
మన జగన్నాథమే... ఇలా మారాడు!
పంచెకట్టు తీసేసి సూటూ బూటూ వేశాడు... నుదుటున నామాలు చెరిపేసి సై్టలిష్ కళ్లజోడు పెట్టాడు... చేతిలో స్కూటర్ పక్కన పెట్టేసి బ్రీఫ్‌కేసు పట్టుకున్నాడు... సింపుల్‌గా చెప్పాలంటే జస్ట్ సై్టల్ మారింది. దువ్వాడ జగన్నాథమ్ సై్టల్ మార్చాడు. సై్టల్ మాత్రమే కాదు... సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్‌లో షేడ్ కూడా మారుతుందట! అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న సినిమా ‘డీజే–దువ్వాడ జగన్నాథమ్’.
జూన్ 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. టీజర్‌లో చూపించిన అల్లు అర్జున్ వంట బ్రాహ్మణుడి పాత్రలో మరో షేడ్ ఉంటుందట. దానికి సంబంధించినదే ఈ సూటూ బూటూ లుక్ అని టాక్. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఆర్య, పరుగు’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ మా సంస్థలో హీరోగా నటిస్తున్న మూడో చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
అల్లు అర్జున్–హరీష్ శంకర్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో మా సంస్థ సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకునేలా దర్శకుడు హరీష్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు’’ అన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్– లక్ష్మణ్, కళ: రవీందర్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, కథనం: రమేశ్‌రెడ్డి–దీపక్‌రాజ్, కెమేరా: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.