విడుదల చేయనున్నారు. -
రొమాంటిక్ జగన్నాథమ్
ద్యావుడా... ఇదేం పని? స్కూటరేసుకుని మార్కెట్‌కి వెళ్లామా? కూరగాయలు తెచ్చుకుని, వంట చేశామా? అన్నట్లు ఉండే జగన్నాథమ్ ఇలా సూటూ బూటూ వేసుకోవడం ఏంటి? వేర్ ఈజ్ ది పంచ్ కట్టు జగన్నాథా? అని ‘దువ్వాడ జగన్నాథమ్’లోని ఈ కొత్త స్టిల్ చూసి అనుకుంటున్నారా? మనోడు వంటోడే అయినా లోపల ఇంకా ఏదో ఉంది. ఆ యాంగిల్ ఏంటి? అనేది సినిమాలో చూస్తారు. ఆ పాత్ర తాలూకుదే ఈ స్టిల్. పంచె కట్టులో పసందుగా కనిపించిన జగన్నాథమ్ సూటూ బూటులో సూపర్బ్‌గా ఉన్నాడు కదూ. ఈ లేటెస్ట్ స్టిల్‌ను సోమవారం విడుదల చేశారు. ఓ రొమాంటిక్ సాంగ్‌కి సంబంధించిన ఈ ఫొటోలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగుంది కదూ. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. సినిమాని జూన్ 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు– శిరీష్ నిర్మిస్తున్నారు. -
మన జగన్నాథమే... ఇలా మారాడు!
పంచెకట్టు తీసేసి సూటూ బూటూ వేశాడు... నుదుటున నామాలు చెరిపేసి సై్టలిష్ కళ్లజోడు పెట్టాడు... చేతిలో స్కూటర్ పక్కన పెట్టేసి బ్రీఫ్‌కేసు పట్టుకున్నాడు... సింపుల్‌గా చెప్పాలంటే జస్ట్ సై్టల్ మారింది. దువ్వాడ జగన్నాథమ్ సై్టల్ మార్చాడు. సై్టల్ మాత్రమే కాదు... సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్లో షేడ్ కూడా మారుతుందట! అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న సినిమా ‘డీజే–దువ్వాడ జగన్నాథమ్’. జూన్ 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. టీజర్లో చూపించిన అల్లు అర్జున్ వంట బ్రాహ్మణుడి పాత్రలో మరో షేడ్ ఉంటుందట. దానికి సంబంధించినదే ఈ సూటూ బూటూ లుక్ అని టాక్. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఆర్య, పరుగు’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ మా సంస్థలో హీరోగా నటిస్తున్న మూడో చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్–హరీష్ శంకర్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో మా సంస్థ సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకునేలా దర్శకుడు హరీష్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు’’ అన్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్– లక్ష్మణ్, కళ: రవీందర్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, కథనం: రమేశ్‌రెడ్డి–దీపక్‌రాజ్, కెమేరా: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
మాసీ జగన్నాథమ్!
కూరగాయలతో నిండిన కలర్‌ఫుల్ స్కూటరూ... డ్రైవింగ్ సీటులో జగన్నాథమ్ హుషారూ... పూజలు, ప్రేమ పదనిసలు... అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ టీజర్లో హీరో క్యారెక్టర్లో సాఫ్ట్ కార్నర్‌ను మాత్రమే ఎక్కువ చూపించారు. టీజర్ చివర్లో యాంగ్రీ అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ చూపించినా, డైలాగ్ మ్యూట్ చేయడంతో ప్రేక్షకులకు ఆ డైలాగ్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ సంగతలా ఉంచితే... జగన్నాథమ్ టీజర్లో చూపించినంత సాఫ్ట్ మాత్రం కాదు, ఊర మాస్ అట! విలన్లను చితక్కొట్టే మాసీ ఫైట్స్ కూడా సినిమాలో ఉన్నాయట. అందుకు సాంపిల్ అన్నట్టుగా అల్లు అర్జున్ బర్త్‌డే (శనివారం) సందర్భంగా ఈ స్టిల్ రిలీజ్ చేశారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమా సంగతి పక్కన పెడితే.... శనివారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ కేక్ కట్ చేసి, పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నాగబాబు, అల్లు శిరీష్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. -
డీజే... ఓన్లీ వెజ్జే!
మనకు డీజేలు ఎక్కడ కనిపిస్తారు? పబ్బుల్లోనే కదా. అయితే... ఈ డీజే మాత్రం డిఫరెంట్ అండోయ్! పబ్బుల్లో కాదు, విజయవాడలో బజాజ్ స్కూటర్‌పై కూరగాయలు తీసుకువెళుతూ కనిపిస్తాడు. ఎందుకంటే... ఈ డీజే పని చేసేది పబ్బులో కాదు, అన్నపూర్ణ కేటరింగ్సులో. విజయవాడలోని సత్యనారాయణ అగ్రహారంలో గల అన్నపూర్ణ కేటరింగ్సు ప్యూర్ వెజిటేరియన్. కేటరింగ్సుతో పాటు ఈ కుర్రాడు ఇంకేం చేస్తాడో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేవరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. అల్లు అర్జున్ టైటిల్ రోల్లో ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న సినిమా ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’. శనివారం అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహాశివరాత్రికి టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అందుకుంటుంది. అంచనాలను మించేలా ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం కర్ణాటకలో చిత్రీకరణ జరుగుతోంది. కర్ణాటక షెడ్యూల్ తర్వాత అబుదాబి వెళతాం’’ అన్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్–లక్ష్మణ్, కెమేరా: ఐనాక బోస్, కూర్పు: ఛోటా కె.ప్రసాద్, కళ: రవీందర్, స్క్రీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి – దీపక్‌రాజ్, సంగీతం; దేవిశ్రీ ప్రసాద్. -
ఇండియా నా ఇల్లు!
మీ ఊరు పేరేంటి? అని ఎవరినైనా అడిగితే... హైదరాబాద్ అనో, ముంబయ్ అనో, ఢిల్లీ అనో ఏదొక ఊరు పేరు చెబుతారు. అలాగే, ఇల్లు గురించి అడిగితే ఇల్లెక్కడుందో చెబుతారు.. ఎవరైనా దేశం పేరు చెబుతారా? అల్లు అర్జున్ మాత్రం చెబుతారు. ‘ఇండియా నా ఇల్లు’ అంటున్నారాయన. అసలు మేటర్ ఏంటంటే... రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వంశీ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. టైటిల్‌ను బట్టి దేశభక్తి కథతో అల్లు అర్జున్, వక్కంతం వంశీలు సినిమా చేయనున్నారని ఊహించవచ్చు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’లో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. శివరాత్రి సందర్భంగా టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
బన్నీ సినిమాకు గబ్బర్‌సింగ్ సెంటిమెంట్
సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ద్విపాత్రభినయం చేస్తున్న ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను మహా శివరాత్రి రోజునే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ గబ్బర్‌సింగ్ టీజర్ కూడా మహా శివరాత్రి రోజునే రిలీజ్ అయ్యింది. ఆ సెంటిమెంట్‌ను డిజె విషయంలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. -
చిన్నారితో ఆటలు...కొత్త పాఠాలు!
అమ్మాయి పుట్టినప్పట్నుంచీ అల్లు అర్జున్ షూటింగ్‌లకు సెలవు ప్రకటించారు. చిన్నారి మెలకువగా ఉన్నంత సేపూ తనతో ఆడుకుంటున్నారు. చిట్టిపాప నిద్రపోయాక శ్రద్ధగా క్లాసులో గురువుగారు చెప్పే పాఠాలు వింటున్నారు. అల్లు అర్జున్ ఏ క్లాసులకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దువ్వాడ జగన్నాథమ్’లో అల్లు అర్జున్ బ్రహ్మణ యువకుడిగా నటిస్తున్నారు. పాత్రకు అనుగుణంగా భాషలో పర్ఫెక్షన్ చూపడం కోసమే క్లాసులు చెప్పించుకుంటున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రేపట్నుంచీ మొదలు కానుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... గూగుల్‌లో ‘మోస్ట్ సెర్చ్డ్’ తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్లో బన్నీని లక్షల్లో ఫాలో అవుతున్న అభిమానులు ఉన్నారు. ఫేస్బుక్లో 1 కోటీ 18 లక్షల మంది ట్విట్టర్లో 10 లక్షల మంది బన్నీని ఫాలో అవుతున్నారు. -
పాతబస్తీలో జగన్నాథమ్
హైదరాబాద్‌లో పాతబస్తీ పేరు వింటే చార్మినార్, మక్కా మసీద్, హడావిడి షాపింగ్.. గట్రా గుర్తు రావడం సహజమే. వీటన్నిటి మధ్య ఓ బ్రాహ్మణ యువకుడు ఏం చేశాడు? అతడి కహానీ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాత బస్తీలో జరుగుతోంది. అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్న సన్నివేశాలను పాత బస్తీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 4న అల్లు అర్జున్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. హీరోయిన్ పూజా హెగ్డే కూడా కొన్ని రోజులు చిత్రీకరణలో పాల్గొన్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్, రమేశ్ రెడ్డి. -
పవర్ స్టార్ బాటలో బన్నీ
గతంలో తన సినిమాలకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించని పవన్ కళ్యాణ్, ఇటీవల కాస్త రూటూ మారుస్తున్నారు. తన సినిమా ఫంక్షన్లకే కాదు అడపాదడపా తనను అభిమానించే వారి ఆడియో వేడుకలకు ఇతర ఫంక్షన్లకు హాజరవుతున్నారు. నితిన్ లాంటి యంగ్ హీరోస్‌ను సపోర్ట్ చేయటమే కాదు. సప్తగిరి లాంటి కమెడియన్ హీరోగా మారుతున్న సినిమా ఆడియో వేడుకకు కూడా హాజరై ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్లో బిజీగా ఉన్న బన్నీ, రెండు చిన్న సినిమాల ఆడియో వేడుకలకు హాజరు కానున్నడట. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో పాటు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి లీడ్ రోల్లో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ఆడియో రిలీజ్‌కు కూడా బన్నీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. -
బన్నీ మిస్ అయ్యాడుగా..!
అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ జనరేషన్ హీరో. వరుసగా యాబై కోట్ల సినిమాలతో పాటు.. సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్., ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బన్నీ మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా, బన్నీకి లక్కీ సీజన్‌గా పేరున్న ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అయ్యి 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. అయితే దువ్వాడ జగన్నాథమ్ మాత్రం ఆ సమయానికి రిలీజ్ చేయటం కుదిరేలా లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, కాటమరాయుడు సినిమాను మార్చి ఆఖరి వారంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత రెండు వారాలకు ఏప్రిల్ 14న మహేష్ మురుగదాస్‌ల యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో రెండు వారాలకు రాజమౌళి విజువల వండర్ బాహుబలి 2 థియేటర్లలో సందడి చేయనుంది. వరుసగా భారీ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో బన్నీకి తన సినిమా రిలీజ్ చేసే గ్యాప్ దొరకటం కష్టమే. మరి ఏప్రిల్ సీజన్ మిస్ చేసుకున్న బన్నీ దువ్వాడ జగన్నాథమ్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.